పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేడు ఉక్రెయిన్ పోరుగుదేశాల నుంచి 2100మందికి పైగా భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చిన ప్ర‌త్యేక విమానాలు


నేటివ‌ర‌కూ 15వేల‌, 9వంద‌ల మందికిపైగా భార‌తీయుల‌ను ప్ర‌త్యేక విమానాలు స్వ‌దేశానికి చేర్చాయి

Posted On: 06 MAR 2022 3:57PM by PIB Hyderabad

ఆప‌రేష‌న్ గంగ కింద భార‌తీయ పౌరుల‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకురావ‌డంలో భాగంగా, 11 ప్ర‌త్యేక పౌర విమానాలు ఉక్రెయిన్ పొరుగుదేశాల నుంచి నేడు 2153 మందిని వెన‌క్కి  తీసుకువ‌చ్చారు. ప్ర‌త్యేక విమానాలు 22 ఫిబ్ర‌వ‌రి 2022న ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు మొత్తం 15వేల 9వంద‌ల మంది భార‌తీయుల‌ను స్వదేశానికి తీసుకు వ‌చ్చారు. దాదాపు 66 ప్ర‌త్యేక పౌర విమానాలు త‌ర‌లించిన భార‌తీయ పౌరుల సంఖ్య 13852కి చేరింది. నేటి వ‌ర‌కు ఆప‌రేష‌న్ గంగ‌లో భాగంగా  భార‌తీయ వైమానిక ద‌ళ విమానాలు 2056 మంది ప్ర‌యాణీకుల‌ను వెన‌క్కి తీసుకురావ‌డ‌మే కాక ఈ దేశాల‌కు 26 ట‌న్నుల స‌హాయ సామాగ్రిని మోసుకువెళ్ళేందుకు 10 శార్టీలు చేశాయి. 
పౌరుల‌ను వెన‌క్కి తీసుకువ‌స్తున్న ప్ర‌త్యేక విమానాల‌లో 9 న్యూఢిల్లీలో దిగ‌గా, 2 ముంబాయి విమానాశ్ర‌యంలో నేటి ఉద‌యం దిగాయి. ఈ విమానాల‌లో 6 బుడాపెస్ట్ నుంచి, 2 బుకారెస్ట్ నుంచి, 2 రెజెస్జోవ్ నుంచి, 1 కొసైస్ నుంచి  తిరిగి వ‌చ్చాయి. 
సోమ‌వారం, 8 ప్ర‌త్యేక విమానాలు బుడాపెస్ట్ (5), సుసేవా (2), బుకారెస్ట్ (1) నుంచి 1500మందికి పైగా భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌స్తాయ‌ని భావిస్తున్నారు. 

 

***


(Release ID: 1803445) Visitor Counter : 156