ప్రధాన మంత్రి కార్యాలయం

యూక్రేన్ అధ్యక్షుడు శ్రీ‌ వలోడిమిర్ జెలెంస్కీ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 07 MAR 2022 12:50PM by PIB Hyderabad

యూక్రేన్ అధ్యక్షుడు శ్రీ‌ వలోడిమిర్ జెలెంస్కీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంభాషించారు.

సంఘర్షణ స్థితి ని గురించి, యూక్రేన్ కు మరియు రష్యా కు మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపుల ను గురించి అధ్యక్షుడు శ్రీ జెలెంస్కీ ప్రధాన మంత్రి కి వివరించారు. కొనసాగుతూ ఉన్న సంఘర్షణ పట్ల, ఇంకా తత్ఫలితం గా తలెత్తిన మానవీయ సంక్షోభం పట్ల ప్రధాన మంత్రి ప్రగాఢ ఆందోళన ను వ్యక్తం చేశారు. హింస కు తక్షణం స్వస్తి పలకాలి, సమస్యల ను శాంతియుతం గా పరిష్కరించుకోవాలి, ఉభయ పక్షాల మధ్య నేరుగా చర్చలు జరగాలి అని భారతదేశం ఎల్ల వేళ ల కోరుతూ వస్తున్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

యూక్రేన్ నుంచి 20,000 మంది కి పైగా భారతీయ పౌరుల ను ఖాళీ చేయించేందుకు మార్గాన్ని సుగమం చేసినందుకు యూక్రేన్ అధికార వర్గానికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ యూక్రేన్ లో ఉన్న మిగతా భారతీయ విద్యార్థుల సురక్షత, ఇంకా వారి భద్రత విషయం లో ఆయన తన ప్రగాఢమైన ఆవేదన ను వ్యక్తం చేశారు. వారిని త్వరిత గతి న సురక్షితం గా ఖాళీ చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

 

***



(Release ID: 1803567) Visitor Counter : 155