ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

177.79 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 8 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.60%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 7,554

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 85,680

వారపు పాజిటివిటీ రేటు 1.06%

Posted On: 02 MAR 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 8 లక్షలకు పైగా ( 8,55,862 ) డోసులతో కలిపి, 177.79 కోట్ల ( 1,77,79,92,977 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,05,01,806 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,01,654

రెండో డోసు

99,68,740

ముందు జాగ్రత్త డోసు

41,86,679

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,09,677

రెండో డోసు

1,74,45,792

ముందు జాగ్రత్త డోసు

62,54,208

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,49,28,343

రెండో డోసు

2,81,84,270

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,19,32,210

రెండో డోసు

44,51,55,748

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,22,93,199

రెండో డోసు

18,03,66,630

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,64,28,876

రెండో డోసు

11,23,38,844

ముందు జాగ్రత్త డోసు

96,98,107

ముందు జాగ్రత్త డోసులు

2,01,38,994

మొత్తం డోసులు

1,77,79,92,977

 

 

గత 24 గంటల్లో 14,123 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,23,38,673 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 7,554 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 85,680. ఇది మొత్తం కేసుల్లో 0.20 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 7,84,059 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.91 కోట్లకు పైగా ( 76,83,82,993 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.06 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.96 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1802354) Visitor Counter : 141