రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో రూ.21,559 కోట్ల పెట్టుబడితో 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 17 FEB 2022 4:31PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో రూ.21,559 కోట్ల పెట్టుబడితో మొత్తం 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ,  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తీర ప్రాంతంలో మెరుగైన రహదారి అనుసంధానం పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తుందని, పట్టణ , గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని , ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సౌభాగ్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

 

సేతు భారతం కింద ఆర్ వో బిల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి పోయి ప్రయాణికుల భద్రత కు భరోసా కలుగుతోందని కేంద్ర మంత్రి చెప్పారు.  సమయం ,ఇంధనం ఆదా కావడంతో పాటు, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర సామాజిక- ఆర్థికాభివృద్ధికి జాతీయ రహదారులు ధమనుల ని ఆయన అన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, కాకినాడ ఓడరేవులకు నాలుగు లైన్ల రహదారి లాజిస్టిక్స్ ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ గడ్కరీ తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం విజయవాడ నగరాన్ని రద్దీ నుంచి విముక్తి చేయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

 

****



(Release ID: 1799152) Visitor Counter : 155