విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పవర్ ఫౌండేషన్ సమావేశానికి అధ్యక్షత వహించిన విద్యుత్ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 FEB 2022 3:14PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ శాఖ, ఎంఎన్ ఆర్ ఇ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ నిన్న పవర్ ఫౌండేషన్ తో సమావేశానికి వర్చువల్ గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ , ఎంఎన్ ఆర్ ఇ సెక్రటరీ శ్రీ ఇందు శేఖర్ చతుర్వేది, విద్యుత్ పిఎస్ యుల చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం పవర్ ఫౌండేషన్ పరిశోధన- అభివృద్ధి, విధాన అనుకూలత, కమ్యూనికేషన్ వ్యూహానికి సంబంధించి లక్ష్యాలు, నిర్వహణ పద్ధతి గురించి చర్చించింది.

భారతదేశ ఇంధన పరివర్తన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి , ఇ-మొబిలిటీ ఎలక్ట్రిక్ కుకింగ్ పై వినియోగదారులలో  అవగాహనను ప్రోత్సహించడానికి సాక్ష్యాల ఆధారిత పరిశోధన అధ్యయనాలను నిర్వహించడానికి పవర్ ఫౌండేషన్ ను ఉపయోగించాలని మంత్రి సింగ్ అధికారులను  ఆదేశించారు.

పవర్ ఫౌండేషన్ ఈ క్రింది వాటిపై అధ్యయనాలు చేపట్టాలని మంత్రి సూచించారు:

*భారతదేశంలో జలవిద్యుత్ అభివృద్ధిని వేగవంతం చేయడం.

*భారతదేశంలో కార్బన్ రాహిత్యం (డీకార్బనైజేషన్) కోసం వ్యూహాత్మక రోడ్ మ్యాప్ అభివృద్ధి చేయడం

*పర్యావరణ నిబంధనలను పాటించడంలో ప్రత్యామ్నాయంగా ఎఫ్ జి డి సాంకేతికత

ప్రభావం

*పెద్ద ఎత్తున ఆర్ ఈ ఇంటిగ్రేషన్

*దేశం లో ఇంధన మార్పు కోసం స్వల్పకాలిక, మధ్యకాలిక , దీర్ఘకాలిక రోడ్ మ్యాప్.

చేపట్టేందుకు సిఫారసు చేసిన ఇతర అధ్యయనాలు:

*భారతదేశంలో డిస్కమ్ ల పవర్ ప్రొక్యూర్ మెంట్ ఖర్చులను సమీక్షించడం, ఆప్టిమైజేషన్ చేయడం

*శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యం కలిగిన 500 జి డబ్ల్యు కోసం అవసరమైన పెట్టుబడులు; మార్కెట్ ఇన్ స్ట్రుమెంటల్ కు సంబంధించిన సమస్యలు

*గ్రిడ్-స్కేల్ స్టోరేజీ, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ స్టోరేజీ ,ఇతర ఆప్షన్ లు).

హైడ్రోజన్ ఎకానమీ: భారతదేశం ముందు ఎంపికలు.

*భారత దేశ జి 20 ప్రెసిడెన్సీ, క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ నాలెడ్జి భాగస్వామిగా కూడా విద్యుత్ మంత్రిత్వ శాఖకు పవర్ ఫౌండేషన్ సహాయం అందిస్తుంది.

పవర్ ఫౌండేషన్ గురించి:

పవర్ ఫౌండేషన్ అనేది ఒక రిజిస్టర్డ్ సొసైటీ, ఇది విద్యుత్, దాని అనుబంధ రంగాలపై జాతీయ స్థాయి చర్చలలో భాగస్వామ్యం వహించే అగ్రశ్రేణి విధాన సానుకూల సంస్థగా ఉంటుంది, ఇది అధికారిక విశ్లేషణ, డేటా, విధాన సిఫార్సులను,  వాస్తవ ప్రపంచ పరిష్కారాలను రాష్ట్రాలకు అందిస్తుంది. అందరికీ సురక్షితమైన ,స్థిరమైన విద్యుత్ ను  అందిస్తుంది. భారతదేశ ఇంధన పరివర్తన కోసం మృదువైన మార్గాలను సృష్టిస్తుంది.

విద్యుత్ రంగంలో ఇంధన పరివర్తనకు సంబంధించిన వివిధ అంశాలపై విశ్వసనీయ సంస్థల ద్వారా స్వతంత్ర ,సాక్ష్యాల ఆధారిత పరిశోధన అధ్యయనాలను నియమించడంలో మార్గదర్శక ప్రయత్నాలను చేపట్టడం ,తరువాత గుర్తించబడిన వాటాదారులలో అవగాహన కల్పించడానికి తగిన కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా దీని లక్ష్యం.

 

***


(రిలీజ్ ఐడి: 1797037) సందర్శకుల సూచీ సంఖ్య : : 131
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil