ప్రధాన మంత్రి కార్యాలయం
దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రముఖులతో సమావేశమైన - ప్రధానమంత్రి
'వీర్-బాల్-దివస్' ప్రకటించడం ద్వారా ఛార్ సాహిబ్జాదే ని గౌరవించినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన - సిక్కు సమాజం నాయకులు
దేశం నలుమూలల నుంచి వచ్చిన పిల్లలకు ఛార్ సాహిబ్జాదే సహకారం, త్యాగం గురించి 'వీర్-బాల్-దివస్' అవగాహన కల్పిస్తుంది: ప్రధానమంత్రి
సిక్కు సమాజం సేవా స్ఫూర్తి గురించి ప్రపంచానికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రశంసించిన - ప్రధానమంత్రి
సిక్కు సమాజ సంక్షేమం కోసం నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి
సిక్కు సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి హృదయ పూర్వకంగా తీసుకున్న నిరంతర చర్యలకు కృతజ్ఞతలు తెలియజేసిన - ప్రతినిధులు
Posted On:
18 FEB 2022 7:02PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సిక్కులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 7-లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమయ్యారు. సిక్కు సమాజ సంక్షేమం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నందుకు,ప్రత్యేకంగా డిసెంబర్ 26వ తేదీని "వీర్-బాల్-దివస్" గా ప్రకటించడం ద్వారా ఛార్ సాహిబ్జాదే ని గౌరవించినందుకు, సిక్కు సమాజ ప్రతినిధి బృందం ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేసింది. ప్రతినిధి బృందంలోని ప్రతి సభ్యుడు ప్రధానమంత్రిని ‘సిరోపావో’ మరియు ‘సిరి సాహిబ్’లతో సత్కరించారు.
దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలకు ఛార్ సాహిబ్‌జాదే చేసిన కృషి, త్యాగం గురించి తెలియదని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాఠశాలల్లో, పిల్లల ముందు మాట్లాడే అవకాశం దొరికినప్పుడల్లా ఛార్ సాహిబ్‌జాదే గురించే మాట్లాడుతూ ఉంటానని, ఆయన గుర్తు చేసుకున్నారు. డిసెంబర్, 26వ తేదీన "వీర్-బాల్-దివస్" గా జరుపుకోవాలనే నిర్ణయం దేశంలోని నలుమూలల పిల్లలకు వారి గురించి అవగాహన కల్పించడంలో తోడ్పడుతుందని, ఆయన అన్నారు.
తనను సందర్శించడానికి వచ్చినందుకు, సిక్కు సమాజ నాయకులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి కోసం తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని, ఆయన హామీ ఇచ్చారు. పంజాబ్ లో ఉన్న సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని, కలిసి గడిపిన సమయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సిక్కు కమ్యూనిటీ యొక్క సేవా స్ఫూర్తి గురించి ప్రపంచానికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రధానమంత్రి కొనియాడారు, సిక్కు సమాజ సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ఆయన ఈ సందర్భంగా వారికి వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి గురు గ్రంథ సాహిబ్ ను పూర్తి గౌరవ లాంఛనాలతో తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రత్యేక ఏర్పాట్లపై ఆయన చర్చించారు. సిక్కు యాత్రికుల కోసం కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను తెరవడానికి దౌత్య మార్గాల ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన వివరించారు.
"వీర్-బాల్-దివస్" ను జరుపుకోవాలనే నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఛార్ సాహిబ్జాదే త్యాగం గురించి తెలుసుకునేలా చేస్తుందని శ్రీ మంజీందర్ సింగ్ సిర్సా అన్నారు. సింగ్ సాహిబ్ గియాని రంజీత్ సింగ్, జతేదార్ తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్ మాట్లాడుతూ, కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరవడం; లంగర్ పై జి.ఎస్.టి. ని తొలగించడం వంటి చర్యలు తీసుకున్నందుకు, ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు. సిక్కు సమాజం కోసం ప్రధానమంత్రి తీసుకున్న అనేక చర్యలు ఆయన హృదయ పూర్వకంగా సిక్కు అభిమాని అని తెలియజేస్తున్నాయని వారు పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం దేశవిభజన సమయంలో భారీ సంఖ్యలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సిక్కు సమాజానికి తగిన గుర్తింపు లభించడం ఇదే తొలిసారి అని, జాతీయ మైనారిటీ కమిషన్, మాజీ అధ్యక్షులు శ్రీ శ్రీ తర్లోచన్ సింగ్ అన్నారు. సిక్కు సమాజం చేసిన కృషిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ప్రధానమంత్రి కి వారు ధన్యవాదాలు తెలియజేశారు.
(Release ID: 1799575)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam