ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

46వ సివిల్ అకౌంట్స్ డే సందర్భంగా ఈ- బిల్ వ్యవస్థను ప్రారంభించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


కొత్త ఈ- బిల్ సిస్టం తో కాగిత రహిత సబ్మిషన్ కు, బిల్లుల డిజిటల్ ప్రాసెసింగ్ ముగింపునకు వీలు

Posted On: 02 MAR 2022 5:15PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు 46వ సివిల్ అకౌంట్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కోసం ఈ-బిల్లు వ్యవస్థను ప్రారంభించారు.

కొత్త వ్యవస్థ దశలవారీగా బిల్లుల సమర్పణ బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్ మొత్తం ప్రక్రియను పూర్తి కాగిత రహితం,  పారదర్శకం చేస్తుంది.  "డిజిటల్ ఇండియా" దార్శనికతను సాకారం చేసుకోవడంలో, వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ఇది ఒక ప్రధాన ముందడుగు.

సిస్టమ్ లక్ష్యాలు:

) ప్రభుత్వ వెండర్ లు/సప్లయర్ లు అందరూ కూడా తమ బిల్లులు/క్లెయింలను ఎప్పుడైనా, ఎక్కడైనా సబ్మిట్ చేసే వీలు కల్పిస్తుంది.

బి) సరఫరాదారులు ,ప్రభుత్వ అధికారుల మధ్య ప్రత్యక్ష కలయిక అవసరాన్ని తొలగిస్తుంది.

సి) బిల్లులు/క్లెయింల ప్రాసెసింగ్ లో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. 

డి)  "ఫస్ట్- ఇన్ -ఫస్ట్ -అవుట్" (ఎఫ్ ఐ ఎఫ్ వో) విధానం ద్వారా బిల్లుల ప్రాసెసింగ్ లో విచక్షణను తగ్గిస్తుంది.

ప్రస్తుతం, ప్రభుత్వానికి వివిధ వస్తువులు సేవల సరఫరాదారులు తమ బిల్లులను  భౌతికంగా, సిరా తో సంతకం చేసిన కాపీలను భారత ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాలకు సమర్పించ వలసి వస్తోంది. అదేవిధంగా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ క్లెయింల హార్డ్ కాపీలను సమర్పించాల్సిన అవసరం ఉంది.  బ్యాక్ ఎండ్ లో కూడా, బిల్లుల ప్రాసెసింగ్ భౌతిక ,డిజిటల్ విధానాల మిశ్రమ పద్ధతి లో జరుగుతోంది. అందుచేత, సరఫరాదారులు/విక్రేతలు లేదా వారి ప్రతినిధులు బిల్లులను సమర్పించడానికి కార్యాలయాలను సందర్శించాలి.  అంతే గాక, వారు తమ బిల్లుల ప్రాసెసింగ్ స్థితిని ట్రాక్ కూడా చేయలేకపోతున్నారు.

ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన ఈ-బిల్ సిస్టమ్ కింద, విక్రేతలు/సప్లయర్ లు డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఏ సమయంలోనైనా తమకు  సౌలభ్యంగా ఇళ్లు/ఆఫీసుల నుంచి సపోర్టింగ్ డాక్యుమెంట్ లతో పాటుగా తమ బిల్లులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ సంతకం లేని వారికి, ఆధార్ ఉపయోగించి ఇ-సైన్ సదుపాయం కూడా ఉంటుంది. అందువల్ల, సప్లయర్ లు ఈ పని కోసం సంబంధిత ఆఫీసులను సందర్శించాల్సిన అవసరం ఇక ఉండదు.

బ్యాక్ ఎండ్ లో కూడా, అందుకున్న ఎలక్ట్రానిక్ బిల్లును ప్రతి దశలోనూ అధికారులు డిజిటల్ గా ప్రాసెస్ చేస్తారు.  చివరగా, చెల్లింపులను కూడా విక్రేత బ్యాంకు ఖాతాకు డిజిటల్ గా క్రెడిట్ చేస్తారు. విక్రేత/సప్లయర్ తమ బిల్లులను ఆన్ లైన్ లో ప్రాసెస్ చేసే స్థితిని ట్రాక్ కూడా చేయ గలుగుతారు. అలా, కొత్త వ్యవస్థ చాలా సమర్థత పారదర్శకతను తెస్తుంది . ఇది భారత ప్రభుత్వ పెద్ద పౌర కేంద్రిత నిర్ణయం.

ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని వ్యయ శాఖలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (పిఎఫ్ ఎంఎస్) డివిజన్ ఈ-బిల్లు వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఎఫ్ ఐఎఫ్ వో) విధానం ద్వారా బిల్లులను ప్రాసెస్ చేస్తారు.

ముందుగా దిగువ పేర్కొన్న తొమ్మిది మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ ల తొమ్మిది పే -అకౌంటింగ్ యూనిట్ ల్లో ఈ సిస్టమ్ అమలు అవుతుంది: :

1) పిఎవో , మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ

2) పిఎవో, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్

3)  పిఎవో, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

4) పిఎవో (సిజిఎ హెచ్ క్యూ), డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ , మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్

 5) పిఎవో (పిఎఫ్ఎంఎస్ డివిజన్), డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ , మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్

6) పిఎవో, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ   

7) పిఎవో (జనాభా లెక్కలు), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ    

8) పిఎవో , ఉక్కు మంత్రిత్వ శాఖ

9) పిఎవో (ఎన్ ఐ సి), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ     

-బిల్లు వ్యవస్థను 2022-23లో దశలవారీగా ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో అమలు చేస్తారు.

లక్షలాది మంది విక్రేతలు/సరఫరాదారులకు వ్యాపారాన్ని సులభతరం చేయడం, సౌకర్యాన్ని పెంపొందించడంతోపాటుగా, ఈ-బిల్లు వ్యవస్థ పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉంటుంది, ఏటా కోట్ల కాగితపు బిల్లులను సమర్పించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. తద్వారా ప్రతి సంవత్సరం టన్నుల కాగితాలను ఆదా చేస్తుంది. ఈ-బిల్ సిస్టమ్ డాక్యుమెంట్ లను తిరిగి పొందడం కోసం విస్తృతమైన డిజిటల్ స్టోరేజీ సదుపాయాన్ని కలిగి ఉంది. అలాగే  బలమైన ఆడిట్ ట్రయల్ ని కలిగి ఉంది.

 

***


(Release ID: 1802456) Visitor Counter : 224