సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
దివ్యాంగులకు తోడ్పాటులు మరియు సహాయక పరికరాల పంపిణీకి వికలాంగుల సాధికారత శాఖ ‘సామాజిక అధికార శివిర్’ను నిర్వహిస్తోంది
- ఈ పథకం కింద మధ్యప్రదేశ్‌లోని 409 దివ్యాంగులకు రూ. 44.48 లక్షల విలువ చేసే 737 తోడ్పాటులు మరియు సహాయక పరికరాల పంపిణీ
Posted On:
14 FEB 2022 6:01PM by PIB Hyderabad
దివ్యాంగులకు తోడ్పాటులు మరియు వివిధ సహాయక పరికరాల పంపిణీ కోసం వికలాంగుల సాధికారత శాఖ (డీఈపీడబ్ల్యుడీ)
‘సామాజిక అధికార శివిర్’ను నిర్వహించింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏడీఐపీ పథకం కింద 'దివ్యాంగజన్'లకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లా పరిపాలనా విభాగం, అలీమ్‌కో సౌజన్యంతో 15.02.2022 న ఉదయం 11 గంటలకు స్టేడియం వద్ద షాస్కియా ఉచ్చత్తర్ మాధ్యమిక విద్యాలయ నం. 2 వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. మంత్రి హజరుతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ అనిల్ జైన్ ఎమ్మెల్యే (నివారి) మరియు డాక్టర్ శిశుపాల్ యాదవ్ ఎమ్మెల్యే (పృథ్వీపూర్) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. శ్రీ రంజన్ సెహగల్, సీఎండీ, అలీమ్‌కో, లెఫ్టినెంట్ కల్నల్ పి.కె. డ్యూబ్ (రిటైర్డ్), జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), అలీమ్‌కో మరియు నివారి జిల్లా పరిపాలన వ్యవస్థ నుంచి ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ కేటగిరీల వికలాంగులకు సంబంధించిన మొత్తం 737 తోడ్పాటులను, సహాయక పరికరాలను మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో ముందుగా గుర్తించబడిన 409 మంది దివ్యాంగులకు పంపిణీ చేయనున్నారు. వీటి విలువ రూ. 44.48 లక్షలు. వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. \
****
(Release ID: 1798391)
Visitor Counter : 158