ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విద్య మరియు నైపుణ్య రంగం పై  కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం పై ఏర్పాటైనవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


అయిదు దృష్టికోణాల పై ఆయన విశదం గా మాట్లాడారు:  అవి ఏవేవి అంటే గుణాత్మక విద్య ను అందరికీ అందించడం;  నైపుణ్యాల అభివృద్ధి;  భారతదేశం యొక్క ప్రాచీన అనుభవాన్నిమరియు పట్టణ ప్రణాళికరచన, డిజైనింగ్ సంబంధి జ్ఞానాన్ని విద్య లో చేర్చడం; అంతర్జాతీయీకరించడం మరియు ఏనిమేశన్  విజువల్  ఇఫెక్ట్ స్  గేమింగ్  కామిక్ లపై శ్రద్ధ వహించడం అనేవే

‘‘దేశ భావి నిర్మాత లు అయిన యువజనుల కు సాధికారిత ను కల్పించడం అంటే అర్థం భారతదేశంభవిష్యత్తు కు సాధికారిత ను కల్పించడం అని’’

‘‘మహమ్మారి కాలం లో దేశ విద్య వ్యవస్థ ను కాపాడింది ఏదంటే అది డిజిటల్  కనెక్టివిటీ యే’’

‘‘నూతన ఆవిష్కరణ అనేది మన దేశం లో అన్ని వర్గాల వారి ని కలుపుకొని పోవడానికివీలు ను కల్పిస్తున్నది.   దీనికంటేదేశం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏకత్వం దిశ లో ముందుకు పోతున్నది’’

‘‘ఉద్యోగం పరం గా మారుతున్న డిమాండు లకు అనుగుణంగా దేశం యొక్క జనాభా పరమైన డివిడెండు ను సన్నద్ధ పరచడం కీలకం’’

‘‘బడ్జెటు అనేది గణాంకాల తో కూడిన ఒక వివరణ మాత్రమేకాదు,  బడ్జెటును సరి అయిన రీతి లో అమలు పరచినప్పుడు పరిమిత వనరుల

Posted On: 21 FEB 2022 12:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విద్య మరియు నైపుణ్యం రంగాల పై కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మకమైనటువంటి ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు పరిశోధన రంగాల కు చెందిన కీలక స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొన్నారు. బడ్జెటు కు ముందు, బడ్జెటు కు తరువాత బడ్జెటు తో సంబంధమున్న అన్ని వర్గాల తో మాట్లాడడడం మరియు చర్చించడం అనే ఒక కొత్త అభ్యాసం లో ఈ వెబినార్ ఒక భాగం గా ఉంది.

దేశ నిర్మాణ ప్రక్రియ లో యువతరాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పడం ద్వారా ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ‘‘భారతదేశ భావి నిర్మాత గా ఉన్న మన యువత కు సాధికారిత ను కల్పించడం అంటే భారతదేశం భవిష్యత్తు కు సాధికారిత ను కల్పించడం అని అర్థం’’ అని ఆయన పేర్కొన్నారు.

బడ్జెటు 2022 లో ప్రస్తావించిన అయిదు దృష్టికోణాల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో వివరించారు. ఒకటో దృష్టికోణం ఏమిటి అంటే అది నాణ్యమైన విద్య ను అందరికీ అందించడం కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. విద్య రంగం లో సామర్ధ్యాల ను వృద్ధి చేయడం తో పాటు మెరుగులు దిద్దిన నాణ్యత తో విద్య బోధన ను విస్తరించడం దీని ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. రెండో దృష్టికోణం గా నైపుణ్యాభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవడం జరిగింది అని ఆయన చెప్పారు. డిజిటల్ స్కిల్ ఇకోసిస్టమ్ ను ఏర్పాటు చేయడం పైన, పరిశ్రమ డిమాండు కు అనుగుణం గా నైపుణ్యాల అభివృద్ధి, ఇంకా పరిశ్రమ తో ఉత్తమమైన అనుబంధాలు.. ఈ విషయాల పై శ్రద్ధ వహించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. మూడో దృష్టికోణం ఏమిటి అంటే అది భారతదేశం యొక్క ప్రాచీన అనుభవాన్ని మరియు పట్టణ ప్రణాళిక రచన, డిజైనింగ్ సంబంధి జ్ఞానాన్ని విద్య లో చేర్చడాని కి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టడమైందన్నారు. నాలుగో దృష్టికోణం ఏమిటి అంటే అది అంతర్జాతీయీకరణ కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం అని స్పష్టం చేశారు. దీని లో భాగం గా ప్రపంచ శ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశం లోకి రావడం, అంతేకాక ఫిన్ టెక్ సంబంధి సంస్థల ను అక్కున చేర్చుకొనేటట్లు గా జిఐఎఫ్ టి సిటీ వంటి సంస్థ ల కు ప్రోత్సాహాన్ని అందించడం అని తెలిపారు. అయిదో దృష్టికోణం ఏమిటి అంటే అది ఏనిమేశన్ విజువల్ ఎఫెక్ట్ స్ గేమింగ్ కామిక్ (ఎవిజివి) పై శ్రద్ధ కనబరచడం అని వివరించారు. ఈ రంగం లో ఉపాధి కి భారీ అవకాశాలు ఉన్నాయి, మరి ఇది ఒక పెద్ద గ్లోబల్ మార్కెట్ అని ఆయన న్నారు. ‘‘ఈ బడ్జెటు జాతీయ విద్య విధానం లక్ష్యాల ను సాకారం చేయడం లో ఎంతగానో తోడ్పడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మహమ్మారి కాలం లో దేశ విద్య వ్యవస్థ ను కాపాడింది డిజిటల్ కనెక్టివిటీ అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశం లో డిజిటల్ మాధ్యమం పరం గా అంతరం అనేది తగ్గుతోంది అని ఆయన పేర్కొన్నారు. ‘‘నూతన ఆవిష్కరణ అనేది మన దేశం లో చాలా వర్గాల ను కలుపుకొని పోయేందుకు వీలు కల్పిస్తోంది. ఇక మరో అడుగు ముందుకు వేసి దేశం ఏకీకరణ దిశ లో పయనిస్తోంది’’ అని ఆయన చెప్పారు. దేశ యువత కు సాయపడటం లో ఎంతో ప్రభావాన్ని చూపగలిగిన విద్య సంబంధి మౌలిక సదుపాయాల ను ఇ-విద్య, వన్ క్లాస్ వన్ చానల్, డిజిటల్ లేబ్స్, డిజిటల్ యూనివర్శిటీస్ ఏర్పరుస్తున్నాయి అని ఆయన వివరించారు. ‘‘గ్రామాల కు, పేదల కు, దళితుల కు, వెనుకబడిన వర్గాల కు, ఇంకా ఆదివాసుల కు దేశ సామాజిక- ఆర్థిక వ్యవస్థ లో విద్య కు సంబంధించిన మెరుగైన పరిష్కార మార్గాల ను చూపించేందుకు జరిగిన ఒక ప్రయత్నం ఇది’’ అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాల లో ఎదురవుతున్న సీట్ల సమస్య కు పూర్తి స్థాయి లో పరిష్కరించగల సామర్ధ్యం ఇటీవల ప్రకటించిన నేశనల్ డిజిటల్ యూనివర్సిటి కి ఉంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయం లో త్వరిత గతి న పని చేయవలసింది గా విద్య మంత్రిత్వ శాఖ కు, యుజిసి కి, ఎఐసిటిఇ కి, ఇంకా డిజిటల్ యూనివర్సిటి తాలూకు సంబంధిత వర్గాలన్నిటి కి ఆయన పిలుపు నిచ్చారు. సంస్థల ను ఏర్పాటు చేసే క్రమం లో అంతర్జాతీయ ప్రమాణాల ను దృష్టి లో పెట్టుకోవలసిన అవసరం ఉంది అంటూ ఆయన నొక్కిచెప్పారు.

ఈ రోజు న అంతర్జాతీయ మాతృ భాష దినం సందర్భం లో మాతృ భాష మాధ్యమం లో విద్య బోధన మరియు బాల ల మానసిక వికాసం.. ఇవి ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. అనేక రాష్ట్రాల లో వైద్య విద్య లోను, సాంకేతిక విద్య లోను బోధన స్థానిక భాషల లో సాగుతోంది అని ఆయన ప్రస్తావించారు. డిజిటల్ ఫార్మేట్ లో ఉత్తమ కంటెంటు ను స్థానిక భారతీయ భాషల లో సృష్టించడం జోరు అందుకోవాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఆ తరహా కంటెంటు ఇంటర్ నెట్ లో, మొబైల్ ఫోన్ లలో, టివి లో, రేడియో లో అందుబాటు లో ఉండవలసిన అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. కంటెంటు కు సంబంధించిన పని తగిన ప్రాథమ్యాల ను అనుసరించి సంజ్ఞా భాషల లో కూడా పురోగమించవలసిన అవసరం ఉంది అని ఆయన పునరుద్ఝాటించారు.

‘‘ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రపంచ స్థాయి ప్రతిభ అవసరం అనే దృష్టి కోణం లో నుంచి చూసినప్పుడు గతిశీల నైపుణ్య సాధన అనేది ఎంతో ముఖ్యం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఉద్యోగం పరం గా మారుతూ ఉన్న పాత్ర ల డిమాండు ల మేరకు దేశం లోని జనాభా పరమైన డివిడెండు ను తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దృష్టి కోణాన్ని ఆధారం గా చేసుకొని బడ్జెటు లో ఇ-స్కిలింగ్ లేబ్స్ ను మరియు డిజిటల్ ఇకోసిస్టమ్ ఫార్ స్కిలింగ్ ఎండ్ లైవ్ లీ హుడ్ ను గురించి ప్రకటించడమైంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో బడ్జెటు కు సంబంధించిన ప్రక్రియ లో ఇటీవలి మార్పు లు ఏ విధం గా బడ్జెటు ను ఒక పరివర్తనాత్మకమైన ఉపకరణం గా మార్చుతున్నదీ వివరించారు. బడ్జెటు లో పేర్కొన్న అంశాల ను క్షేత్ర స్థాయి లో ఎలాంటి అంతరాయాని కీ తావు లేకుండా అమలు చేయవలసిందంటూ స్టేక్ హోల్డర్స్ ను ఆయన కోరారు. ఒక నెల రోజుల ముందుగానే బడ్జెటు ను సమర్పించడం ద్వారా దాని ని ఏప్రిల్ ఒకటో తేదీ నాటి నుంచి అమలు లోకి తీసుకు వచ్చేటట్లుగా చూడటం జరుగుతోంది, సన్నాహక చర్యలు మరియు చర్చలు అప్పటికే పూర్తి అవుతాయి అని ఆయన అన్నారు. బడ్జెటు లో పేర్కొన్న అంశాల పై ఫలితాలు అత్యంత అనుకూల స్థాయి లో సిద్ధించేటట్లు చూడవలసింది గా స్టేక్ హోల్డర్స్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు జాతీయ విద్య ల కోణం లో నుంచి చూసినప్పుడు ‘అమృత కాలాని’ కి పునాది ని వేయడం కోసం మేము శీఘ్రం గా అమలు చేయదలచుకొన్న ఒకటో బడ్జెటు ఇది’’ అని ఆయన అన్నారు. ‘‘బడ్జెటు అంటే అది గణాంకాల ఖాతా ఒక్కటే కాదు, బడ్జెటు ను సరి అయిన విధం గా అమలు జరిపిన పక్షం లో అది పరిమితమైన వనరుల తో అయినా సరే గొప్ప మార్పు ను తీసుకు రాగలుగుతుంది’’ అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

****

DS

 

 


(Release ID: 1800120) Visitor Counter : 208