యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించి, 1971 భారత్-పాక్ యుద్ధంలో వైమానిక యోధుడు నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్‌కు నివాళులు అర్పించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా
Posted On:
02 FEB 2022 12:54PM by PIB Hyderabad
1971 భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్‌కు నివాళులు అర్పించేందుకు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా నేడు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. నిర్మల్‌జిత్ సింగ్ చారిత్రాత్మక యుద్ధంలో అత్యుత్తమ సాహసాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు.
స్మారక స్థలిలో ఏర్పాటు చేసిన పరమ యోధ స్థల్ పేరిట ఏర్పాటు చేసిన గ్యాలెంట్రీ గ్యాలరీలో పరమ వీర చక్ర పొందిన మొత్తం 21 మంది గ్రహీతల నడుమ ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ యుద్ధ హీరో ప్రతిమ వద్ద టిటి క్రీడా కారిణి తన నివాళులను అర్పించారు.
యుద్ధం గురించి, మన సైనికులు చేసిన అత్యుత్తమ త్యాగానికి సంబంధించి లిఖించిన రాతలు నన్ను కట్టిపడేశాయి. భారతీయురాలిగా నేడు నా మనసు కృతజ్ఞతతో, ఆత్మగౌరవంతో నిండిపోయిందని, ఒలింపియన్ అన్నారు.
ఘనమైన రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా ప్రస్తుత లేఔట్, అనురూపత జాతీయు యుద్ధ స్మారక అప్లికేషన్ సృష్టించడం కారణంగా డిజిటల్ అప్పీల్‌ను కలిగి ఉంది. విధులు నిర్వర్తిస్తూ మరణించిన వారికి దృశ్యమాధ్యమం ద్వారా నివాళులు అర్పించేందుకు వీలుగా స్క్రీన్ల ఏర్పాటును కూడా కలిగి ఉంది.
దృశ్య మాధ్యమం ద్వారా మరొక యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రాకు నివాళులు అర్పిస్తూ, స్మారక చిహ్న రూపకల్పన, నిర్మాణం అమరవీరులు అమరత్వం పొందేలా చేస్తుంది. అంతేకాదు, మొబైల్ యాప్ ఆధారిత వర్చువల్ టైర్ గైడ్, వర్చువల్ నివాళి కోసం డిజిటల్ ప్యానెల్‌ను ఆధునీకరించడం వంటి సౌకర్యాల కారణంగా ప్రతి పౌరుడు ఎక్కడి నుంచైనా సులభంగా నివాళులు అర్పించడం సులభం అవుతందని మానికా అన్నారు.
యోధులైన అమరవీరులకు తగిన నివాళులు అర్పించే, స్మారక స్థలాన్ని సందర్శించే సందర్శకులందరికీ ఆకర్షణ కేంద్రంగా నిలిచే ప్రత్యేక సావనీర్ ఔట్‌లెట్ స్మారికను కూడా క్రీడాకారిణి సందర్శించారు.
***
(Release ID: 1794923)
Visitor Counter : 132