నీతి ఆయోగ్

భారత రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రత్యేక ఆర్థిక సహకారం అవసరం


సుస్థిర రవాణా వ్యవస్థను వేగవంతం చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై సంయుక్తంగా వర్క్ షాప్ నిర్వహించిన నీతి ఆయోగ్, డబ్ల్యు ఆర్ ఐ

Posted On: 22 FEB 2022 3:30PM by PIB Hyderabad

భారత రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రత్యేక ఆర్థిక సహకారం అనే అంశంపై   జి ఐ జెడ్ ఇండియా సహకారంతో నీతి ఆయోగ్వాటర్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్  (డబ్ల్యు ఆర్ ఐ) వర్చువల్ విధానంలో వర్క్‌షాప్ నిర్వహించాయి. ఎన్ డిసి -ట్రాన్స్‌పోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ఆసియా  (ఎన్ డిసి -టిఐఎ)   ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ వర్క్‌షాప్ జరిగింది. 

సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధికి  ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించే అంశానికి చర్యలు అమలు చేస్తోంది. 

రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రూపొందించిన ప్రణాళికలు వినూత్నంగా అమలు జరిగేందుకు ఆర్థిక సంస్థలు, రవాణా సంస్థలు కలిసి పని చేయవలసి ఉంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చేలా చూసేందుకు రూపొందించి అమలు చేయాల్సిన కార్యక్రమాలను చర్చించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ వర్క్‌షాప్ ను నిర్వహించడం జరిగింది. 

వర్క్‌షాప్ లో వివిధ మంత్రిత్వ శాఖలు, ఎన్ డిసి -టిఐఎ భాగస్వామ్య పక్షాలు, భారతదేశానికి చెందిన బ్యాంకులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, రవాణా ఆర్థిక రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. 

నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కీలకోపన్యాసం చేయగాజర్మనీ ఆర్థికప్రపంచ వ్యవహారాల మంత్రి డాక్టర్ స్టీఫెన్ కోచ్ ప్రత్యేక ప్రసంగం ఇచ్చారు. 

వాతావరణ కాలుష్యం లేని రవాణా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆర్థిక వనరులు  అవసరమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఆర్థిక వనరులను సమీకరించేందుకు బ్యాంకులు, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రాష్ట్రాలు, ఉత్పత్తిదారులు, రవాణా సంస్థలను ఒక వేదికపైకి తీసుకుని వస్తున్నామని అమితాబ్ కాంత్ వివరించారు. విస్తృతంగా వర్తించేఆమోదయోగ్యమైన , స్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో రవాణా రంగంలో కీలకంగా మారిన ఈ-బస్సుల కొనుగోలుకు రుణ సహకారం అందించేందుకు ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలు ముందుకు రావాలని అమితాబ్ కాంత్ అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందాలని ఆయన అన్నారు. రవాణా సదుపాయాలను మెరుగు పరిచి, రవాణా ఖర్చులను తగ్గించడం  ద్వారా ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగు పరిచి ఉత్పత్తి ఎక్కువ చేయడానికి అవకాశం కలుగుతుందని అమితాబ్ కాంత్ వివరించారు. వాతావరణ అంశాలకు ప్రాధాన్యత కార్యాచరణ పథకాలు రూపొందాలని అన్నారు. అయితే, ఈ అంశాన్ని  కేవలం వాతావరణ అంశాలు దృక్పధంతో మాత్రమే కాకుండా ఆర్థిక పరమైన దృష్టితో కూడా చూడాల్సిన అవసరం ఉందని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. విధ్యుత్ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం  అందుబాటులోకి రావాలని అన్నారు.  

రవాణా రంగ  విద్యుదీకరణ కోసం భారతదేశం ఒక సమగ్రపటిష్ట కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలని డాక్టర్ స్టీఫెన్ కోచ్ సూచించారు. 

ఈ అంశంలో రుణ సౌకర్యాలు   కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వివిధ రంగాలను సమీకృతం చేసి అవసరమైన   మూలధనాన్ని సమీకరించడానికి అవకాశం కలుగుతుందని వివరించారు.  సమీకరణ సాధ్యమవుతుంది.   ఎన్ డిసి -టిఐఎ అమలు చేస్తున్న కార్యక్రమాలు  కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రూపొందించిన ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు, దీనికి సంబంధించిన    సమాచార మార్పిడి సులభతరం జరిగి అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని  డాక్టర్ స్టీఫెన్ కోచ్ అన్నారు. 

డబ్ల్యు ఆర్ ఐ ఇండియా సీఈవో డాక్టర్ ఓపీ అగర్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో రవాణా రంగం వల్ల 14% కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని వివరించారు. వాతావరణ కాలుష్యంతో కీలకంగా ఉన్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు. రవాణా రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీన్ని  గుర్తించి కాలుష్య రహిత రవాణా రంగ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. 

డబ్ల్యుఆర్‌ఐ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్) అమిత్ భట్ మాట్లాడుతూ  ' ఆర్థిక సహకారం లేకపోవడం  రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు  అతిపెద్ద అవరోధాలలో ఒకటి.  వ్యూహాత్మక పెట్టుబడులు మరియు వినూత్న ఆర్థిక పరిష్కారాలు కాలుష్య రహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. దీని ద్వారా కాప్ 26 లక్ష్య సాధనకు అవకాశం కలుగుతుంది' అని అన్నారు.

భారతదేశం, చైనా మరియు వియత్నాం దేశాలలో పనిచేస్తున్న ఏడు సంస్థలకు ఎన్ డి సి -టిఐఎ ప్రాతినిధ్యం వహిస్తోంది. రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ సంస్థలు సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ లో భాగంగా అమలు జరుగుతున్న ఈ పథకానికి  జర్మన్ బుండెస్టాగ్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా     ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్నేచర్ కన్జర్వేషన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ సహకారం అందిస్తున్నాయి. 

భారతదేశంలో ప్రాజెక్టు భాగస్వామిగా నీతి ఆయోగ్ వ్యవహరిస్తున్నది. 

***



(Release ID: 1800407) Visitor Counter : 227