మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భాషా యోగ్యతా పత్రం సెల్ఫీ ప్రచారాన్ని ప్రారంభించిన విద్యా మంత్రిత్వ శాఖ


Posted On: 25 FEB 2022 4:51PM by PIB Hyderabad

సాంస్కృతిక వైవిధ్యాన్ని, బహు భాషావాదాన్ని ప్రోత్సహించడానికి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పెంపొందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ‘భాషా సర్టిఫికెట్ సెల్ఫీ’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

 భాషా సర్టిఫికెట్ సెల్ఫీ ప్రమేయంతో విద్యా మంత్రిత్వ శాఖ, MyGov  అభివృద్ధి చేసిన భాషా సంగం మొబైల్ యాప్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. యాప్‌ని ఉపయోగించడం ద్వారా, ప్రజలు షెడ్యూల్ చేసిన 22 భారతీయ భాషలలో రోజువారీ ఉపయోగమయ్యే 100+ వాక్యాలు నేర్చుకోవచ్చు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రయత్నం , భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలు పొందేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దానిని సాధించడానికి, 75 లక్షల మంది ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

'భాషా సర్టిఫికేట్ సెల్ఫీ' కార్యక్రమం #BhashaCertificateSelfie అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి వారి సోషల్ మీడియా ఖాతాల నుండి సర్టిఫికేట్‌తో కూడిన వారి సెల్ఫీని అప్‌లోడ్ చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తోంది.

విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రమాణీకరించిన యోగ్యతాపత్రాన్ని స్వీకరించడానికి, వినియోగదారు ఆండ్రాయిడ్ iOS వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి, షెడ్యూల్ ఐన 22 భారతీయ భాషల నుండి ఏదైనా భాషను ఎంచుకుని, అన్ని స్థాయిలను పూర్తి చేసి, పరీక్ష సర్టిఫికెట్ పొందాలి.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబరు 31న జరుపుకునే రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని భాషా సంగం మొబైల్ యాప్‌ను విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.

 భాషా సంగం మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం 2020 భారతీయ భాషల ప్రమోషన్‌పై దృష్టి సారించే దృక్పథాన్ని వివరిస్తుంది. ముందుకు వెళుతున్నప్పుడు, అధికారిక క్రెడిట్-ఎర్నింగ్ సిస్టమ్‌తో భాషా అభ్యాసం ఒక నైపుణ్యంగా ప్రచారం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు

 ఆండ్రాయిడ్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.multibhashi.mygov.mygov_app

 ఐవోఎస్ లింక్ :  https://apps.apple.com/in/app/bhasha-sangam/id1580432719

****(Release ID: 1801321) Visitor Counter : 124