సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఎన్‌ఎఫ్‌ఎఐ కి చేరిన ప్రముఖ నిర్మాతల ద్వయం సుమిత్రా భావే మరియు సునీల్ సుక్తాంకర్ నిర్మించిన చిత్రాలు


ప్రస్తుత తరం సామాజిక పరిస్థితులు అద్దం పట్టే విధంగా చిత్రాలు నిర్మించిన సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్
సమకాలీన పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులు, విద్యార్థులు, ఔత్సాహిక నిర్మాతలకు చిత్రాలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి.. ఎన్‌ఎఫ్‌ఎఐ డైరెక్టర్

Posted On: 01 MAR 2022 2:37PM by PIB Hyderabad
ప్రముఖ నిర్మాతల ద్వయం సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్ నిర్మించిన చిత్రాలు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఎఐ) గ్రంధాలయంలో  చేరాయి. విలువైన సేకరణను ఎన్‌ఎఫ్‌ఎఐ  డైరెక్టర్ ప్రకాష్ మగ్దూమ్‌కి శ్రీ  సునీల్ సుక్తాంకర్  అందజేశారు. అరుదైన చిత్రాలను సేకరించి భద్రపరుస్తున్న ఎన్‌ఎఫ్‌ఎఐ భాండాగారంలో ఈ చిత్రాలు చేరుతాయి. సమకాలీన అంశాలపై   సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్ నిర్మించిన చిత్రాలు అనేక ప్రశంసలు అందుకుని గుర్తింపు పొందాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరు నిర్మించిన చిత్రాలు అనేక అవార్డులు అందుకున్నాయి. దేశ విదేశాల్లో వీటికి గుర్తింపు లభించింది. గత ఏడాది శ్రీమతి సుమిత్ర భావే పరమపదించారు. 
సినీ రంగానికి  ఎన్‌ఎఫ్‌ఎఐ అందిస్తున్న సేవలను  శ్రీ  సునీల్ సుక్తాంకర్ ప్రశంసించారు. '“ మా చిత్ర నిర్మాణ సమయంలో ఎన్‌ఎఫ్‌ఎఐ అనేక విధాలుగా తోడ్పాటు అందించింది. మేము నిర్మించిన  చిత్రాలను భద్రపరిచేందుకు ఎన్‌ఎఫ్‌ఎఐ ముందుకు రావడం ఆనందంగా ఉంది.   కొత్త తరానికి అందుబాటులో ఉండేలా మెటీరియల్ డిజిటల్ విధానంలో వీటిని భద్రపరుస్తారని   నేను ఆశిస్తున్నాను." అని శ్రీ  సునీల్ సుక్తాంకర్ అన్నారు. 
 
 
ఎన్‌ఎఫ్‌ఎఐ కి చేరిన చిత్రాలలో 35 ఎంఎం, 16 ఎంఎం చిత్రాలు వున్నాయి. వీటిలో  35 ఎంఎం లో నిర్మించిన దహవి ఫా (2002), బధా (2006), హా భారత్ మఝా (2012) మరియు లఘు చిత్రం  జిద్ (2004), 16 ఎంఎం లో నిర్మించిన    జిందగీ జిందాబాద్ (1997)  మరియు బాయి (1985), పానీ (1987), మరియు లాహా (1994)  ప్రింట్‌లు ఉన్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాత మరియు ఫిల్మ్ సొసైటీ కార్యకర్త విజయ ములే 16 ఎంఎం లో రూపొందించిన  చిత్రం కిషన్ కా ఉదాన్ ఖటోలా కూడా ఎన్‌ఎఫ్‌ఎఐ సేకరణలో చేరింది. 
విలువైన చిత్రాలు ఎన్‌ఎఫ్‌ఎఐకి చేరడం పట్ల సంస్థ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ హర్షం వ్యక్తం చేశారు. ' సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్ నిర్మించిన చిత్రాలు జాతీయ అవార్డులు అందుకున్నాయి. వీటిని అత్యంత విలువైన సంపదగా ఎన్‌ఎఫ్‌ఎఐ భద్రపరచడం జరుగుతుంది. చిత్రాలను ఎన్‌ఎఫ్‌ఎఐకి అందించాలని నేను గత ఏడాది శ్రీమతి సుమిత్ర ను అభ్యర్ధించాను. అయితే, ఆమె దురదృష్టవశాత్తు మరణించారు. సమకాలీన అంశాలపై సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్ చిత్రాలు నిర్మించారు. ప్రస్తుత తరానికి చెందిన అనేక అంశాల ఆధారంగా ఈ చిత్రాల నిర్మాణం జరిగింది. వీటి ద్వారా సమకాలీన పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులు, విద్యార్థులు, ఔత్సాహిక నిర్మాతలకు చిత్రాలు విలువైన సమాచారాన్ని పొందుతారు' అనిశ్రీ ప్రకాష్ మగ్దూమ్ అన్నారు .చిత్ర నిర్మాతలు మరియు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చి తాము నిర్మించిన చిత్రాలను   ఎన్‌ఎఫ్‌ఎఐకి అందించాలని  ఆయన విజ్ఞప్తి చేశారు.

 

మరాఠీలో  సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్ అనేక చిత్రాలు, డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలను నిర్మించి అనేక  టీవీ కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందారు.   వీరిద్దరూ కలిసి నిర్మించిన  దాదాపు ప్రతి చిత్రం అనేక జాతీయ మరియు అంతర్జాతీయ ప్రశంసలు గెలుచుకుంది. వీటిలో  సుమిత్ర భావే నిర్మించిన   మొదటి లఘు చిత్రం బాయి (1985) తో పాటు  ఇటీవల నిర్మించిన  కాసవ్ (2017) మరియు దితీ (2019),ఉన్నాయి. వీరు నిర్మించిన చిత్రాల జాబితాలో  పానీ (1987), ముక్తి (1990), చకోరి (1992),  దోఘీ (1995), దహవి ఫా (2002), వాస్తుపురుష్ (2002), దేవ్‌రాయ్ (2002) ఆస్తు ( 2016)ఉన్నాయి. 
డిజిబీటాబీటాక్యామ్ఉమాటిక్డిఎల్‌టి టేపులు డివిమినీడివి మరియు విహెచ్‌ఎస్ ఫార్మాట్‌ల వంటి విభిన్న మాగ్నెటిక్ మీడియా పద్ధతుల్లో చిత్రాలను పొందుపరచడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త శంతను రావు కిర్లోస్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం కర్తాఫీచర్ ఫిల్మ్‌లు జిందగీ జిందాబాద్ (1997), దేవ్రాయ్ (2004), ఏక్ కప్ చాయ్  (2009), మోర్ దేఖ్నే జంగిల్ మెయిన్ (2010), లఘు చిత్రాలు  ముక్తి (1990), చకోరి (1992), లహా (1994), జిద్ (2004), బేవక్త్ బారిష్ (2007), మమతా కీ చావోన్ మేఏకలవ్యసంవాద్ మరియు సరాషిడాక్యుమెంటరీ చిత్రాలు  పార్టింగ్ విత్  గౌతమ్ చ్య ఐచ్చి శాల, ఫిలిగ్రిమ్స్ అఫ్ లైట్,  మరియు టీవీ కధాంశాలు  కథా సరిత (2011), అఖేరాచి రాత్ర మరియు భాయిస్ బరాబర్ ఎపిసోడ్‌లు ఉన్నాయి.  విద్యా కార్యక్రమం గా రూపొందించిన  నాటిగోటి, హౌ షల్  ఐ అడ్రస్ యు, అడుగుల మడుగుల  లఘు చిత్రాల ప్రింట్లు కూడా ఎన్‌ఎఫ్‌ఎఐకి అందించారు. 
అంతకుముందు 2014-15లో సుమిత్ర భావే మరియు సునీల్ సుక్తాంకర్ లు 35 ఎంఎం లో కొన్ని చిత్రాలను ఎన్‌ఎఫ్‌ఎఐకి అందించారు. తన 75 వ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీమతి సుమిత్ర తాను చేతితో రాసిన 10 చిత్రాల కధలను ఎన్‌ఎఫ్‌ఎఐకి అందించారు. 
 
***


(Release ID: 1802349) Visitor Counter : 163