విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఇండియా ఇం డియా ఇంధన పరివర్తన లక్ష్యాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించేందుకు వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నకేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
ఇంధన పొదుపు, సామర్థ్యానికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి ఒక ఏజెన్సీ ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ.
2024 నాటికి డీజిల్ అవసరం లేని రంగంగా వ్యవసాయ రంగం మార్చి డీజిల్‌కు బదులుగా పునరుత్పాదక ఇంధనాన్ని వాడాలన్నది ఇండియా లక్ష్యం.
Posted On:
11 FEB 2022 11:24AM by PIB Hyderabad
భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల పాత్రను చర్చించేందుకు కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్,విద్యుత్ మంత్రిత్వశాఖ, ఎం.ఎన్ ఆర్.ఇ, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన , విద్యుత్, ఇంధన విభాగ అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపుల్ సెక్రటరీలతో జరిగిన వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
వాతావరణ మార్పులు , గ్లోబల్ వార్మింగ్ కు వ్యతిరేకంగా ఇండియా పోరాటానికి ప్రధానమంత్రి నిబద్ధతను శ్రీ ఆర్.కె.సింగ్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఆర్ధిక రంగానికి సంబంధించి అన్ని రంగాలలో ఇంధన పొదుపును నిర్ధారించడానికి,రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
కాప్ 26 కు అనుగుణంగా మన దేశం కార్బన్ తీవ్రతను తగ్గించేందుకు ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశ వాతావరణ కట్టుబాట్లను నెరవేర్చడంలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం , రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంధన ఆదా లక్ష్యాలను నిర్ణయించడం ఈ సమావేశం లక్ష్యం .
. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్త శ్రీ ఆర్.కె.సింగ్ ,ఆర్థిక రంగానికి చెందిన కీలక రంగాలలో ఇంధన సామర్థ్యానికి సంబంధించిన చర్యల విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంధన సామర్ధ్యానికి, ఇంధన పొదుపునకు సంబంధించి రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఏజెన్సీలు అవసరమని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మనం నూతన ,ఆధునిక భారతావని కోసం కృషి చేస్తున్నామని, ఆధునిక విద్యుత్ వ్యవస్థ లేకుండా ఇది సాధ్యం కాదని అన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
2024 నాటికి వ్యవసాయ రంగంలో డీజిల్ వాడకాన్ని తొలగించి దాని స్థానంలో పునరుత్పాదక ఇంధనాన్ని వాడనున్నదని ఆర్.కె. సింగ్ స్పష్టం చేశారు.
వాణిజ్య భవనాలు ఇసిబిఎస్‌లను అనుసరించాలని, దేశీయ భవనాలు ఎకోనివాస్ లను అనుసరించాలని, ఇది భవన నిర్మాణ చట్టాలలో అంతర్భాగం కావలని అన్నారు. విద్యుత్ అవసరాలన్నీ శిలాజేతర ఇంధన విధానాలు , ఇంధన నిల్వ ద్వారా సమకూర్చుకోవాలన్నారు.
2021 నవంబర్ లో గ్లాస్‌గో లో జరిగిన కాప్ 26 వాతావరణ శిఖరాగ్ర సమ్మేళనంలో, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గౌరవ ప్రధానమంత్రి ఇండియా ప్రతిపాదించే పంచామృత్ ను ప్రకటించారు. ఈ ఐదు అంశాలు కింది విధంగా ఉన్నాయి.
-ఇండియా 2030 నాటికి శిలాజేతర ఇంధన సామర్ధ్యాన్ని 500 గిగా వాట్లకు చేరుకుంటుంది,.
-2030 నాటికి ఇండియా తన 50 శాతం ఇంధన అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరులనుంచి సమకూర్చుకుంటుంది.
-2030 నాటికి ఇండియా కర్బన ఉద్గారాల అంచనాను 1 బిలియన్ టన్నులకు తగ్గించనుంది.
ఇండియా 2030 నాటికి ఆర్థిక వ్యవస్థలో కర్బన తీవ్రతను 45 శాతం కంటే తక్కువకు కుదించనుంది.
2070 నాటికి, ఇండియా కర్బన ఉద్గారాల నెట్ జీరోను సాధించనుంది.
రాష్ట్రాల స్థాయిలో ఇందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలను చర్చించడానికి సంబంధించి డిజి బిఇఇ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు.
విద్యుత్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ఇంధన సామర్ధ్య కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధికి వీలు కల్పించడం, దీనికి మద్దతు నివ్వడం అవసరమని, రాష్ట్రాలు కేంద్ర పాలితప్రాంతాలు ప్రత్యేక లక్ష్యాలు సాధించడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల అధికారుల ఇంటరాక్టివ్ సెషన్ తో ఈ కార్యక్రమం ముగిసింది. ఇటీవలి కాలంలో చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యకలాపాలు అవి సాధించిన విజయాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు.
రాష్ట్రాలకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో, ఆయా రాష్ట్రాలు తమకు నిర్దేశించిన లక్ష్యాలు నెరవేర్చడంలో బి.ఇ.ఇ వాటికి అండగా నిలవనుంది.
***
(Release ID: 1797980)
Visitor Counter : 250