భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

-బ్లూ ఎకానమీ- ముసాయిదా సిద్ధం!


రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన

Posted On: 03 FEB 2022 1:28PM by PIB Hyderabad

  నవ భారతదేశాన్ని 2030వ సంవత్సరానికల్లా సాధించాలంటూ 2019 ఫిబ్రవరిలో చేసుకున్న దార్శనిక సంకల్ప ప్రకటనలో బ్లూ ఎకానమీ వ్యవస్థకు కీలకపాత్ర ఉందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్రహోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. సాగర వనరుల సక్రమ వినియోగం, సముద్ర పర్యావరణ రక్షణతో కూడిన బ్లూ ఎకానమీ లక్ష్యంగా డీప్ ఓషన్ మిషన్ కింద 2021-22వ సంవత్సరానికి గాను రూ. 150కోట్లు కేటాయించనట్టు మంత్రి తెలిపారు. నిన్న రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయం తెలియజేశారు. పృథ్వీశాస్త్ర వ్యవహారాలు, ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుఇంధనం, అంతరిక్ష శాఖలను కూడా ఆయన సహాయమంత్రి హోదాలో పర్యవేక్షిస్తున్నారు.

  బ్లూ ఎకానమీపై విధాన ముసాయిదా పత్రాన్ని కేంద్ర పృథ్వీ శాస్త్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తయారు చేసిందని కేంద్రమంత్రి రాజ్యసభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో తెలిపారు. భారతీయ బ్లూ ఎకనామీ సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే నిపుణుల బృందాల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ విధాన ముసాయిదా పత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు.

బ్లూ ఎకానమీకి సంబంధించిన 7 ప్రాతిపదికలతో కూడిన ఈ కింది అంశాలను ఇప్పటికే గుర్తించారు:

  • బ్లూ ఎకానమీ, సాగర వనరుల వినియోగంపై జాతీయ స్థాయి లెక్కల వ్యవస్థ.
  • తీర ప్రాంతాల స్థల వినియోగం, పర్యాటక వ్యవహారాలపై ప్రణాళిక..
  • సముద్ర మత్స్య సంపద, అక్వాకల్చర్, ఫిష్ ప్రాసెసింగ్.
  • తయారీ ప్రక్రియ, ఆవిర్భవిస్తున్న పరిశ్రమలు, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సేవలు, నైపుణ్యాభివృద్ధి.
  • వసతి, రవాణా లాజిస్టిక్ అంశాలు, మౌలిక సదుపాయాలు, నౌకాయానం, ట్రాన్స్ షిప్మెంట్.
  • తీర ప్రాంతాల్లో డీప్ సీ మైనింగ్, తీర సమీప ప్రాంతాల్లో ఇంధన తయారీ
  • భద్రతా వ్యవహారాలు, వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు

 

<><><>



(Release ID: 1795301) Visitor Counter : 140