రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

2022 గణతంత్ర వేడుకల ఉత్తమ శకటంగా ఉత్తరప్రదేశ్ శకటం ఎంపిక


జనాదరణ తరగతిలో మహారాష్ట్ర ఎంపిక

మంత్రిత్వ శాఖల తరగతిలో సంయుక్త విజేతలు.. విద్యా మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ

ఆన్‌లైన్ ఓటింగ్‌లో తపాలా శాఖకు అగ్రస్థానం

సీఏపీఎఫ్ లో ఉత్తమ కవాతు బృందంగా సీఐఎస్ఎఫ్ ఎంపిక

మై గొవ్ తరగతిలో సిఆర్పిఎఫ్ బృందానికి ప్రధమ స్థానం

సర్వీసెస్ విభాగంలో ఉత్తమ కవాతు బృందంగా నౌకా దళ బృందం

జనాదరణ విభాగంలో అగ్ర స్థానం సాధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Posted On: 04 FEB 2022 1:21PM by PIB Hyderabad

2022 గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉత్తమ శకటాలు, ఉత్తమ కవాతు ఫలితాలు వెలువడ్డాయి. కవాతులో పాల్గొన్న  త్రివిధ సేవలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ /ఇతర సహాయక బలగాలు మరియు వివిధ విభాగాల నుంచి ఉత్తమ  కవాతు బృందం , వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాల్లో ఆకట్టుకున్న శకటాన్ని ఎంపిక చేసేందుకు ఏర్పాటైన మూడు న్యాయ నిర్ణేత బృందాలు విజేతలను ప్రకటించాయి.  

మూడు సర్వీసుల్లో  ఇండియన్ నేవీ కవాతు బృందం అత్యుత్తమ కవాతు బృందంగా ఎంపికైంది.

          సీఏపీఎఫ్  /ఇతర సహాయక దళాల నుంచి  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్  ఉత్తమ కవాతు బృందంగా ఎంపికైంది.

జనవరి 262022న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పాల్గొన్న శకటాలలో  ఉత్తరప్రదేశ్ శకటం  ఉత్తమ శకటం గా ఎంపిక చేయబడింది. ఉత్తరప్రదేశ్ శకటం 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు కాశీ విశ్వనాథ్ ధామ్' అనే ఇతివృత్తంతో రూపొందింది.  

'క్రెడిల్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యాండ్ క్రాఫ్ట్' ఆధారంగా  కర్ణాటక ప్రదర్శించిన శకటానికి రెండో స్థానం లభించింది.  మేఘాలయ శకటానికి  మూడవ స్థానం లభించింది.   50 సంవత్సరాల రాష్ట్ర హోదా మరియు మహిళల నేతృత్వంలోని సహకార సంఘాలు  స్వయం సహాయక బృందాలకు  నివాళి' 'పై మేఘాలయ తన శకటాన్ని రూపొందించింది. 

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాల తరగతిలో విద్యా మంత్రిత్వ శాఖ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శకటాలు  సంయుక్త విజేతలుగా నిలిచాయి. ' జాతీయ విద్యా విధానం' ఇతివృత్తంతో విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ శకటం రూపొందింది. 'ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్నినాదంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన శకటానికి రూపకల్పన చేసింది. కవాతులో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల నుంచి  తొమ్మిది శకటాలు  పాల్గొన్నాయి.

'సుభాష్ @125ఇతివృత్తంతో గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రదర్శించిన శకటం  'వందే భారతంనృత్య బృందం ప్రత్యేక బహుమతి తరగతిలో ఎంపిక చేయబడ్డాయి.

జనాదరణ  అవార్డులు

 మొదటిసారిగా MyGov ప్లాట్‌ఫారమ్ ద్వారా జనాదరణ తరగతిలో ఉత్తమ శకటం, ఉత్తమ కవాతు బృందాన్ని ఎంపిక చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి  ఆన్‌లైన్ పోల్ జనవరి 25-312022 మధ్య నిర్వహించబడింది.

జనాదరణ పొందిన ఎంపిక లో , భారత వైమానిక దళం  కవాతు బృందం మూడు సర్వీసులలో అత్యుత్తమ కవాతు బృందంగా ఎంపిక అయ్యింది. 

                సీఏపీఎఫ్    /ఇతర సహాయక దళాల నుంచి పాల్గొన్న కవాతు బృందాలలో  ఉత్తమ కవాతు బృందంగా MyGovలో  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్   ఎక్కువ  ఓట్లు పొంది ప్రథమ స్థానం పొందింది. 

జనాదరణ విభాగంలో  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పాల్గొన్న శకటాలలో  మహారాష్ట్ర శకటం ఉత్తమ శకటంగా  ఎంపిక అయ్యింది . దీనిని  'జీవవైవిధ్యం మరియు మహారాష్ట్ర  రాష్ట్ర జీవ-చిహ్నాలు' అనే ఇతివృత్తంతో ప్రదర్శించారు. ఈ విభాగంలో ఉత్తరప్రదేశ్ శకటం ద్వితీయ స్థానం సాధించింది. ' మారుతున్న జమ్మూ కాశ్మీర్' పేరుతొ జమ్మూ కాశ్మీర్ ప్రదర్శించిన శకటానికి తృతీయ స్థానం లభించింది. 

జనాదరణ విభాగంలో కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ/ తపాలా విభాగం శకటానికి అగ్ర స్థానం లభించింది. ' ఇండియా పోస్ట్: 75 సంవత్సరాల  @ దీక్ష- మహిళా సాధికారత' ఇతివృత్తంతో ఈ శకటం సిద్దమయ్యింది. 

***



(Release ID: 1795661) Visitor Counter : 166