పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం క్రింద పునౌర ధామ్ చేరిక : శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2022 4:32PM by PIB Hyderabad
బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు, పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ స్కీమ్ రామాయణ ఆవృత్తంలో పునౌరా ధామ్‌ను చేర్చింది. పునౌర ధామ్ గమ్యం ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం క్రింద చేర్చిన జాబితాలో ఉంది.
బీహార్ రాష్ట్రం కోసం స్వదేశ్ దర్శన్ పథకం కింద ఆమోదించబడిన ప్రాజెక్ట్‌ల వివరాలు క్రింద ఉన్నాయి:
• జైన్ థీమ్ కింద వైశాలి- అర్రా- మసద్- పాట్నా- రాజ్‌గిర్- పావాపురి- చంపాపురిలో తీర్థంకర్ ఆవృత్తం అభివృద్ధికి 2016-17 సంవత్సరంలో రూ. 37.20 కోట్లు ఆమోదించారు. రూ. 26.11 కోట్లు ఇప్పటి వరకు విడుదల చేశారు
• సుల్తాన్‌గంజ్ - ధర్మశాల - దేవఘర్ వద్ద ఆధ్యాత్మిక సర్క్యూట్ సమగ్ర అభివృద్ధి, ఆధ్యాత్మిక థీమ్ కింద, 2016-17 సంవత్సరంలో రూ. 44.76 కోట్లు ఆమోదించారు. రూ. 42.52 కోట్లు ఇప్పటి వరకు విడుదల చేశారు.
• బౌద్ధ ఆవృత్తం అభివృద్ధి - బుద్ధగయలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి 2016-17 సంవత్సరంలో రూ. 98.73 కోట్లు ఆమోదించారు. రూ. 93.22 కోట్లు ఇప్పటి వరకు విడుదల చేశారు
• గాంధీ ఆవృత్తం అభివృద్ధి: భితిహర్వా - చంద్రహియా - తుర్కౌలియా రూరల్ థీమ్ కింద 2017-18 సంవత్సరంలో రూ.44.65 కోట్లు ఆమోదించారు. రూ. 35.72 కోట్లు ఇప్పటి వరకు విడుదల చేశారు
• 2017-18 సంవత్సరంలో ఆధ్యాత్మిక నేపథ్యం కింద మందర్ హిల్ ఆంగ్ ప్రదేశ్‌లో తీర్థయాత్ర ఆవృత్త అభివృద్ధికి రూ. 47.53 కోట్లు కేటాయించారు. రూ. 38.02 కోట్లు ఇప్పటి వరకు విడుదల చేశారు.
ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 1795297)
సందర్శకుల సూచీ సంఖ్య : : 161