ప్రధాన మంత్రి కార్యాలయం

వన్ ఓశన్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం

Posted On: 11 FEB 2022 8:25PM by PIB Hyderabad

అధ్యక్షుడు శ్రీ మేక్రోన్,

మహానుభావులారా,

నమస్కారం.

మహాసాగరాల కోసం ఈ మహత్వపూర్ణమైనటువంటి ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ కు ఇవే నా అభినందన లు.

భారతదేశం సదా సముద్ర సంబంధి నాగరకత కు ఆలవాలం గా ఉంటోంది.

మా ప్రాచీన గ్రంథాల లో, సాహిత్యం లో సముద్ర సంబంధి జీవనం సహా మహాసాగరాలు అందించేటటువంటి కానుకల ను గురించిన వర్ణన లు ఉన్నాయి.

మహాసాగరాల తో ప్రస్తుతం మన భద్రత మరియు మన సమృద్ధి ముడిపడి ఉన్నాయి.

సముద్ర సంబంధి వనరుల కు భారతదేశం అమలుపరుస్తున్న ‘‘ఇండో పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్’’ లో ఒక ప్రముఖ స్థానాన్ని ఇవ్వడమైంది.

ఫ్రాన్స్ అమలుపరుస్తున్నటువంటి ‘‘హై ఏంబిశన్ కోఎలిశన్ ఆన్ బయో డైవర్సిటి బియాండ్ నేశనల్ జ్యూరిస్ డిక్శన్’’ ను భారతదేశం సమర్ధిస్తోంది.

చట్టపరం గా బాధ్యతాయుతం గా ఉండేటటువంటి ఒక అంతర్జాతీయ సంధి ఈ సంవత్సరం లో కుదరుతుందని మేము ఆశపడుతున్నాం.

ఒకసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ ను నిర్మూలించడం కోసం భారతదేశం కంకణం కట్టుకొంది.

భారతదేశం ఇటీవల కోస్తా తీర ప్రాంతాల లో నుంచి ప్లాస్టిక్ ను మరియు ఇతర వ్యర్థాల ను శుభ్రం చేయడం కోసం ఒక దేశ వ్యాప్త చైతన్య వ్యాప్తి కార్యక్రమాన్ని నిర్వహించింది.

మూడు లక్షల మంది యువ జనులు దాదాపు గా 13 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల ను పోగుచేశారు.

సముద్రాల లో నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల ను శుభ్రం చేయడం కోసం 100 నౌకాదినాల ను ఇచ్చి తోడ్పడవలసిందంటూ మా నౌకాదళాన్ని కూడాను నేను ఆదేశించాను.

ఒకసారి వాడే ప్లాస్టిక్స్ విషయం లో ప్రపంచ వ్యాప్త కార్యక్రమాన్ని మొదలుపెట్టడం లో ఫ్రాన్స్ తో భారతదేశం సంతోషం గా చేతులు కలుపుతుంది.

అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ గారు, మీకు ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను.

 

 

***



(Release ID: 1798021) Visitor Counter : 149