భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

కేంద్ర‌ బడ్జెట్- 2022లో సైన్స్ అండ్ టెక్నాలజీ


- బ‌డ్జెట్ అమలు దశలను చర్చించడానికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, భారత ప్రభుత్వంలోని 16 మంత్రిత్వ శాఖలు/ విభాగాలను ఒక చోట చేర్చుతుంది

-ప్లీనరీ సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి మోడీ

Posted On: 28 FEB 2022 10:51AM by PIB Hyderabad

కేంద్ర బడ్జెట్ 2022 కింద ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేయడానికి భారత ప్రభుత్వం వివిధ రంగాలలో  వ‌రుస‌గా వెబ్‌నార్ల శ్రేణిని నిర్వహిస్తోంది. వెబ్‌నార్ సిరీస్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు, విద్యాసంస్థలు మరియు పరిశ్రమల నుండి నిపుణులను ఒకే వేదిక పైకి తీసుకువస్తోంది. భారత ప్రభుత్వంలోని అనేక శాస్త్రీయ మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలతో పాటు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పీఎస్ఏ) కార్యాలయం మార్చి 2, 2022న “టెక్నాలజీ-ఎనేబుల్డ్ డెవలప్‌మెంట్” అనే పేరుతో వెబ్‌నార్‌ను నిర్వహిస్తుంది. ప్లీనరీ సెషన్‌లో గౌరవ  ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.  ప్ర‌ధాని ప్ర‌సంగంతో వెబ్‌నార్ ప్రారంభమవుతుంది. వెబ్‌నార్ యొక్క రెండవ భాగంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్ఐఆర్‌), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) నేతృత్వంలో నాలుగు థీమాటిక్ బ్రేక్‌అవే సెషన్‌లు ఉంటాయి. ఆయా సెష‌న్ల‌లో  భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వివిధ విద్యాసంస్థలు మరియు పరిశ్రమల నుండి పాల్గొనేవారు ఉంటారు. సెషన్‌లు కింది అంశాలపై దృష్టి సారిస్తాయి:
ప్రముఖ సాంకేతిక రంగాలలో ఎస్‌&టీ కార్యక్రమాలు
ఉద్యోగ సృష్టి/ ఉపాధిని పెంచే అవకాశాలు
సాంకేతిక స్వావలంబన
అమృత్ కాల్ - ఇండియా @2047 యొక్క విజన్‌ని సాధించడానికి ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న  సమ్మతి భారాన్ని తగ్గించేటప్పుడు సూచించిన చర్య
వెబ్‌నార్ యొక్క మూడవ భాగంలో పైన పేర్కొన్న శాఖల కార్యదర్శులు, మంత్రులు విడిపోయి సెషన్‌ల నుండి యాక్షన్ పాయింట్‌లను చర్చిస్తారు మరియు అమలు దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని సూచిస్తారు.

ఈవెంట్ వివరాలను https://events.negd.in/ లింక్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు.

 

****



(Release ID: 1801927) Visitor Counter : 188