పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

ఒక వర్క్‌షాప్‌లో ఒకేసారి లక్ష మందికి పైగా విదార్థులకు కెరీర్ కౌన్సెలింగ్


కెరీర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్ 'ప్రమర్ష్ 2022'ని ప్రారంభించిన శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్

Posted On: 16 FEB 2022 12:00PM by PIB Hyderabad

బికనీర్ జిల్లా ప్రాంత విద్యార్థుల కోసం నిర్వహించిన కెరీర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్ 'ప్రమర్ష్ 2022'ని నిన్నసాంస్కృతికపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌లో బికనీర్ జిల్లాలోని వేలకు పైగా పాఠశాలల నుండి లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు.  వీరిలో  గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. 

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న వచ్చే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్ (ఎన్ఐసిఎస్), విద్యా అంకుర సంస్థ అయిన ఎడ్యుమైల్‌స్టోన్స్ సంస్థ సహకారంతో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు.  వర్క్‌షాప్‌ నిర్వహణకు రాజస్థాన్   డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారం అందించి అవసరమైన సౌకర్యాలను కల్పించింది. 

 గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేశాభివృద్ధిలో యువతకు పాత్ర కల్పించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. 

 

 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా వర్క్‌షాప్‌ నిర్వహించడం పట్ల  శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్  హర్షం వ్యక్తం చేశారు. 2047లో  స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ఇప్పటినుంచి 2047 వరకు అమృత కాలంగా పరిగణించి దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అభివృద్ధి సాధనకు ఇదే సరైన సమయమని మంత్రి అన్నారు. 

నవ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎక్కువగా ఉంటుందని శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులుడిజిటల్ వ్యవస్థకు లభిస్తున్న ప్రాధాన్యతతో విద్యార్థుల ఆలోచనా దృక్పథంబోధనలో సమూల మార్పులు తెచ్చాయని పేర్కొన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచిందని మంత్రి అన్నారు.అంకుర సంస్థలను నెలకొల్పేందుకు యువత ముందుకు వస్తున్నారని, యునికార్న్‌ల సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. ఇవి యువత ప్రతిభకు, అభివృద్ధి సాధనకు సానుకూల అంశాలని ప్రతిభకు శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. యువతకు మార్గదర్శకం  కల్పించే విధంగా వర్క్‌షాప్‌ను నిర్వహించిన  నిర్వాహకులను మంత్రి అభినందించారు.  “ప్రమర్ష్” వంటి కెరీర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్ విద్యార్థులు మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ , ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యాపారం, విధాన ప్రణాళిక, పరిశ్రమలు , కళ, సంస్కృతి, మీడియా, వైద్యం, ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్ , మార్కెటింగ్ రంగాలకు చెందిన  నిపుణుల నుంచి సలహాలు సూచనలు పొందారు. బెల్జియంకు చెందిన జెమినీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సురేంద్ర పట్వారీసులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకురాలు బిందేశ్వరి పాఠక్హస్టన్‌కు చెందిన స్టార్ ప్రమోషన్ సీఈవో రాజేందర్ సింగ్ పహ్ల్జేఎస్ డీపీఐఐటీ శ్రేయాస్ బాత్రానారీ శక్తి అవార్డు గ్రహీత రుమా దేవి తదితరులు కార్యక్రమంలో  ప్రత్యేక అతిధులుగా పాల్గొని  విద్యార్థులను ప్రోత్సహించారు. 

ఈ మెగా కెరీర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌కు ముందు బికనీర్‌లోని అన్ని పాఠశాలల్లో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు కెరీర్ అంబాసిడర్‌లుగా శిక్షణ పొందారు.  అనేది పరిశ్రమ, విద్యా రంగాల మధ్య  అంతరాన్ని తగ్గించి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా  “ ప్రమర్ష్  2022” వర్క్‌షాప్ ను నిర్వహించారు.  వర్క్‌షాప్ ఉపాధ్యాయుల శిక్షణ మరియు విద్యార్థుల కోసం కెరీర్ వర్క్‌షాప్‌ పరిమితం చేయకుండా   విద్యార్థులందరికీ  డిజిటల్ కెరీర్ లైబ్రరీ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ కెరీర్ అసెస్‌మెంట్ మరియు సేవను అందించాలని ఎడుమైల్‌స్టోన్స్ సంస్థ నిర్ణయిచింది. 

 

***


(Release ID: 1798874) Visitor Counter : 146