రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పర్యటించనున్న - భారత రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2022 6:07PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీ  రామ్ నాథ్ కోవింద్ 2022 ఫిబ్రవరి, 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పర్యటించనున్నారు.


పూరీలోని గౌడియ మఠం మరియు మిషన్ వ్యవస్థాపకులు శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల 150వ జయంతి సందర్భంగా మూడు సంవత్సరాల పాటు నిర్వహించే వేడుకలను, రాష్ట్రపతి, 2022 ఫిబ్రవరి, 20వ తేదీన  ప్రారంభిస్తారు.

2022 ఫిబ్రవరి, 21వ తేదీన రాష్ట్రపతి విశాఖపట్నంలో ఫ్లీట్ రివ్యూ మరియు ఫ్లైపాస్ట్‌ ను వీక్షిస్తారు.  'ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ' లో భాగంగా , సాయుధ దళాల సర్వ సేనాధిపతి హోదా లో భారత రాష్ట్రపతి, తమ పదవీకాలంలో ఒకసారి భారత నౌకా దళాన్ని సమీక్షిస్తారు.

 

*****
 


(రిలీజ్ ఐడి: 1799568) సందర్శకుల సూచీ సంఖ్య : : 182
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Odia , Tamil