సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జరుపుకోనున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఏకం భారతం వేడుకల్లో భాగంగా వందేభారతం సౌండ్‌ట్రాక్ విడుదల; గ్రామీ విజేత రికీ కేజ్, తబలా మాస్ట్రో బిక్రమ్ ఘోష్‌తో కలిసి ఇవ్వబోయే ప్రత్యక్ష ప్రదర్శన
Posted On:
20 FEB 2022 11:10AM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
• కేంద్ర సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షి లేఖి చే వందే భారతం సౌండ్‌ట్రాక్ విడుదల.
• ప్రఖ్యాత రచయిత, కవి మరియు గీత రచయిత శ్రీ ప్రసూన్ జోషి ప్రారంభ ప్రసంగం.
• ఇందిరా గాంధి జాతీయ కళా సంస్థ IGNCA డీన్ ప్రొఫెసర్ రమేష్ సి గౌర్ రచించిన ‘ట్రైబల్ అండ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ఆవిష్కరణ.
• ‘గ్రామీ విజేత రికీ కేజ్ తబలా మాస్ట్రో బిక్రమ్ ఘోష్ ప్రత్యక్ష కచేరీ.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరి 21 నుండి 22 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్‌లో రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
భాషా సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడానికి, బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని ప్రజలు ఉపయోగించే అన్ని భాషల పరిరక్షణను ప్రోత్సహించే విస్తృత ప్రయత్నంలో ఈ దినోత్సవం భాగం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆలోచన మొదట బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) సాధారణ సమావేశం 2000లో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం యునెస్కో ఒక ప్రత్యేకమైన థీమ్‌ను ఎంచుకుంటుంది. 2022 యొక్క థీమ్: “బహుభాషా అభ్యాసం కోసం సాంకేతికతను ఉపయోగించడం: సవాళ్లు మరియు అవకాశాలు”, ఇది బహుభాషా విద్య అభివృద్ధి చేయడానికి అందరికీ నాణ్యమైన బోధన, అభ్యాసాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతిక సంభావ్య పాత్రపై దృష్టి పెడుతుంది.
ఈ రోజును పురస్కరించుకుని, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ IGNCA, యునెస్కో న్యూ ఢిల్లీ క్లస్టర్ ఆఫీస్‌తో కలిసి భౌతిక, వర్చువల్ ఫార్మాట్‌లో రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ కీలక ప్రసంగం చేస్తారు, ఆ తర్వాత న్యూఢిల్లీలోని యునెస్కో క్లస్టర్ ఆఫీస్ డైరెక్టర్ శ్రీ ఎరిక్ ఫాల్ట్, ప్రముఖ గీత రచయిత, కవి ప్రసూన్ జోషి ప్రసంగిస్తారు. భారతదేశం విదేశాల నుంచి శ్రేష్టమైన వక్తల శ్రేణి తో ప్రారంభమౌతుంది., కార్యక్రమంలో భాగంగా మాతృభాషలో పద్య పఠనం, వివిధ భాషలలో బృందగానాలు,నాట్యం ప్రదర్శిస్తారు., 'బహుభాషా అభ్యాసం కోసం సాంకేతికతను ఉపయోగించడం: సవాళ్లు మరియు అవకాశాలు'పై వెబ్‌నార్, పుస్తక ఆవిష్కరణ '. IGNCA డీన్ ప్రొఫెసర్ రమేష్ సి గౌర్ రచించిన ట్రైబల్ అండ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా' కూడా ఈ కార్యక్రమంలో మిళితమై ఉన్నాయి..
సాయంత్రం తర్వాత, 'ఏకం భారతం' కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి హాజరవుతారు. 'వందే భారతం' సౌండ్‌ట్రాక్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్, తబలా విద్వాంసుడు బిక్రమ్ ఘోష్‌తో కలిసి రూపొందించిన ఈ పాట 2022 రిపబ్లిక్ డే ఈవెంట్‌లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా డ్యాన్స్ ప్రెజెంటేషన్‌లలో భాగంగా ఉంది. ఈ ఈవెంట్‌లో సంగీత విద్వాంసులు కలిసి ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు.
ఇంకా, ఒక వేదికపై రచయితలు, ఆలోచనాపరులు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు నిపుణులతో కూడిన ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. అసమాన వేడుక అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
****
(Release ID: 1799916)
Visitor Counter : 254