ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ పై 29.8 లక్షలకు పైగా ప్రధాన పన్ను ఆడిట్ నివేదికలు (టిఎఆర్ లు) దాఖలు

Posted On: 16 FEB 2022 4:52PM by PIB Hyderabad

2022 ఫిబ్రవరి 15 వ తేదీ నాటికి ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ లో 29.8 లక్షలకు పైగా ప్రధాన పన్ను ఆడిట్ నివేదికలు (టిఎఆర్ లు) దాఖలు అయ్యాయి. చివరి రోజున, 4.14 లక్షలకు పైగా ప్రధాన పన్ను ఆడిట్ నివేదికలు/ఫారాలు దాఖలు అయ్యాయి.

 

ప్రధాన చట్టబద్ధమైన ఫారాలు 29.8 లక్షలలో, 2.65 లక్షల ఫారం 3సిఎ-3సిడి ,సుమారు 24.5 లక్షల ఫారం 3సిబి-3సిడి 21-22 ఆర్థిక సంవత్సరంలో దాఖలు అయ్యాయి. 15.02.2022 వరకు 2.71 లక్షలకు పైగా ఇతర ట్యాక్స్ ఆడిట్ రిపోర్టులు (ఫారం 10బి, 29బి, 29సి, 3సిఈబి, 10సిసిబి, 10 బిబి) దాఖలు అయ్యాయి.

 

15.02.2022 న , 34,842 ఫారం 3సిఎ-3సిడి (మొత్తం 2,65,153లో), 3,36,842 ఫారం 3సిబి-3సిడి (మొత్తం 24,48,950మందిలో), 18,644 ఫారం 10బి (మొత్తం 1,50,950 మందిలో), 11,852 ఫారం 29బి (మొత్తం 74,923లో), 478 ఫారం 29సి (మొత్తం 2,820), 10,542 ఫారం 3సిఈబి (మొత్తం 33,345లో), ఫారం 10సిసిబి యొక్క 873 (మొత్తం 4,904)మరియు ఫారం 10బిబి (మొత్తం 3851లో) 570 దాఖలు అయ్యాయి.

చివరి తేదీన అంటే 15.02.2022 పొడిగించిన గడువు తేదీన , ఈ చట్టబద్ధమైన ఫారాల్లో 14%, ,చివరి 5 రోజుల్లో 11.02.2022 నుంచి 15.02.2022 వరకు, ఈ చట్టబద్ధమైన ఫారాల్లో 30% దాఖలు అయ్యాయి.

 

ఇంకా, ఎవై 2021-22 కోసం దాఖలు చేసిన 6.26 . కోట్ల ఐటిఆర్ లలో 5.41 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్ లు (ఐటిఆర్ లు) ధృవీకరించబడ్డాయి. వెరిఫై చేసిన ఐటిఆర్ ల్లో, 4.50 కోట్లకు పైగా ఐటిఆర్ లను  ప్రాసెస్ చేశారు. ఐ nka,  ఎవై 2021-22 లో 1.58 కోట్ల రిఫండ్ లు జారీ  చేశారు.

 

అంగీకారం తో మద్దతు ఇచ్చినందుకు పన్ను నిపుణులు పన్ను చెల్లింపుదారులందరికీ డిపార్ట్ మెంట్ కృతజ్ఞతలు తెలియచేసింది. సిఎ సమర్పించిన పన్ను ఆడిట్ నివేదికను ఇంకా ఆమోదించని పన్ను చెల్లింపుదారులు  కూడా దాఖలు ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది.

 

****



(Release ID: 1798877) Visitor Counter : 113