నౌకారవాణా మంత్రిత్వ శాఖ

శ్రీ సర్బానంద సోనోవాల్ సమీక్షించిన ప్రధాన నౌకాశ్రయాల వ్యాపార సౌలభ్య (EoDB) చర్యలు , ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ ప్రణాళికక్రింద ద్వారా నిర్వహణ సామర్థ్య సాంకేతికత (OETT)

Posted On: 09 FEB 2022 4:15PM by PIB Hyderabad

కేంద్ర నౌకాశ్రయాలు, నౌకా రవాణా  జల మార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ ప్రణాళిక కింద వృద్ధిని పెంచడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ఆపరేషనల్ ఎఫిషియెన్సీ త్రూ టెక్నాలజీ (OETT) ల కోసం వివిధ నౌకాశ్రయాలు  చేపట్టిన కార్యక్రమాల సమగ్ర సమీక్షను చేపట్టారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ అన్ని మేజర్ ఓడరేవుల చైర్మన్లు, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీనియర్ అధికారుల సమక్షంలో ఈ సమీక్ష నిర్వహించారు.

 

 

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సాధించడానికి ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ ప్రణాళిక మూలస్తంభాలపై భారతదేశ వృద్ధి ప్రయాణాన్ని నడిపించడానికి మేజర్ పోర్టుల భవిష్యత్తు దిశానిర్దేశాన్ని  చర్చించారు. ప్రధానమంత్రి గతి శక్తి ఏడు వాహకాల  ద్వారా అభివృద్ధి చెందుతుంది - రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సామూహిక రవాణా, జలమార్గాలు  లాజిస్టిక్స్, నౌకాశ్రయాలు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ జాతీయ మాస్టర్ ప్లాన్ సాకారంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, అతుకులు లేని కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి  పౌరులకు సుపరిపాలన అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన బహుళ-మోడల్ కనెక్టివిటీ మాస్టర్‌ప్లాన్. గ్రేటర్ నికోబార్‌లో ట్రాన్స్ షిప్‌మెంట్ హబ్ నిర్మాణం కూడా చర్చల్లో భాగమైంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఓడరేవులు, ఇతరత్రా చేపట్టిన సమీకృత ప్రయత్నాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతాయి. ప్రధానమంత్రి  గతి శక్తి ప్రజలకు, రైతులకు, మత్స్యకార సమాజానికి సహాయం చేస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తన ఇటీవలి పాట్నా పర్యటనను హైలైట్ చేస్తూ  'IWAI కే సాథ్ యే నదీ ఔర్ సాగర్ కా సహ్యోగ్ హై, గంగా మా హై ఔర్ బ్రహ్మపుత్ర పితా' అని అన్నారు.

IWAIతో ఇది సదీసాగరసంగమం లాంటి బంధం అనీ,  గంగ, బ్రహ్మపుత్ర నదులను  తల్లిదండ్రులతో పోల్చారు.

 

 

దేశంలోని యువతకు ప్రయోజనం చేకూరేలా ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌ను ప్రోత్సహించడంతోపాటు  నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని శ్రీ సోనోవాల్ అధికారులను కోరారు.

కేంద్ర సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ మాట్లాడుతూ, "ఓడరేవులు, షిప్పింగ్,  జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి గతి శక్తికి కట్టుబడి ఉందనడానికి నేటి సమావేశం ఒక ముందడుగు"

ప్రధానమంత్రి గతి శక్తి, స్మార్ట్, మెగా గ్రీన్ పోర్ట్స్, వ్యాపార సౌలభ్య విధానం,    మారిటైమ్ ఇండియా విజన్ (MIV) 2030 కింద వృద్ధికి సంబంధించిన ఏడు స్తంభాలను ప్రస్తావన  చేస్తూ, బహుళ నమూనా అనుసంధానంపై కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్ మాట్లాడారు.

ఈ రోజు సుదీర్ఘ సమావేశంలో పీఎం గతి శక్తి కార్యక్రమాలు, వాహన స్క్రాపింగ్ విధానం, MIV 2030 అమలు, ఓడరేవుల చైర్మన్ ద్వారా కొనసాగుతున్న, పూర్తయిన మరియు భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా చర్చించారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా, మరింత మందికి లబ్ధి చేకూరేలా మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని సీనియర్‌ అధికారులందరూ హామీ ఇచ్చారు.

***



(Release ID: 1797208) Visitor Counter : 96