గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కేంద్ర బడ్జెట్ అమలుపై వెబినార్!


-ప్రధాని ప్రారంభోపన్యాసంతో నిర్వహణ-

‘అమృతకాలంలో అందరికీ గృహవసతి’ అనే అంశంపై
గ్రామీణ, పట్టణ గృహనిర్మాణరంగ నిపుణులు,
మంత్రిత్వ శాఖల అధికారులతో చర్చాగోష్టులు

Posted On: 22 FEB 2022 4:28PM by PIB Hyderabad

     2022-23వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పథకాలను, కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసే మార్గాలపై చర్చించేందుకు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన వెబనార్ సదస్సుల్లో భాగంగా 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఒక వెబినార్.ను నిర్వహించబోతున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ,.. ఇతర మంత్రిత్వ శాఖలతో కలసి నిర్వహించబోయే ఈ వెబినార్ సదస్సును ఉద్దేశించి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తారు. బడ్జెట్ పథకాలను అమలుచేసే మార్గాలపై చర్చలో ‘పౌరులెవరూ వెనుకబడరాదు’ అన్న ధ్యేయంలో ఈ వెబినార్ సదస్సులను చేపడుతున్నారు.

   ఈ నెల 23వ తేదీ జరగనున్న వెబినార్.లో ప్రభుత్వ అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థల ప్రతినిధులు, కన్సల్టెంట్లు, డొమైన్ (సబ్జెక్టు) నిపుణులు, స్థిరాస్తి వ్యాపారుల ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య వర్గాల వారు పాలుపంచుకోబోతున్నారు. గ్రామీణాభివృద్ధికి, పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వివిధ రూపాల్లో చర్చలను ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల గురించి ఈ సందర్భంగా ప్యానెలిస్టులు, నిపుణులు తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. అందుబాటు యోగ్యంగా గృహవసతి, నీటి సరఫరా, రైళ్లు, మొబైళ్లు, బ్రాడ్ బాండ్ వంటి సదుపాయాలతో అనుసంధానం, గ్రామీణ పేదల జీవనోపాధి హామీ ప్రత్యామ్నాయాలు, ఈ విషయంలో మహిళలపై దృష్టిని కేంద్రీకరించడం, బ్యాంకింగ్ సేవలు, ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా భూపరిపాలనా ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకుంటారు.

   ఈ వెబినార్ సదస్సులో భాగంగా ఆరు చర్చా సదస్సులను నిర్వహించనున్నారు. బడ్జెట్ పథకాలకు సంబంధించిన ప్రణాళికను అమలు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలను, కార్యాచరణ అంశాలను గురించి ఈ సందర్భంగా వివిధ రంగాల నిపుణులతో మేథోమధనం జరుగుతుంది. అందరికీ గృహవసతి అన్న అంశంపై చర్చా గోష్టిలో గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులు, గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ రంగాల ప్రముఖ నిపుణులు చర్చిస్తారు. ‘అందరికీ గృహవసతి అన్న భావనను అమృతకాలంలో సాకారం చేయడం’ అనే అంశంతో ఈ చర్చా గోష్టిని నిర్వహిస్తారు. ఈ  సందర్భంగా (1) అందుబాటు యోగ్యమైన గృహవసతిని అందరికీ వర్తింప జేయడం (2) గృగ నిర్మాణ కార్యక్రమాలను ఇతర పథకాలతో సమ్మిళతం చేయడం, అందుబాటు యోగ్యమైన గృహవసతి విస్తృతి కోసం పట్టణ ప్రణాళక, మౌలిక సదుపాయాల శాఖ వ్యూహాలు, (3) అందుబాటు యోగ్యమైన గృహవసతి విషయంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చల్లో దృష్టిని కేంద్రీకరిస్తారు.

TimelineDescription automatically generated

   2022-23వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్.ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. పట్టణ గృహ వసతి, సత్వర పట్టణీకరణ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఆమె ఈ ప్రకటనలు చేశారు. రానున్న 25 సంవత్సరాల అమృత కాలంలో (అంటే, 75 వసంతాల స్వతంత్ర భారత్.నుంచి వందేళ్ల స్వతంత్ర భారతావని వరకూ) దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఒక ప్రాతపదికను, బ్లూ ప్రింటును ఈ బడ్జెట్ అందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పణ సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన అర్హులైన లబ్ధిదారులకోసం 80లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకోసం రూ. 48,000కోట్ల నిధులు కేటాయించినట్టు చెప్పారు. ఇందులో రూ. 28,000కోట్లను కేవలం పట్టణ ప్రాంతాల్లో అమలుచేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకే ఉద్దేశించినట్టు తెలిపారు. ఈ మొత్తం ప్రయత్నంతో, దేశంలోని 80లక్షల మంది లబ్ధిదారులకు తగిన ఆశ్రయం మాత్రమే కాక, ఆత్మగౌరవంతో కూడిన జీవితం లభిస్తుంది. దీనితో దేశంలోని దాదాపు 4 కోట్లమంది పౌరులకు ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో 80లక్షల ఇళ్ల నిర్మాణం 2022-23వ సంవత్సరంలో పూర్తవుతుంది. 28లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో 52 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణమవుతున్నాయి.

   వెబివార్ ఉదయం 11గంటలకు మొదలవుతుంది. ‘అందరికీ గృహవసతి- బడ్జెట్ ప్రకటనలు’ అన్న అంశంపై పరిచయ కార్యక్రమం ఉంటుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ సమయాల్లో జరిగే కార్యక్రమాల్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు, వివిధ సంస్థలకు, రాష్ట్రాలకు చెందిన నిపుణులు వెబినార్.లో వక్తలుగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, భారతీయ స్థిరాస్తి వ్యాపార సంఘాల సమాఖ్య (క్రెడాయ్) అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సి.పి.ఆర్.) సీనియర్ ఫెలో శుభాగతో దాస్ గుప్తా, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్-ఇంటర్నేషనల్ కన్సల్టెంట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యు.ఎన్.డి.పి.) విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పి.కె. దాస్, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ మనీష్ రంజన్, కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధనా సంస్థ (సి.బి.ఆర్.ఐ.)కి చెందిన ఎస్.కె. నెగీ తదితరులు ఈ చర్చల్లో పాలు పంచుకుని సహవక్తలతో తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

TimelineDescription automatically generated

  వెబినార్ సదస్సు మొత్తం రెండు గంటలపాటు జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రశ్నలు, జవాబుల కార్యక్రమం, చర్చ ఉంటాయి. ఈ వెబినార్ సదస్సులో పాల్గొనేందుకు పేర్లను రిజిస్టర్ చేసుకోవడానికి ఈ దిగువన ఇచ్చిన వెబ్ లింకును క్లిక్ చేయవచ్చు. https://pmayu.webex.com/pmayu/j.php?RGID=r7fcea2cedbeb286316ae7eed8f1b12d7.

 

 

వెబినార్ సదస్సు అజెండా వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.:

సమయం

 

 

 

సబ్జెక్టు-ఇతివృత్తం

 

వక్తలు/సమన్వయకర్తలు (మాడరేటర్లు

 

ఉదయం 11:00 నుంచి 11:10 వరకు

 

 

అందరికీ గృహవసతి అన్న అంశంపై పరిచయం,

బడ్డెట్ ప్రకటనలు

మనోజ్ జోషీ, కార్యదర్శి (గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ)

11: 10 నుంచి 11:25వరకు

ఇతర పథకాలతో సమ్మిళితం,

అందుబాటు యోగ్యమైన గృహవసతి విస్తృతిపై పట్టణ ప్రణాళక, మౌలిక సదుపాయాల శాఖ వ్యూహాలు

 

అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (గృహనిర్మాణ శాఖ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

 

11: 25నుంచి 11:40 వరకు

 

 

అందుబాటు యోగ్యమైన గృహవసతి కార్యక్రమాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచడం

హర్షవర్ధన్ పటోడియా, భారతీయ స్థిరాస్తి వ్యాపార సంఘాల సమాఖ్య (క్రెడాయ్) అధ్యక్షుడు.

11:40 నుంచి 11:55 వరకు.

 

 

అందుబాటు యోగ్యంలో గృహవసతిని అందరికీ వర్తింపచేయడం.

శుభాగతో దాస్ గుప్తా, సీనియర్ ఫెలో, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సి.పి.ఆర్.)

 

11:55నుంచి మధ్యాహ్నం 12:10 వరకు.

 

 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం (పి.ఎం.ఎ.వై.జి.) కింద చేపట్టే పనుల్లో ఉపాధి కల్పన, శిక్షణ, నమూనా రూపకల్పన, వ్యయం, హరిత గృహనిర్మాణం, పర్యావరణ అంశాలు

డాక్టర్ పి.కె. దాస్, విజిటింగ్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్-ఇంటర్నేషనల్ కన్సల్టెంట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యు.ఎన్.డి.పి.).

12:10 నుంచి 12:25 వరకు.

ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో డెమో గృహాలు

 

ఎస్.కె. నెగీ, కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ (సి.బి.ఆర్.ఐ.)

 

12:25నుంచి 12:40 వరకు.

 

గౌరవ ప్రధానమంత్రి కలలకు వాస్తవరూపాలుగా  సాకారం కల్పించడం (జార్ఖండ్.లో పి.ఎం.ఎ.వై.జి. పథకం పటిష్టంగా అమలు జరుగుతున్న తీరు)

 

డాక్టర్ మనీష్ రంజన్, కార్యదర్శి (ఆర్.డి.ఎ), జార్ఖండ్ ప్రభుత్వం.

12: 40నుంచ 12:55 వరకు.

ప్రశ్నలు,-జవాబులు, చర్చలు

12:55నుంచి 01:00 వరకు

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ కుమార్ ముగింపు పలుకులు.

                                                           ****



(Release ID: 1800405) Visitor Counter : 169