సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రికార్డు స్థాయిలో దూరదర్శన్ రిపబ్లిక్ డే కవరేజ్
Posted On:
04 FEB 2022 11:21AM by PIB Hyderabad
జాతీయ ప్రాముఖ్యత గల భారీ కార్యక్రమాలను సమగ్రంగా కవర్ చేసి, వాటిని ప్రసారం చేయడంలో దూరదర్శన్‌కు సాటి మరొకటి లేదని గతంలో ఎన్నోసార్లు రుజువు చేసింది. అయితే ఈసారి 2022 రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాల కవరేజ్ విషయంలో మున్నెన్నడూ లేని రీతిలో దూరదర్శన్ తన రికార్డును తానే తిరగరాసింది. భారత వైమానిక దళ విన్యాసాలకు సంబంధించి మున్నెన్నడూ చూడని దృశ్యాలను దూరదర్శన్‌ప్రసారం చేసింది.
మారుతున్న వీక్షకుల విధానాలకు గుర్తుగా , రిపబ్లిక్ దినోత్సవ కవరేజ్ డిడి యూట్యూబ్ నెట్ వర్క్‌పై తన టివి నెట్ వర్క్ కంటే ఎక్కువమంది వీక్షకులను ఆకట్టుకోగలిగింది.యూట్యూబ్ నెట్ వర్క్ 2.6 కోట్ల మంది వీక్షకులు చూడగా, డిడి రిపబ్లిక్ డే కవరేజ్‌ని 2.3 కోట్ల మంది వీక్షకులుచూశారు. దీనికితోడు దూరదర్శన్ ప్రసారం చేసిన దృశ్యాలను ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం వరకు 180 కిపైగా ఛానళ్లు 3.2 బిలియన్ టెలివిజన్ వీక్షక నిమిషాలకు పైగా చూశారు.
ఈ చారిత్రక రిపబ్లిక్‌దినోత్సవ కవరేజ్‌తో్ దూరదర్శన్ అంతర్జాతీయ వీక్షక ప్రపంచంలో కూడా గణనీయమైన స్థాయిని పొందింది. అమెరికా, కెనడా, జర్మనీ,జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యుఎఇ సహా 140 దేశాల మొత్తం వీక్షకుల సంఖ్యలో ఎన్నో రెట్లు పెరుగుదల కనిపించింది.
రిపబ్లిక్ దినోత్సవ వీక్షకులసంఖ్యః
యు ట్యూబ్ డిడి --- 26 మిలియన్లకు పైగా వీక్షకులు
టీవి కార్యక్రమాలు .డిడి -- 22.8 మిలియన్లు
ప్రత్యక్ష ప్రసారాలు --180కి పైగా ఛానళ్లు
మోత్తంటివి వీక్షక సమయం --- 3.2 బిలియన్ నిమిషాలు
దూరదర్శన్ కవరేజ్‌ని దేశ విదేశాలలోని వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.
ఇప్పటికీ మిలియన్ల మంది చూస్తూ ట్రెండింగ్ లో ఉన్న కొన్ని రిపబ్లిక్ దినోత్సవ వీడియోలు......
మార్చింగ్ కంటింజెంట్ : - https://www.youtube.com/watch?v=PwmeHNAIouA
రిపబ్లిక్ డే పరేడ్ ప్లై పాస్ట్ - https://www.youtube.com/watch?v=3EOYAUykcKk
విరాట్ కు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీడ్కోలు - https://www.youtube.com/watch?v=0-qoGg08j9E
రాష్ట్రాల శకటాలు- https://www.youtube.com/watch?v=uq5RIoOLryY
ట్విట్టర్ లోప్రసార భారతి సెల్ఫీ ప్రచారానికి గొప్ప ఆదరణ లభించింది. వివిధ వయసులకు చెందిన భారతీయులు రిపబ్లిక్ దినోత్సవాన్ని దూరదర్శన్ లో చూస్తూ తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు. దీనికి మంచిఆదరణ లభించింది.
***
(Release ID: 1795663)
Visitor Counter : 169