రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహనాలకు హైడ్రోజన్ ఇంధనం
Posted On:
09 FEB 2022 2:43PM by PIB Hyderabad
దేశంలో వాహనాలు నడపడానికి ఒక ఇంధనంగా హైడ్రోజన్ ను ఉపయోగించడాన్ని అనుమతిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, 2016 సెప్టెంబర్, 16వ తేదీన జి.ఎస్.ఆర్. 889(ఈ) ఆదేశాలను జారీ చేసింది. ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజన్ కోసం వినియోగించే హైడ్రోజన్ కు అవసరమైన లక్షణాలను నోటిఫికేషన్ కు జత చేసిన అనుబంధం IV-డబ్ల్యూ. లో పేర్కొనడం జరిగింది. 2020 సెప్టెంబర్, 25వ తేదీన విడుదల చేసిన జి.ఎస్.ఆర్. 585(ఈ) ఆదేశాల ద్వారా ఈ మంత్రిత్వ శాఖ, సి.ఎన్.జి. (హెచ్.సి.ఎన్.జి) తో 18 శాతం హైడ్రోజన్ మిశ్రమాన్ని తెలియజేయబడింది. 2020 సెప్టెంబర్, 23వ తేదీన జారీ చేసిన జి.ఎస్.ఆర్. 579(ఈ) ద్వారా, ఈ మంత్రిత్వ శాఖ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు, దాని భాగాలకు సంబంధించి భద్రతా నిబంధనలను పేర్కొంది.
నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, హైడ్రోజన్ ఆధారిత రవాణా మరియు ఇంధన కణాల అభివృద్ధి తో సహా పునరుత్పాదక శక్తి యొక్క వివిధ అంశాల్లో పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి పునరుత్పాదక ఇంధన పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
హైడ్రోజన్ మరియు ఇంధన కణాల పై కొనసాగుతున్న ఆర్. & డి. ప్రాజెక్టులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-
i. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బయోమాస్ గ్యాసిఫికేషన్ ద్వారా అధిక స్వచ్ఛత కలిగిన హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.
ii. చెన్నై లోని ఏ.ఆర్.సి.ఐ. సెంటర్ ఫర్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీస్, 20 కిలో వాట్ పి.ఈ.ఎం. ఫ్యూయల్ సెల్ స్టాక్ లను ఉత్పత్తి చేయడానికి ఇంటిగ్రేటెడ్ ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ను ఏర్పాటు చేస్తోంది.
iii. ఫోటో ఎలెక్ట్రో కెమికల్ స్ప్లిటింగ్ నీటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించిన నూతన పదార్థాలను, దయాల్-బాగ్ విద్యాసంస్థ, అభివృద్ధి చేసింది. 2021లో ఈ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన పదార్థాలకు రెండు పేటెంట్లు మంజూరు చేయడం జరిగింది.
iv. హైడ్రోజన్ ఇంధనంపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించే ప్రాజెక్టు కింద, గుర్గావ్ లోని జాతీయ సౌర ఇంధన సంస్థ, హైడ్రోజన్ ఇంధన వాహనాలతో సహా వివిధ అప్లికేషన్లను ప్రదర్శించడానికి వీలుగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన ఎలక్ట్రోలైజర్ తో పాటు, ఇతర పరికరాలను సేకరించింది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1797040)
Visitor Counter : 155