కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌ లో గ్రాడ్యుయేట్ల తప్పనిసరి నమోదు

Posted On: 03 FEB 2022 3:46PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా జిల్లాల్లోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలలో గ్రాడ్యుయేట్లు తమ పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు.  ఉపాధి సంబంధిత సేవలను పొందడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలలో పేరు నమోదు చేసుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందం. 

ఉద్యోగ శోధన, సరిపోలిక, కెరీర్ కౌన్సెలింగ్, వృత్తిపరమైన మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి కోర్సులపై సమాచారం మొదలైన వివిధ రకాల కెరీర్ సంబంధిత సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్) ప్రాజెక్ట్‌ ను అమలు చేస్తోంది.  ఈ సేవలు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ (www.ncs.gov.in) లో ఆన్‌-లైన్‌ లో అందుబాటులో ఉన్నాయి.

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ ఈ రోజు రాజ్యసభలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.

 

*****


(Release ID: 1795289)