భారత పోటీ ప్రోత్సాహక సంఘం

స‌జ్జ‌న్ ఇండియా లిమిటెడ్ లో ఈక్విటీ వాటా మూల‌ధ‌నాన్ని కొనుగోలు చేయ‌డానికి సోనా కంపెనీ పిటిఇ లిమిటెడ్‌ని అనుమ‌తించిన సిసిఐ

Posted On: 14 FEB 2022 3:41PM by PIB Hyderabad

కాంపిటీష‌న్ చ‌ట్టం, 2002లోని సెక్ష‌న్ 31 (1) కింద సోనా కంపెనీ పిటిఇ లిమిటెడ్ (కొనుగోలుదారు) స‌జ్జ‌న్ ఇండియా లిమిటెడ్ (ల‌క్ష్యం)లో  ఈక్విటీ మూల‌ధానాన్ని పొందేందుకు కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలిపింది. 
ల‌క్ష్యిత సంస్థ ఈక్విటీ షేర్ల‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా అందులో పెట్టుబ‌డి పెట్ట‌డానికి సంబంధించిన‌ ప్ర‌తిపాదిత క‌ల‌యిక కాంపిటీష‌న్ చ‌ట్టం, 2002లోని సెక్ష‌న్ 5 (ఎ)కింద‌కు వ‌స్తుంది. 

కొనుగోలుదారు

కొనుగోలుదారు సింగ్‌పూర్ చ‌ట్టాల కింద ఏర్ప‌డిన పెట్టుబ‌డి సంస్థ‌. కొనుగోలుదారుకు భార‌త్‌లో ఎటువంటి భౌతిక ఉనికి లేదు. నోటీసు తేదీ నాటికి కొనుగోలుదారుకి భార‌త్‌లో ఎటువంటి పోర్ట్‌ఫోలియో కంపెనీలు లేక పెట్టుబ‌డులు లేవు. 

ల‌క్ష్యిత సంస్థ‌
భార‌త్‌లో ల‌క్ష్యిత సంస్థ కార్య‌క‌లాపాలు (1) వ్య‌వ‌సాయ ర‌సాయ‌నాల‌లో వినియోగించే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాల త‌యారీ,  కాంట్ర‌క్టుపై త‌యారీ, (2) ప్ర‌త్యేక ర‌సాయ‌నాల ఉత్ప‌త్తి, వ్యాపారం (3) రంగులు, వ‌ర్ణ‌కాలలో ఉప‌యోగించే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు (4) ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు/ (క్రియాశీల‌క ఔష‌దీయ ప‌దార్ధాలు కాకుండా)  ఔష‌ధ త‌యారీలో మ‌ధ్య ర‌క‌పు ప‌దార్ధాల ఉత్ప‌త్తి (5) ర‌సాయ‌న కార‌కాల త‌యారీ.

సిసిఐ వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్నాయి. 

***



(Release ID: 1798322) Visitor Counter : 114