హోం మంత్రిత్వ శాఖ
బోర్డర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & మేనేజ్‌మెంట్ (బీఐఎం) అంబ్రెల్లా పథకాన్ని 2021-22 నుండి 2025-26 వరకు కొనసాగించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం
- కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు మౌలిక సదుపాయాలు & నిర్వహణను మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది
- 2021-22 నుండి 2025-26 వరకు పథకం ఖర్చు రూ. 13,020 కోట్లు
- సరిహద్దు నిర్వహణ, పోలిసింగ్ మరియు సరిహద్దులను రక్షించడం కోసం బీఎంఐ సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది
Posted On:
21 FEB 2022 5:41PM by PIB Hyderabad
2021-22 నుండి 2025-26 వరకు రూ.13,020 కోట్ల వ్యయంతో 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్‌లో "బోర్డర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్‌మెంట్" (బీఎఐ) యొక్క సెంట్రల్ సెక్టార్ అంబ్రెల్లా స్కీమ్‌ను కొనసాగించడానికి మోడీ ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సరిహద్దు మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణను మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. ఈ నిర్ణయం సరిహద్దు నిర్వహణ, పోలీసింగ్ మరియు సరిహద్దుల రక్షణను మెరుగుపరచడానికి సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. సరిహద్దులకు కంచె, సరిహద్దు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, సాంకేతిక పరిష్కారాలు, సరిహద్దు రోడ్లు మరియు సరిహద్దు అవుట్‌పోస్ట్‌లు (బీఓపీలు)/కంపెనీ ఆపరేటింగ్ బేస్‌లు (సీఓబీలు) వంటి మౌలిక సదుపాయాల కల్పనలో బీఎంఐ పథకం సహాయం చేస్తుంది. ఇండో-చైనా, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ మరియు ఇండో-మయన్మార్ సరిహద్దులలో ఈ తరహా కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుంది.
*****
(Release ID: 1800192)
Visitor Counter : 172