శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి స్వీయ-క్రిమిసంహారక, బయోడిగ్రేడబుల్ ఫేస్ మాస్కులను అభివృద్ధి చేసిన - శాస్త్రవేత్తలు

Posted On: 04 FEB 2022 2:38PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి పై పోరాడేందుకు ఒక పరిశ్రమ భాగస్వామ్య సహకారంతో భారతీయ శాస్త్రవేత్తల బృందం "స్వీయ-క్రిమిసంహారక 'రాగి-ఆధారిత నానో-పార్టికల్-కోటెడ్-యాంటీవైరల్-ఫేస్-మాస్క్‌" ను అభివృద్ధి చేసింది.   బయోడిగ్రేడబుల్, అత్యంత శ్వాసక్రియకు ఇబ్బందిలేని, ఉతికి శుభ్రం చేయడానికి అనువైన ఈ మాస్క్, కోవిడ్-19 వైరస్‌తో పాటు అనేక ఇతర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా అధిక పనితీరును ప్రదర్శిస్తుంది. 

సార్స్-కోవ్-2, ఒక ఎన్వలప్డ్ పాజిటివ్ సెన్స్ సింగిల్-స్ట్రాండ్డ్ ఆర్.ఎన్.ఏ. వైరస్ వల్ల కలిగే కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో, ప్రజలు మాస్క్ ధరించడం అనేది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ వైరస్ వ్యాప్తి ప్రధానంగా గాలిలో ఉండే శ్వాసకోశ కణాల ద్వారా జరుగుతుంది.

ప్రసారానికి ఆటంకం కలిగించే మాస్కుల వాడకం గురించి సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భారతీయ మార్కెట్ యాంటీవైరల్ లేదా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను ప్రదర్శించని ఖరీదైన మాస్క్‌లను విక్రయిస్తోంది.  అందువల్ల, వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ఆసుపత్రులు, విమానాశ్రయాలు, స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంప్రదాయ ముసుగు ధరించడం ద్వారా ప్రసారాన్ని నియంత్రించడం చాలా కష్టం.  కోవిడ్-19 మహమ్మారికి కారణమయ్యే కరోనా వైరస్‌ లో ఉత్పరివర్తనలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, తక్కువ ధర కలిగిన యాంటీ-వైరల్ మాస్కును  అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

ఈ మేరకు, సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ (సి.ఎస్.ఐ.ఆర్-సి.సి.ఎం.బి) మరియు బెంగళూరు లోని రెసిల్ కెమికల్స్ సంస్థ సహకారంతో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ కు చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన పరిశోధన, అభివృద్ధి కేంద్రం, పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ కోసం అంతర్జాతీయ ఆధునిక పరిశోధనా కేంద్రం (ఏ.ఆర్.సి.ఐ) లోని శాస్త్రవేత్తలు, కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు డి.ఎస్.టి. ప్రాయోజిత నానో-మిషన్-ప్రాజెక్టు కింద స్వీయ క్రిమి సంహారక "కాపర్-బేస్డ్-నానో-పార్టికల్-కోటెడ్-యాంటీ-వైరల్-ఫేస్-మాస్క్‌" లను అభివృద్ధి చేశారు. 

ఫ్లేమ్-స్ప్రే-పైరోలిసిస్ (ఎఫ్.ఎస్.పి) ప్రాసెసింగ్ సౌకర్యం ద్వారా దాదాపు 20 నానో-మీటర్ల-రాగి-ఆధారిత-నానో-పార్టికల్సును ఏ.ఆర్.సి.ఐ. అభివృద్ధి చేసింది.  ఎఫ్.ఎస్.పి. ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రత వద్ద పైరోలైటిక్ డీ-కంపోజ్ చేయడం ద్వారా సొల్యూషన్-ప్రెక్యూర్సర్లను నానో- పౌడర్లుగా మార్చడం జరుగుతుంది.  సాలిడ్-లోడింగ్ మరియు పి.హెచ్. ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా స్థిరమైన నానో-పార్టికల్-సస్పెన్షన్ లభిస్తుంది.  మంచి జిగురు పదార్ధం తో తగిన బైండర్ ను కలిపి నూలు వస్త్రం పై ఏక సమంగా ఈ నానో-పూత పూస్తారు.  ఈ విధంగా పూత పూసిన నూలు వస్త్రం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా 99.9శాతం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.  సార్స్-కోవ్-2 కి వ్యతిరేకంగా క్రిమిసంహారక లక్షణాల కోసం ఈ ఫాబ్రిక్ యొక్క సామర్థ్యాన్ని సి.ఎస్.ఐ.ఆర్-సి.సి.ఎం.బి. పరీక్షించింది. ప్రామాణిక ఫలితాల ద్వారా 99.9 శాతం క్రిమిసంహారకతను సాధించినట్లు స్పష్టమయింది.  ఒకటే పొరతో మరియు మూడు పొరలతో నానో-పార్టికల్-కోటెడ్-వస్త్రం బయట పొరలుగా, విభిన్న డిజైన్లను కలిగి ఉన్న ప్రోటో-టైప్- మాస్కులను ప్రదర్శించడం జరిగింది.  సాధారణ మాస్కు పై ఒక రక్షిత యాంటీ-వైరల్- ఔటర్-మాస్కు గా సింగిల్-లేయర్-మాస్కు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

వారి పారిశ్రామిక భాగస్వామి అయిన బెంగళూరు లోని రెసిల్ కెమికల్స్ సంస్థ ఇప్పుడు అలాంటి రెండు పొరల మాస్కులను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది.  ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫేస్-మాస్కులు వైరస్‌ లను ఫిల్టర్ చేస్తాయి కానీ వాటిని సంహరించవు.  అందువల్ల, మాస్కులను సరిగ్గా ధరించకపోయినా లేదా సరిగ్గా  పారవేయకపోయినా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  సాధారణ బహుళ పొరలతో ఉన్న క్లాత్ మాస్కులు సమాజంలో కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడంలో ప్రజల ఉపయోగం కోసం ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తాయి.  అదేవిధంగా ఈ స్వీయ-క్రిమిసంహారక-క్లాత్-మాస్కులను కూడా ధరించవచ్చు. 

దీనికి తోడు, ఉపయోగించిన మాస్కులను పారవేయడంపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆందోళన వ్యక్తమవుతోంది.  కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండే చాలా సాంప్రదాయక మాస్కులు, ఒకే వినియోగానికి సంబంధించినవిగా ఉన్నాయి.  బయో-డిగ్రేడబుల్ కావు.  తీవ్రమైన పర్యావరణ సమస్యలు, వ్యర్థ-నిర్వహణ సమస్యలను సృష్టిస్తాయి.  బయో-డిగ్రేడబుల్ నూలు వస్త్రం తో తయారు చేసిన ప్రస్తుత యాంటీ-వైరల్-మాస్కు ఆ సమస్యను కూడా తొలగిస్తుంది.  శ్వాస తీసుకోడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉతికి, శుభ్రం చేసుకోడానికి వీలుగా ఉంటుంది.

(డి)

 

(ఏ)     సి.యు. ఆధారిత నానో పౌడర్ల టి.ఈ.ఎం. చిత్రం,

(బి)    నానో పార్టికల్ కోటెడ్ ఫాబ్రిక్ - ఎఫ్.ఈ-ఎస్.ఈ.ఎం. చిత్రం,

(సి)     సార్స్-కోవ్-2 కి వ్యతిరేకంగా 99.9 శాతం కంటే ఎక్కువగా సమర్థతను ప్రదర్శించే మాస్క్ ఫాబ్రిక్,

(డి)     ఏ.ఆర్.సి.ఐ. వద్ద ఒక్క-పొర-స్వీయ-క్రిమినాశక మాస్కుల ప్రదర్శన

 

రెండు పొరల వైరస్ నిరోధక (స్వీయ-క్రిమిసంహారక) క్లాత్ మాస్కులు

సహాయకులు: 

డా. తాతా ఎన్. రావు; డాక్టర్ కలియన్ హెంబ్రమ్; డాక్టర్ బులుసు వి. శారద

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:  tata@arci.res.indirector@arci.res.in.

*****

 



(Release ID: 1795668) Visitor Counter : 204