రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అడవులు / వన్యప్రాణుల అభయారణ్యాల గుండా వెళుతున్న - ఎన్.హెచ్.ఎస్.
प्रविष्टि तिथि:
09 FEB 2022 2:42PM by PIB Hyderabad
సుమారు 100 జాతీయ రహదారులలో కొన్ని ప్రాంతాలు లేదా విభాగాలు వన్యప్రాణి అభయారణ్యం / జాతీయ పార్కులు లేదా వాటి పర్యావరణ పరమైన ప్రాంతం (ఈ.ఎస్.జెడ్) గా ప్రకటించిన అటవీ ప్రాంతాలలో ఉంటున్నాయి లేదా వాటి గుండా వెళుతున్నాయి.
వన్యప్రాణులపై రహదారుల అభివృద్ధి ప్రభావాన్ని తగ్గించడానికి, అది సుదీర్ఘ మార్గం లేదా బైపాస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ. జాతీయ ఉద్యానవనాలు లేదా వన్యప్రాణుల అభయారణ్యాల ద్వారా ఏదైనా రహదారి నిర్మాణం జరగకుండా ఉండడానికి, అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని, సంబంధిత ఏజెన్సీలకు, మంత్రిత్వ శాఖ, ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది పూర్తిగా అనివార్యమైన సందర్భాల్లో, సేకరించవలసిన భూమి గరిష్టంగా 30 మీటర్ల మార్గంలో పరిమితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా, అటువంటి ప్రాంతాల్లో పనులు చేపట్టడానికి ముందు, వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972; అటవీ మార్పిడి చట్టం-1980; పర్యావరణ (రక్షణ) చట్టం-1986 ప్రకారం అవసరమైన అన్ని అనుమతులు పొందవలసి ఉంటుంది. "వన్యప్రాణులపై ఈ మౌలిక సదుపాయాల ప్రభావాలను తగ్గించడానికి చేపట్టవలసిన పర్యావరణ అనుకూల చర్యలు", అనే శీర్షికతో, భారత వన్యప్రాణుల సంస్థ ప్రణాళిక దశలోనే తయారు చేసిన కరదీపిక లోని నిబంధనలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను కూడా ఆదేశించింది.
ఇంకా - కల్వర్టుల నిర్మాణం; అండర్-పాస్; ఓవర్-పాస్ (ఎకో-డక్ట్); వయాడక్ట్; టన్నెల్; గార్డ్-వాల్; ఫెన్సింగ్; మొక్కల పెరుగుదల; యాంటీ-లైట్ గ్లేర్; సౌండ్ బారియర్ మొదలైన వాటికి సంబంధించిన అవరోధాల వంటి స్థలం అవసరాలకు అనుగుణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంపికలను చేర్చడం ద్వారా అటవీ అధికారులతో సంప్రదించి ఆయా స్థలాల పట్ల నిర్దిష్ట ఉపశమన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఆమోదం పొందిన వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక ప్రకారం - నీటి వనరులు ఏర్పాటు; ఆయా ప్రాంతాల్లో నిర్దిష్ట తోటల పెంపకం తో పాటు ల్యాండ్ స్కేపింగ్; జంతు సంరక్షణ కేంద్రాలు; సహాయ రక్షణ కార్యక్రమాలు; వేటను నిరోధించే కేంద్రాలు; వాచ్ టవర్; పర్యవేక్షణ; అవగాహన; స్థానికుల ప్రమేయం; పోస్ట్ గార్డ్ నిర్మాణం; వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణతో పాటు, మానవులు, జంతువుల మధ్య సంఘర్షణ తగ్గించడం కోసం, రక్షిత ప్రాంతాలు (పి.ఏ) లేదా వాటి ఎకో సెన్సిటివ్ జోన్ (ఈ.ఎస్.జెడ్) మొదలైన వాటి సరిహద్దు చుట్టూ ప్రకాశవంతంగా చేయడం; కంచె ఏర్పాటు చెయ్యడం; వంటి చర్యలు తీసుకోవడానికి సంబంధిత అటవీ అధికారులకు ఎప్పటికప్పుడు నిధులు కూడా అందించడం జరుగుతోంది. ప్రజలను, రహదారి వినియోగదారులను అప్రమత్తం చేయడంతో పాటు, జంతువులను రక్షించడం కోసం అటవీ అధికారుల సమన్వయంతో ఉరుములు వంటి శబ్దాలు చేసే పరికరాలను (రంబుల్ స్ట్రిప్స్), హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, ఈ రోజు, రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానం లో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(रिलीज़ आईडी: 1797104)
आगंतुक पटल : 318