రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని పురానా ఖిలాలో నిర్వహించిన హెల్త్ హెరిటేజ్ వాక్‌లో పాల్గొ్న్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా
- జన్ ఔషధి దివస్ వారోత్సవాల 4వ రోజున "జన్ ఔషధి జన్ జాగరణ్ అభియాన్ - హెరిటేజ్ వాక్" నిర్వహణ
प्रविष्टि तिथि:
04 MAR 2022 2:29PM by PIB Hyderabad
నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు జన్ ఔషధి జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు న్యూఢిల్లీలోని పురానా ఖిలాలో జరిగిన హెల్త్ హెరిటేజ్ వాక్‌లో కేంద్ర ఆరోగ్య మరియు రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జన ఔషధి దివస్ వారోత్సవాల 4వ రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానవులకు నడక, శారీరక శ్రమ చేయడం ద్వారా లభించేలా వివిధ ఫలితాలను గురించి వివరించేందుకు మరియు జన ఔషధిలో అందుబాటులో ఉన్న నాణ్యమైన మరియు సరసమైన జనరిక్ మందుల సందేశాన్ని వ్యాప్తి చేయడానికి 09 నగరాల్లోని 10 ప్రదేశాలలో హెల్త్ హెరిటేజ్ వాక్‌లు నిర్వహించారు. ఫార్మాస్యూటికల్స్ మరియు మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) వారమంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 1 మార్చి, 2022 నుండి జన్ ఔషధి దివస్ యొక్క వారం పొడువు వేడుకలు ప్రారంభమయ్యాయి. పీఎంబీఐ ఇప్పటికే దేశవ్యాప్తంగా 2022 మార్చి 1, 2వ తేదీ మరియు మార్చి 3వ తేదీలలో జన్ ఔషధి సంకల్ప్ యాత్ర, మాతృ శక్తి సమ్మాన్, జన్ ఔషధి బాల మిత్రలను నిర్వహించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో 75 ఏళ్ల ప్రగతిశీల భారతదేశ నిర్మాణాన్ని పురస్కరించుకుని, అక్కడి ప్రజలు, సంస్కృతి, విజయాలు సాధించిన ఘనమైన చరిత్రను తెలియపరిచేలా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
***
(रिलीज़ आईडी: 1803225)
आगंतुक पटल : 155