పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ప్రత్యేక పౌర విమానాల ద్వారా ఈ రోజు తిరిగి తీసుకువచ్చిన భారతీయులు 1300 మంది
ఇప్పటి వరకు భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి వచ్చినవారు 17 వేల 4 వందల మంది
Posted On:
07 MAR 2022 5:28PM by PIB Hyderabad
భారతీయ పౌరులను రక్షించడానికి ‘ఆపరేషన్ గంగా’ కింద, ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి 7 ప్రత్యేక పౌర విమానాల ద్వారా ఈ రోజు 1314 మంది భారతీయులు తిరిగి వచ్చారు. దీంతో 2022 ఫిబ్రవరి 22న ప్రత్యేక విమానాలు ప్రారంభమైనప్పటి నుండి 17 వేల 4 వందల మందికి పైగా భారతీయులను వెనక్కి తీసుకువచ్చాయి. 73 ప్రత్యేక పౌర విమానాల ద్వారా తరలి వచ్చిన భారతీయుల సంఖ్య 15, 206 కి చేరుకుంది. ఒక C-17 బారత వాయసేన విమానం, 201 మంది భారతీయులతో ఈరోజు సాయంత్రం తిరిగివచ్చే అవకాశం ఉంది. గంగా ఆపరేషన్‌లో భాగంగా 2056 మంది ప్రయాణికులను వెనక్కి తీసుకురావడానికి భారతీయ వాయుసేన ఇంతకు ముందు 10 విమానాలను కేటాయించింది.
ఈ రోజు ప్రత్యేక పౌర విమానాలలో, 4 న్యూఢిల్లీలో దిగగా, 2 ముంబైకి చేరుకున్నాయి. సాయంత్రం ఆలస్యంగా ఒక విమానం బయలుదేరుతుంది. బుడాపెస్ట్ నుండి 5 విమానాలు, బుకారెస్ట్,సుసెవా నుండి ఒక్కొక్కటి రానున్నాయి.
రేపు, సుసెవా నుంచి 2 ప్రత్యేక పౌర విమానాలు బయల్దేరతాయని, 400 మందికి పైగా భారతీయులను అవి స్వదేశానికి తీసుకువస్తాయని భావిస్తున్నారు.
*****
(Release ID: 1803824)
Visitor Counter : 155