సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కళా రంగంలో కళాకారులు మరియు పండితుల ఆర్థిక మరియు సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘కళాకారులకు పెన్షన్ మరియు వైద్య సహాయం కోసం పథకాన్ని’ నిర్వహిస్తుంది.

Posted On: 03 FEB 2022 5:32PM by PIB Hyderabad

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 'కళాకారులకు పెన్షన్ మరియు వైద్య సహాయ పథకం' పేరుతో ఒక పథకాన్ని నిర్వహిస్తుంది. కళలు, సాహిత్యం మొదలైన వారితో పాటు ఆ ప్రత్యేక రంగాలలో గణనీయమైన కృషి చేసిన వృద్ధాప్య కళాకారులు మరియు పండితుల ఆర్థిక మరియు సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క లక్ష్యం. 60 ఏళ్లు పైబడిన మరియు వార్షిక ఆదాయం రూ.48000/- కంటే తక్కువ ఉన్న అర్హులైన లబ్ధిదారులకు (ప్రొఫెషనల్ మరియు నాన్-ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఇద్దరూ) ఈ మొత్తాన్ని అందజేస్తున్నారు. ఇంకా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింది మూడు భాగాలను  ఉన్న ‘కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి స్కాలర్‌షిప్ & ఫెలోషిప్ పథకం’ అనే పథకాన్ని కూడా నిర్వహిస్తుంది: -
 

  1. 'వివిధ సాంస్కృతిక రంగాలలోని యువ కళాకారులకు స్కాలర్‌షిప్‌ల పురస్కారం (ఎస్‌వైఏ)'- ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన 18 -25 సంవత్సరాల వయస్సు గల  లబ్ధిదారులకు నెలకు రూ. 5000/- స్కాలర్‌షిప్ అందించబడుతుంది. నాలుగు సమాన ఆరు నెలవారీ వాయిదాలలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ మొత్తాన్ని అందిస్తారు. అభ్యర్థులు కనీసం ఐదేళ్లపాటు ఏదైనా గురు లేదా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉండాలి. మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ కోసం నిపుణుల కమిటీ ముందు వ్యక్తిగత ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్‌లో వారి పనితీరు ఆధారంగా పండితులను ఎంపిక చేస్తారు;
  2. విభిన్న సాంస్కృతిక రంగాలలో విశిష్ట వ్యక్తులకు సీనియర్/జూనియర్ ఫెలోషిప్‌ల పురస్కారం - నలభై ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఎంపిక చేసిన సభ్యులకు నాలుగు సమాన 6 నెలవారీ వాయిదాలలో  రూ.20,000/ సాంస్కృతిక పరిశోధన కోసం 02 సంవత్సరాల పాటు సీనియర్ ఫెలోషిప్ అందించబడుతుంది. జూనియర్ ఫెలోషిప్ ఇరవై ఐదు నుండి నలభై సంవత్సరాల వయస్సు గల ఎంపిక చేసిన సభ్యులకు నాలుగు సమాన 6 నెలవారీ వాయిదాలలో 02 సంవత్సరాలకు నెలకు 10,000/- అందిస్తారు. ఒక బ్యాచ్ సంవత్సరంలో 400 వరకు సీనియర్ & జూనియర్ ఫెలోషిప్‌లు అందించబడతాయి. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సీనియర్/జూనియర్ ఫెలోషిప్ కోసం నిపుణుల కమిటీ ద్వారా సభ్యులను ఎంపిక చేస్తారు.
  3. సాంస్కృతిక పరిశోధన కోసం ఠాగూర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు - ఈ విభాంలో అభ్యర్థులు రెండు కేటగిరీల క్రింద ఎంపిక చేయబడతారు. అవి టాగోర్ నేషనల్ ఫెలోషిప్ మరియు ఠాగూర్ రీసెర్చ్ స్కాలర్‌షిప్. 4 విభిన్న సమూహాలలో పాల్గొనే వివిధ సంస్థల క్రింద అనుబంధం ద్వారా సాంస్కృతిక పరిశోధనపై పని చేయడానికి వీటిని అందజేయడం జరుగుతుంది. మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ ఎంపిక కమిటీ (ఎన్ఎస్‌సీ) ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.


పైన పేర్కొన్నవే కాకుండా, రిపర్టరీ గ్రాంట్, కల్చరల్ ఫంక్షన్ ప్రొడక్షన్ గ్రాంట్ మొదలైన ఇతర పథకాల ద్వారా కూడా ప్రొఫెషనల్ మరియు నాన్-ప్రొఫెషనల్ కళాకారులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఈ సమాచారాన్ని ఈరోజు రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తెలిపారు.


 

***

 



(Release ID: 1795270) Visitor Counter : 175