ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటి & స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మార్చి 7 & 8 తేదీలలో బెంగళూరులో జరిగే ఇండియా గ్లోబల్ ఫోరమ్‌కు హాజరుకానున్నారు
30 యునికార్న్‌ల వ్యవస్థాపకులు & సీఈఓలను కలవడంతో పాటు వారితో మంత్రి సంభాషించనున్నారు
ఇండియా గ్లోబల్ ఫోరమ్, బెంగుళూరు ‘ది న్యూ ఇండియా ఇంక్.’ టెక్ఎడ్‌లో లోతుగా డైవ్ చేయడానికి అద్భుతమైన వేదికను అందిస్తుంది - రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
06 MAR 2022 1:10PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మార్చి 7 మరియు 8 తేదీలలో బెంగళూరులో జరిగే ఇండియా గ్లోబల్ ఫోరమ్ (ఐజీఎఫ్)కి హాజరవుతారు. ఐజీఎఫ్ అనేది అంతర్జాతీయ వ్యాపారం మరియు ప్రపంచ నాయకుల కోసం ఎజెండా సెట్టింగ్ ఫోరమ్. ఇది అంతర్జాతీయ కార్పొరేట్‌లు మరియు విధాన రూపకర్తలు తమ రంగాలలో మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన భౌగోళిక రంగాలలోని వాటాదారులతో పరస్పరం చర్య చేయగల ప్లాట్‌ఫారమ్‌ల ఎంపికను అందిస్తుంది. బెంగుళూరులో ఐజిఎఫ్‌కి ఇది మొదటి ఎడిషన్. గత ఎడిషన్‌లు దుబాయ్ & యూకేలో నిర్వహించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, డైరెక్టర్ జనరల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డా.టెడ్రోస్ అథనోమ్, యూకే మాజీ పిఎం టోనీ బ్లెయిర్ వంటి గౌరవనీయ వక్తలు మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రరిశ్రమకు చెందిన ఇతర నేతలు ప్రసంగించారు.
కోవిడ్ మహమ్మారిని తట్టుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశం సంస్కరించబడిన, దృఢ నిశ్చయంతో & దృఢమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మార్చిలో ఈ ఫోరమ్ జరుగుతోంది. మహమ్మారి కారణంగా విస్తృతంగా అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారతదేశం 2021 సంవత్సరంలో నెలకు 3 కంటే ఎక్కువ చొప్పున 42 యునికార్న్‌లను సృష్టించింది. దీని మొత్తం విలువ సుమారు $90 బిలియన్లు. 60,000 కంటే ఎక్కువ నమోదిత స్టార్టప్‌లతో భారతదేశం ఇప్పుడు 3వ అతిపెద్ద & ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థలలో ఒకటిగా మారింది.
గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉత్పత్తులు మరియు సేవల డిజిటలైజేషన్‌లో దేశం అపూర్వమైన వృద్ధిని సాధించింది. 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడం, 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారు మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను విస్తృతం చేయడం మరియు ప్రభుత్వ ప్రోత్సాహంతో డిజిటల్ ఎకానమీగా అభివృద్ధి చేయడం మరియు ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన $ 5 ట్రిలియన్ల లక్ష్యం దిశగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని గణనీయంగా ఉత్ప్రేరకపరచబోతోంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్-2022 డిజిటల్ స్పేస్‌లో వృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగాల కోసం అవకాశాలను విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది.
బెంగళూరులోని ఐజీఎఫ్ సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఇలా పేర్కొన్నారు - “భారతదేశం కోవిడ్‌కు అద్భుతమైన స్థితిస్థాపకతను మరియు బలమైన బౌన్స్‌ను ప్రదర్శించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భరభారత్ ఆర్థిక ప్రణాళికతో భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ ప్రధాన పరివర్తన మరియు విస్తరణ మధ్యలో ఉంది. డిజిటల్ మరియు సాంకేతిక అవకాశాలు ఈ మర్పునకు మరియు భారతదేశం యొక్క టెక్కేడ్‌కు నాయకత్వం వహిస్తున్నాయి. ఇండియా గ్లోబల్ ఫోరమ్ బెంగుళూరు 'ది న్యూ ఇండియా ఇంక్.'కు సంబంధించినఈ టెకాడేలో లోతుగా డైవ్ చేయడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది.
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఫోరమ్‌కు హాజరవడంతో పాటు మార్చి 7వ తేదీన సాయంత్రం 5:00 గంటలకు - ది న్యూ ఇండియా ఇంక్ అనే సెషన్స్‌లో ప్రసంగిస్తారు, ఉదయం 8:30 గంటలకు యునికార్న్స్‌తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 12:30 గంటలకు గ్లోబల్ సప్లై చైన్ బోర్డ్‌రూమ్ ఉంటుంది. మార్చి 8న సాయంత్రం 5:00 గంటలకు ముగింపు సెషన్ ఉంటుంది.
యునికార్న్స్ సెషన్‌లో 30 మంది సీఈఓలు & యునికార్న్స్ వ్యవస్థాపకులు మంత్రితో బహిరంగ చర్చలు జరుపుతారు. గత 6 నెలలుగా మంత్రి దేశవ్యాప్తంగా స్టార్టప్‌లతో చురుకుగా సమావేశమై వారితో సంభాషిస్తున్నారు మరియు వారికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయాన్ని అందజేస్తున్నారు.
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గత సంవత్సరం ఐజీఎఫ్ దుబాయ్‌కి హాజరయ్యారు అక్కడ ఆయన "లైసెన్స్ టు స్కిల్" సెషన్‌కు హాజరయ్యారు. అందులో గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా ఎదగడానికి భారతదేశం చేపట్టిన ప్రయాణం గురించి మాట్లాడారు. ఫోరమ్‌కు హాజరైన వివిధ గ్లోబల్ స్టేక్‌హోల్డర్‌లచే సెషన్‌ను చాలా మెచ్చుకున్నారు. ఐజీఎఫ్ బెంగళూరులో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్, విదేశీ వ్యవహారాలు & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
శ్రీమతి మీనాక్షిలేఖీ మరియు ఇతర ప్రముఖ సీఈఓలు & పరిశ్రమకు చెందిన నాయకులు కూడా పాల్గొంటారు.
***
(Release ID: 1803491)
Visitor Counter : 164