గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన జనాభా విద్యను మిషన్ మోడ్‌లో ప్రభుత్వం సవాలుగా తీసుకుంది: మంత్రి అర్జున్ ముండా


విద్యారంగంలో నైతిక విలువలు, సుగుణాల పెంపుదల ఉండాలి: గిరిజన వ్యవహారాల మంత్రి


గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా జార్ఖండ్‌లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులతో వర్చువల్ ఇంటరాక్షన్‌లో మాట్లాడారు


పరీక్షల -ఒత్తిడిని తగ్గించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షా పే చర్చ 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రితో కూడా చర్చించాలి: అర్జున్ ముండా

Posted On: 23 FEB 2022 12:53PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

–కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి,  అర్జున్ ముండా 22 ఫిబ్రవరి, 2022న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జార్ఖండ్‌లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులతో సంభాషించారు

–జార్ఖండ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న 7 పాఠశాలలు కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ప్రధానోపాధ్యాయులు,  విద్యార్థులు మంత్రి  అర్జున్ ముండాతో మాట్లాడారు

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అనిల్ కుమార్ ఝా షెడ్యూల్డ్ తెగ విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ అందిస్తున్న  వివిధ ప్రయోజనకరమైన స్కాలర్‌షిప్ పథకాల గురించి విద్యార్థులకు వివరించారు.

– ముండా పరీక్ష ఒత్తిడి గురించి, పరీక్ష పే చర్చ 2022లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు, విలువలు  నైతికత  ప్రాముఖ్యత, స్కాలర్‌షిప్ పథకాల గురించి చర్చించారు.  తన పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి  అర్జున్ ముండా, జార్ఖండ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులతో 22 ఫిబ్రవరి, 2022న వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం గిరిజన జనాభా విద్యను మిషన్ మోడ్‌లో సవాలుగా తీసుకుందని, వారిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు, గిరిజన పిల్లల విద్యలో అంతరాన్ని పూరించడానికి ప్రభుత్వం కొత్తగా 452 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసింది.  వీటిలో పెద్ద సంఖ్యలో పాఠశాలలను మారుమూల ప్రాంతాలలో,  బ్లాక్ స్థాయిలో ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఈ పాఠశాలలు గిరిజన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నాణ్యమైన విద్యను అందజేస్తాయని మంత్రి తెలిపారు. 2021 నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్ రోజున 50 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారని, వాటిలో 20 జార్ఖండ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  

 ఈ పాఠశాలల్లో విద్య నాణ్యతను పెంచడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని ఫలితంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్  నుండి అనేక మంది టాపర్లు,  విజేతలు ఉద్భవించడాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామని ముండా అన్నారు.  ‘‘సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు విద్యార్థుల పోషణ్ అభియాన్, స్వచ్ఛతా మిషన్ వంటి సామాజిక  దేశ నిర్మాణ కార్యక్రమాలలో కూడా విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యారంగంలో నైతిక విలువలు, సుగుణాల పెంపుదల ప్రధానాంశంగా ఉండాలి. గిరిజన పిల్లలకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్, ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్, నేషనల్ ఫెలోషిప్, విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ వంటి ఉన్నత చదువులు చదవడానికి పెద్ద సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ స్టూడెంట్లు వీలైనంత వరకు వీటిని ఉపయోగించుకోవాలి”అని అన్నారు.

ప్రధాని మంత్రి  న‌రేంద్ర మోదీని ఉటంకిస్తూ, దేశ ప్రధాన మంత్రి ఇంత బిజీ షెడ్యూల్‌లో ప‌రీక్షపే చర్చా (పిపిసి) అనే విశిష్ట కార్యక్రమం ద్వారా విద్యార్థుల‌తో మాట్లాడటం ఇదే తొలిసారి అని అన్నారు. ఒత్తిడికి గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షల్లో పాల్గొనాలని పరీక్షలకు ముందు విద్యార్థులకు ప్రధాన మంత్రి మార్గనిర్దేశం చేస్తున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థుల కోసం పరీక్ష పే చర్చా 2022 కార్యక్రమంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు కూడా ముందుకు వచ్చి ప్రధానితో ఉద్దేశపూర్వకంగా పాల్గొనాలని మంత్రి ఉద్బోధించారు.

పట్టుదలగల విద్యార్థుల అచంచలమైన స్ఫూర్తిని ప్రోత్సహిస్తామని  అర్జున్ ముండా  హామీ ఇచ్చారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అనిల్ కుమార్ ఝా కూడా మాట్లాడారు. మరింత చదవాలనుకునే షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల ప్రయోజనం కోసం అమలవుతున్న వివిధ స్కాలర్‌షిప్‌ల గురించి విద్యార్థులకు వివరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కుజ్రా (లోహర్దగ జిల్లా) విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల సరస్వతీ వందన శ్రావ్యమైన గానంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత  పాఠశాలల అధిపతి తమ పాఠశాల పనితీరు  ఇటీవల సాధించిన అవార్డుల సారాంశాన్ని సమర్పించారు. ఈ సెషన్‌లో చిన్న ‘క్వశ్చన్ అవర్’ కూడా ఉంది, ఇందులో విద్యార్థులు  అర్జున్ ముండాను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీఎఫ్డీసీ కమిషనర్/డైరెక్టర్  అసిత్ గోపాల్  జార్ఖండ్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్  నమన్ ప్రియా లక్రా కూడా పాల్గొన్నారు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్)   గిరిజనుల కోసం మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తేవడానికి ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా (షెడ్యూల్డ్ తెగలు) విద్యార్థులు, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు  సర్వతోముఖాభివృద్ధిని అందిం చడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమం ఇది. 50 శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా  లేదా కనీసం 20,000 మంది గిరిజన ప్రజలు ఉన్న ప్రతి బ్లాక్‌లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని 2018–-19 యూనియన్ బడ్జెట్లో నిర్ణయించారు.  గిరిజన విద్యార్థులకు విద్యా శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాలలు 6 నుండి 12 తరగతుల వరకు గిరిజన విద్యార్థులకు బోధిస్తాయి. వీటిలో సగటున 480 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం, దేశంలో 367 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నవోదయ విద్యాలయాలతో సమానంగా ఇవి ఏర్పాటు అయ్యాయి. ఇక్కడ క్రీడలు,  సామర్థ్య అభివృద్ధిలో శిక్షణను కూడా అందిస్తారు. అలాగే, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల సంపూర్ణ అభివృద్ధి కోసం విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడి క్యాంపస్లను అందుబాటులోకి తెచ్చారు. బోర్డింగ్  లాడ్జింగ్‌తో సహా ఉచిత విద్యను ఉచితంగా అందిస్తారు.

 
 
 


(Release ID: 1801283) Visitor Counter : 140