రైల్వే మంత్రిత్వ శాఖ
100వ టెక్స్‌టైల్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్న పశ్చిమ రైల్వే ముంబయి డివిజన్
- కేవలం ఐదు నెలల వ్యవధిలో రైల్వే ఈ మైలురాయిని సాధించింది
- మొదటి టెక్స్‌టైల్ ఎక్స్‌ప్రెస్ 01 సెప్టెంబర్ 2021న ప్రారంభించబడింది
Posted On:
09 FEB 2022 12:30PM by PIB Hyderabad
పశ్చిమ రైల్వేలోని ముంబయి సెంట్రల్ డివిజన్, చల్తాహాన్ (సూరత్ ప్రాంతం) నుండి సంక్రైల్ (ఖరగ్‌పూర్ డివిజన్, ఎస్ఈఆర్) వరకు 100వ టెక్స్‌టైల్ రైలును లోడ్ చేసి ఒక మైలురాయిని సాధించింది. 01.09.2021న ఉద్నా నుండి మొదటి రైలును రైల్వే శాఖ, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష జెండా ఊపి ప్రారంభించారు. అయిదు నెలల వ్యవధిలో ఈ మైలురాయిని సాధించడం రైల్వేపై సూరత్ టెక్స్‌టైల్ రంగానికి పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో శంక్రైల్, షాలిమార్ మరియు తూర్పు మధ్య రైల్వేలోని దానాపూర్ & నారాయణపూర్ ప్రధాన గమ్యస్థానాలుగా ఈ రైళ్లు తమ పయనం సాగించాయి. చల్తాన్-67 & ఉద్నా-33 నుండి మొత్తం ఎంఎన్‌జీ రేక్‌లు లోడ్ చేయబడ్డాయి. టెక్స్‌టైల్ ఎక్స్‌ప్రెస్‌ల మూలంగా రైల్వే మొత్తంగా రూ.10.2 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
***
(Release ID: 1797044)
Visitor Counter : 161