మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేష‌న‌ల్ మీన్స్‌-క‌మ్‌-మెరిట్ స్కాల‌ర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్ఎస్‌)ను ఐదు సంవ‌త్స‌రాల‌పాటు కొన‌సాగించేందుకు ఆమోదించిన ప్ర‌భుత్వం

Posted On: 22 FEB 2022 5:20PM by PIB Hyderabad

ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం కేంద్ర రంగ జాతీయ సాధనాలు - ప్ర‌తిభ (మీన్స్ క‌మ్ మెరిట్) స్కాల‌ర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్ఎస్‌)ను 15వ‌ విత్త క‌మిష‌న్ కాల‌మైన ఐదేళ్ళ‌కు, అంటే 2021- 22 నుంచి 2025-26 వ‌ర‌కు కొన‌సాగించేందుకు ఆమోదించింది. ఏడాదికి రూ. 1.5 ల‌క్ష‌లుగా ఉన్న అర్హ‌త ప్ర‌మాణాన్ని ఏడాదికి రూ.3.5 ల‌క్ష‌ల‌కు పెంచ‌డం ద్వారా చిన్న మార్పులు చేర్పులు చేసిన ఈ ప‌థ‌క వ్య‌యం రూ. 1827.00 కోట్లుగా ఉంది. 
ఆర్తికంగా బ‌ల‌హీనంగా ఉన్న వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌తిభ క‌లిగిన విద్యార్ధుల‌కు స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందించ‌డం ద్వారా క్లాస్‌-VIII  నుంచి డ్రాపౌట్ల రేటును త‌గ్గించి, మాధ్య‌మిక స్థాయిలో వారి విద్య‌ను కొన‌సాగించేలా ప్రోత్స‌హించ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యం.
ఇటీవ‌లి కాలంలో తాజా ల‌క్ష స్కాల‌ర్‌షిప్‌ల‌ను ఎంపిక చేసిన తొమ్మిద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ఏడాదికి రూ. 12,000 (నెల‌కు రూ. 1000)ని  ఇవ్వ‌డం జ‌రిగింది. ప‌థ‌కం కింద రాష్ట్ర ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ ఎయిడెడ్ పాఠ‌శాల‌లు, స్థానిక సంస్థ‌ల పాఠ‌శాలల్లో వారు 10 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ కొన‌సాగించేందుకు స్కాల‌ర్‌షిప్‌ను పున‌రుద్ధ‌రించ‌డం జ‌రుగుతుంది. రాష్ట్ర‌, కేంద్ర‌పాలిత ప్ర‌భుత్వాలు నిర్వ‌హించే ప‌రీక్ష ద్వారా ఎంపిక చేసిన విద్యార్ధుల‌కు స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తారు. ఈ ప‌థ‌కాన్ని నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ పోర్ట‌ల్ (ఎన్ఎస్‌పి)లో కూడా ఉంచారు. స్కాల‌ర్‌షిప్‌ల‌ను విద్యార్ధుల బ్యాంకు అకౌంట్ల‌లోకి నేరుగా ప్ర‌భుత్వ ఆర్థిక నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ (ప‌బ్లిక్ ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ సిస్టం -పిఎప్ఎంఎస్‌) ద్వారా డిబిటి ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తూ ఎల‌క్ట్రానిక్ బ‌దిలీ ద్వారా పంపిణీ చేస్తారు. ఈ ప‌థ‌కం కింద 100% నిధ‌/ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తుంది. 
ప‌థ‌కాన్ని 2008-09లో ప్రారంభించిన‌ప్ప‌టి నుంచీ కొన‌సాగుతూ, 2020-21వ‌ర‌కూ రూ. 1783.03 కోట్ల వ్య‌యంతో 22.06 ల‌క్ష‌ల స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందించింది.
కాగా, ప‌థ‌కానికి ఆమోదించిన ఆర్థిక వ్య‌యం రూ. 1827.00 కోట్లతో 14.76 ల‌క్ష‌లమంది విద్యార్ధుల‌కు స్కాల‌ర్‌షిప్‌ల‌ను పంపిణీ చేయాల‌ని ప్ర‌తిపాదించారు. 

 

***
 


(Release ID: 1800399) Visitor Counter : 204