ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఎన్ఐసి టెక్ కాన్ క్లేవ్ 2022 ను ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


ప్రత్యేకించి ఇ-గవర్నెన్స్ లో వర్తించే ఎమర్జింగ్ టెక్నాలజీలపై కాన్ క్లేవ్ దృష్టి

Posted On: 04 MAR 2022 9:16AM by PIB Hyderabad

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐసి) టెక్ కాన్ క్లేవ్ 2022 ను ఏర్పాటు చేసింది.‘‘నెక్ట్స్ జెన్ టెక్నాలజీస్ ఫర్ డిజిటల్ గవర్నమెంట్" అనే ఇతివృత్తం తో ముఖ్యంగా -గవర్నెన్స్ లో వర్తించే ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై కాన్ క్లేవ్ దృష్టి సారించింది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

ప్రారంభించిన సదస్సు లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) కార్యదర్శి శ్రీ కె. రాజారామన్, మెయిటీ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్, ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు.

కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

 ప్రసంగిస్తూ, ప్రభుత్వం లోనూ, పాలన లోనూ సాంకేతిక టెక్నాలజీని వతీసుకురావడంలో ఎన్ఐసి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

ప్రభుత్వానికి సాంకేతిక పరిజ్ఞాన భవిష్యత్తు కోసం అంచనా ప్రణాళిక ప్ర ఎన్ఐసి డిఎన్ఎ లో ఇమిడి ఉందని ఆయన అన్నారు.

 

మీటీ కార్యదర్శి శ్రీ కె. రాజారామన్ మాట్లాడుతూ, ఎన్ఐసి సృజనాత్మక ఉత్పత్తులను అభినందించారు .పౌరుల కోసం చేయగల సృజనాత్మక పని మార్గాలు, కొత్త పనులను రూపొందించడానికి సదస్సు దోహదపడుతుందని అన్నారు. ట్రాన్స్ఫర్మర్మేటివ్  ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్, ఇఆఫీస్ కు గానూ ఎన్ఐసి టీమ్ కు ఆయన అభినందనలు తెలిపారు.

 

మీటీ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ ప్రభుత్వ మొత్తం దృక్పథాన్ని మార్చడం,సేవలను అంతరాయం లేకుండా, సులభంగా అందుబాటులో ఉంచడం, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం ,వ్యాపారం చేయడం వంటి వాటికి పెద్ద వేదికలను నిర్మించడంలో మెయిటీ , ఎన్ఐసి నిరంతర ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు.

 

గౌరవ ప్రధాని ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ డిజిటల్ ప్రొఫైల్ ను మార్చిందని ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ తన స్వాగత ప్రసంగంలో తెలిపారు.

బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లు, మొబైల్ యాప్ లు, డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైబ్రెంట్ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థల్లో అద్భుతమైన వృద్ధి మన చుట్టూ టెక్నాలజీ నేతృత్వ  ఆవిష్కరణకు దారితీస్తున్నాయని అన్నారు.

 

ఎన్ఐసిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్  #75 డిజిటల్ సొల్యూషన్స్ ఫ్రం

ఎన్ఐసి- పేరుతో బుక్ ను విడుదల చేశారు.

పౌరులు, వ్యాపారాలు , ప్రభుత్వం కోసం

ఎన్ఐసి అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల సాయంతో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ద్వారా సాధించిన వివిధ ప్రభుత్వ పథకాలు , చొరవల ప్రయోజనాలను బుక్ వివరిస్తుంది. బుక్ https://uxdt.nic.in/flipbooks/75-Digital-Solutions-from-NIC/ వద్ద లభ్యం అవుతుంది:

 

ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ, ఎడిట్ చేసిన "సిటిజన్ ఎంపవర్ మెంట్ త్రూ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇన్ గవర్నమెంట్" అనే పుస్తకాన్ని కూడా సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ విడుదల చేశారు. పుస్తకం వివిధ రంగాల సాంకేతిక నేతృత్వ మార్పు,,పాన్ ఇండియా డిజిటల్ మౌలిక సదుపాయాలు ,సేవలపై పనిచేసే ఎన్ఐసి అధికారుల దృక్పథం  నుంచి సమర్పించిన వాటి పరిణామాన్ని వివరిస్తుంది.

 

పెర్శిస్టంట్ సిస్టమ్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ దేశ్ పాండే డిజిటల్ ప్రభుత్వం కోసం నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీస్ పై కీలకోపన్యాసం చేశారు. నానో పారిశ్రామిక వేత్త భావనపై దృష్టి సారించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు.డేటా & మెషిన్ లెర్నింగ్, అప్లికేషన్లు - పి లు, మెటావర్స్, వెబ్3 , క్రిప్టో ,సెక్యూరిటీ -గోప్యత మొదలైనవి రాబోయే కాలంలో పెట్టుబడి పెట్టడానికిఅభివృద్ధి చేయగల సాంకేతికత లని  ఆయన అన్నారు.

 

సిస్కో ఇండియా, సార్క్ ప్రెసిడెంట్ శ్రీమతి డైసీ చిట్లపిల్లే తన కీలకోపన్యాసంలో, టెక్నాలజీ భారతదేశం గొప్ప మిత్రుడని అన్నారు. పని నమూనాలు పునర్నిర్వచించబడుతున్న, కొత్త వ్యాపార నమూనాలు పునఃరూపకల్పన జరుగుతున్న సమయం లో.టెక్నాలజీని మరింత మంచి , సమ్మిళిత వృద్ధికి ఉపయోగించవచ్చునని అన్నారు.

 

ఎన్ఐసి టెక్ కాన్ క్లెవ్ -2022 తాజా ఐసిటి టెక్నాలజీల పైన, ఇంకా అత్యాధునిక టెక్నాలజీలు , పరిశ్రమ ఉత్తమ విధానాలపై వాటి ఉపయోగ కేసులపై మంత్రిత్వ శాఖలు/విభాగాల ఐటి మేనేజర్లను సుసంపన్నం చేస్తుంది. రాష్ట్రాల్లో అమలు చేయగల కొత్త టెక్నాలజీలు , అనువర్తనాలను మరింత మెరుగ్గా తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల ఐటి కార్యదర్శులకు ఇది ఒక వేదికను అందిస్తుంది. ఇది పరిశ్రమ, ప్రభుత్వ ఐటి నిర్వాహకుల మధ్య అనుసంధానం ఏర్పరుస్తుంది. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా

ప్రభుత్వ  పని తీరు లో సామ ర్థ్యాన్ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడుతుంది, పౌరులకు సేవలను అత్యున్నత ప్రమాణాలతో అందించడానికి సహాయకారిగా నిలుస్తుంది.

 

*****



(Release ID: 1802933) Visitor Counter : 161