గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జాతీయ గిరిజన పరిశోధనా సంస్థ మూల కేంద్రంగా బి.ఎ.జె.ఎస్.ఎస్.


గిరిజన మ్యూజియం, అరుదైన పుస్తకాల
పరిరక్షణకు అవగాహనా ఒప్పందం

Posted On: 23 FEB 2022 11:24AM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

  • గిరిజనులపై పుస్తకాల పరిరక్షణ, గిరిజన మ్యూజియం పునరుద్ధరణ, డిజిటైజేషన్ కోసం న్యూఢిల్లీలోని జాతీయ గిరిజన పరిశోధనా సంస్థ, భారతీయ ఆదిమ జనజాతి సేవాసంఘటన్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
  • అరుదైన పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ స్థాపనకు, న్యూఢిల్లీలోని ఎన్.టి.ఆర్.ఐ.లో వనరుల కేంద్రం ఏర్పాటుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. 

    జాతీయ గిరిజన పరిశోధనా సంస్థ (ఎన్.టి.ఆర్.ఐ.) వనరుల (మూల) కేంద్రంగా భారతీయ ఆదిమ జనజాతి సేవా సంఘటన్ (బి.ఎ.జె.ఎస్.ఎస్.)ను రూపొందించే లక్ష్యంతో ఉభయ సంస్థల మధ్య ఒక అవగాహనా ఒప్పందం (ఎం.ఒ.యు.) కుదిరింది. న్యూఢిల్లీకి చెందిన ఎన్.టి.ఆర్.ఐ.కి, బి.ఎ.జె.ఎస్.ఎస్.కు మధ్య 2022 ఫిబ్రవరి 21వ తేదీన ఈ ఒప్పందంపై ఇరు పక్షాల తరఫున సంతకాలు జరిగాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా సమక్షంలో కుదిరిన ఈ అవగాహనా ఒప్పందంపై ఎన్.టి.ఆర్.ఐ. తరఫున ఉత్తరాఖండ్ గిరిజన పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఎస్.ఎస్. తోలియా, బి.ఎ.జె.ఎస్.ఎస్. అధ్యక్షుడు నయన్ చంద్ర హెంబ్రమ్ సంతకాలుచేశారు.  

https://ci6.googleusercontent.com/proxy/mAsGJilNvn5dp1yn65bJQtjoiSJdh40ZheQkCWWgs96yJEau3NR8Ap_cLggZD1-wGjBMsMfL0VuWklAHre1kjjOxU1DYnvI2A_dBERINpYvVphkt=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1CPCY.jpg

      ఈ సందర్భంగా కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, భారతీయ ఆదిమ జనజాతి సేవా సంఘటన్ (బి.ఎ.జె.ఎస్.ఎస్.) సంస్థకోసం పలువురు ప్రముఖులు పనిచేశారని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి అధ్యక్షుడుగా వ్యవహరించారని చెప్పారు. భారతదేశంలోని గిరిజన తెగల బహుముఖ, సమ్మిళిత అభ్యున్నతి లక్ష్యంగా బి.ఎ.జె.ఎస్.ఎస్. ఏర్పాటైందని, 1948లో ప్రముఖ సంఘ సంస్కర్త టక్కర్ బాపా ఈ సంస్థను స్థాపించారని చెప్పారు. యు.ఎన్. దేబర్, మొరార్జీ దేశాయ్ వంటి ప్రముఖ నేతలు, సామాజిక సంస్కర్తలు ఈ సంస్థకోసం ఎంతో కృషి చేశారని, గిరిజనుల అభ్యున్నతికోసం ఎన్నో సేవలందించారని కేంద్రమంత్రి చెప్పారు. ఝండేవాలా ప్రాంతంలో నిర్మించిన బి.ఎ.జె.ఎస్.ఎస్. భవనంలో అరుదైన పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, గిరిజన కళాఖండాలతో కూడిన మ్యూజియం ఉందని చెప్పారు. ఈ పుస్తకాలను, కళాఖండాలను పరిరక్షించని పక్షంలో సుసంపన్నమైన ఈ వారసత్వ సంపద కనుమరుగయ్యేదని అన్నారు. దేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఎన్.టి.ఆర్.ఐ.కి వనరుల కేంద్రంగా బి.ఎ.జె.ఎస్.ఎస్. సంస్థను రూపొందించడం ఎంతో శుభపరిణామని అన్నారు. దీనివల్ల, న్యూఢిల్లీలోని గ్రంథాలయ సదుపాయాలను,.. గిరిజన సంస్కృతి, చరిత్రపై ఆసక్తి చూపే వారు వినియోగించుకోవచ్చని,  విద్యార్థులు, పరిశోధకులు, సందర్శకులు దీన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. గిరిజనుల సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం గురించి రాబోయే తరాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/qwIFQII3ecppSRXApYwolSWvcjaHMzh15qa6yC6sunHt23iYNMFDvsIWC3ar0QpvWoiwLhJUYEsi220ZT5pFumVQ7NDnTpE6Zd9JWGOm1RubW_La=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2A2X0.jpg

https://ci6.googleusercontent.com/proxy/5kiIGrM5N77BenQSy92B78qWBIuwUgosNSLURT3WUlSfdCQxcf9sGIQx9KX9imrF2bHYrRsBfHJrgQb-ocvs4yJqNOzdhB4Dm8KNalnH77Kbxm0-=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/38RUI.jpg

    కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ, గిరిజన వ్యవహారాల కేంద్రమంత్రి మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు చెప్పారు. విభిన్నమైన, విశిష్టమైన ఈ వారతసత్వ కేంద్రాన్ని కేంద్రమంత్రి తన అధికారులతో కలసి స్వయంగా సందర్శించారని,  ఎన్.టి.ఆర్.ఐ. వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారని చెప్పారు. ఈ వారతసత్వ కేంద్రాన్ని అభివృద్ధికోసం ఉత్తరాఖండ్ గిరిజన పరిశోధనా కేంద్రం, ఒడిశా గిరిజన పరిశోధనా కేంద్రం తగిన ప్రణాళికను రూపొందించడం అభినందనీయమని అనిల్ కుమార్ ఝా అన్నారు.

   బి.ఎ.జె.ఎస్.ఎస్.  అధ్యక్షుడు నయన్ చంద్ర హెంబ్రమ్ మాట్లాడుతూ, కేంద్రమంత్రి అర్జున్ ముండాకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులతో కలసి  మంత్రి సంఘటన్ కేంద్రాన్ని సందర్శించి, పుస్తకాల పరిరక్షణకు, మ్యూజియం పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం సంతోషదాయకమని, అందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. లేని పక్షంలో అరుదైన పుస్తకాలు, కళాఖండాలు నిరాదరణకు గురయ్యేవన్నారు. దేశవ్యాప్తంగా బి.ఎ.జె.ఎస్.ఎస్. చేపడుతున్న వివిధ కార్యకలాపాలను, స్వాతంత్ర్య అనంతర కాలంలో గిరిజన విధానాలు, సమస్యల పరిష్కారంకోసం తమ సంస్థ చేస్తున్న కృషిని ఆయన,.. కేంద్రమంత్రికి క్లుప్తంగా వివిరించారు.

https://ci5.googleusercontent.com/proxy/oQiwgqVu73kS0KxAMzb341LjsK6DUmdiJPhliQME6LwXel7ZFQCsWNHyWtbHx9ihXLqkpn8v9tpWtjyAEXoFnt0-nvdbfjTKUHA6wjD9KMoY2nOw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/41DUS.jpg

  ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐ.ఐ.పి.ఎ.) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. త్రిపాఠీ మాట్లాడుతూ, నేషనల్ డిజిటల్ లైబ్రరీని కాన్పూర్ ఐ.ఐ.టి. రూపొందిస్తోందని, పుస్తకాలన్నింటికీ డిజిటల్ రూపం తీసుకు వచ్చిన తర్వాత వాటిని, నేషనల్ డిజిటల్ లైబ్రరీలో పొందుపరచవచ్చని చెప్పారు.

   కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ నవాల్జిత్ కపూర్ మాట్లాడుతూ, పుస్తకాలు, గిరిజన కళాఖండాల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టిన కార్యకలాపాలను, పనులు పూర్తయ్యేందుకు నిర్దేశించిన కాలవ్యవధిని గురించి క్లుప్తంగా వివరించారు.

   బి.ఎ.జె.ఎస్.ఎస్. గ్రంథాలయంలోని అరుదైన పుస్తకాలను, కళాఖండాలను పరిరక్షించి, వాటిని డిజిటలీకరించేందుకు, గ్రంథాలయాన్ని ఇ-లైబ్రరీగా తీర్చిదిద్దేందుకు, గిరిజన మ్యూజియంను పునరుద్ధరించేందుకు, విభిన్నమైన గిరిజన సాంస్కృతి వారసత్వ పరిరక్షణకోసం కియోస్కులు తయారు చేసేందుకు మొత్తం కోటీ 50లక్షల రూపాయలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మంజూరు చేసింది.

   అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు నిర్వహించిన సంతకాల కార్యక్రమంలో గిరిజన పరిశోధనా కేంద్రం డైరెక్టర్ రాజేంద్ర కుమార్, ఉత్తరాఖండ్ గిరిజన పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ఎస్.ఎస్. తోలియా, ఒడిశాకు చెందిన షెడ్యూల్డ్ కులాలు, తెగల పరిశోధనా, శిక్షణాసంస్థ (ఎస్.సి.ఎస్.టి.ఆర్.టి.ఐ.) డైరెక్టర్ డాక్టర్ ఎ.బి. ఓటా, ఎన్.టి.ఆర్.ఐ.కి చెందిన నూపూర్ తివారీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం (యు.ఎన్.డి.పి.) ప్రతినిధి మీనాక్షి, బి.ఎ.జె.ఎస్.ఎస్. సంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

****



(Release ID: 1800667) Visitor Counter : 187