మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంక్షేమ పథకాలు


మిషన్ పోషణ్ 2.0, మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య

పోషకాహార లోపాలు పరిష్కారం, మహిళలు , పిల్లల సాధికారత, అభివృద్ధి, రక్షణ లక్ష్యంగా పథకాల అమలు

Posted On: 02 FEB 2022 9:34AM by PIB Hyderabad

దేశ జనాభాలో 67.7% పైగా ఉన్న మహిళలు. పిల్లలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. సమగ్రంగా, సంపూర్ణంగా దేశాభివృద్ధి సాగేందుకు జనాభాలో 67.7% వరకు ఉన్న మహిళలు, పిల్లలు సాధికారత కలిగి పూర్తి రక్షణతో జీవించాల్సి ఉంటుంది. ఆర్థిక సామాజిక ప్రగతి సాధనకు మహిళలు, పిల్లలు తమ వంతు సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. దీనిని గుర్తించిన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంక్షేమ మహిళలు , పిల్లల సంరక్షణ కోసం అనేక  పథకాలు అమలు చేస్తోంది. ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ నవ సమాజ స్థాపనలో మహిళలు, పిల్లలు తమ వంతు పాత్ర నిర్వర్తించేలా చేసేందుకు అవసరమైన వాతావరణ పరిస్థితిని వీరికి అందుబాటులోకి తెచ్చి, వీరికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ఆరోగ్యవంతమైన, సాధికారత కలిగిన మహిళలు, పిల్లల సమాజ అభివృద్ధికి అవసరమని గుర్తించిన మంత్రిత్వ శాఖ వివక్షతకు తావులేని సమాజంలో సంపూర్ణ రక్షణ, ఆరోగ్యంతో వీరు అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంక్షేమ  పథకాలు అమలు జరుగుతున్నాయి. వివక్ష లేకుండా అందరితో పాటు మహిళలు, పిల్లలు జీవించాలన్న లక్ష్యంతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంక్షేమ  పథకాలు   రూపొంది అమలు జరుగుతున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, సంరక్షణ చట్టాలు, విధానాలు, కార్యక్రమాల సహకారంతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంక్షేమ  పథకాలు అమలు జరుగుతున్నాయి. 

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంక్షేమ  పథకాలు సక్రమంగా, లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల మూడు ముఖ్యమైన పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.మిషన్‌ మోడ్‌లో అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన  మిషన్‌ పోషణ్‌ 2.0, మిషన్‌ శక్తి  మరియు  మిషన్‌ వాత్సల్య  పథకాలను మంత్రివర్గం  ఇటీవల ఆమోదించింది. 

మిషన్ పోషణ్‌ 2.0   

పిల్లలుకౌమారదశలో ఉన్న బాలికలుగర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోప సమస్యను పరిష్కరించేదుకు మిషన్ పోషణ్‌ 2.0  సమీకృత పోషకాహార పథకంగా అమలు కానున్నది. ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతులను అభివృద్ధి చేసి  ప్రోత్సహించడానికి పోషకాహార రకాల్లో మార్పులు చేసి వాటిని సకాలంలో అవసరమైన వారికి అందించాలన్న లక్ష్యంతో  మిషన్ పోషణ్‌ 2.0  ను రూపొందించారు.  ప్రత్యామ్నాయ పోషక పధార్ధాలతో  ఆహార నాణ్యత మరియు సరఫరా చేసేందుకు పోషణ్2.0 ద్వారా కృషి జరుగుతుంది. 

దేశ మానవ వనరుల అభివృద్ధి, పోషకాహార లోపం సవాళ్లను పరిష్కరించడం,  స్థిరమైన ఆరోగ్యం  శ్రేయస్సు కోసం పోషకాహార అంశంపై అవగాహన కల్పించి, మంచి ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం మరియు కీలక వ్యూహాల ద్వారా పోషకాహార సంబంధిత లోపాలు పరిష్కరించడం లక్ష్యంగా మిషన్  పోషణ్‌ 2.0 అమలు జరుగుతుంది. ఈ పథకం కింద  పోషకాహార ప్రమాణాలు, నియమాలు, నాణ్యత టిహెచ్చార్ స్థాయిలను పరిశోధన శాలల్లో పరీక్షించడం జరుగుతుంది. ఫలితాల ఆధారంగా వీటిలో మార్పులు, చేర్పులు చేసి పోషకాహార నాణ్యతను మెరుగు పరచడం జరుగుతుంది. సాంప్రదాయ ఆహార విధానాలను ప్రోత్సహించి, పథకం అమలులో ప్రజల పాత్ర ఉండేలా చూస్తారు.  పోషణ్‌ 2.0 కింద 

అంగన్‌వాడీ సేవలుకౌమార బాలికల పథకం మరియు పోషణ్ అభియాన్.అంగన్‌వాడీ సేవలుకౌమార బాలికల పథకం మరియు పోషణ్ అభియాన్ కార్యక్రమాలు/పథకాలు అమలు జరుగుతాయి. 

 ప్రసూతి సమయంలో పోషకాహారం ,  శిశువులు మరియు చిన్న పిల్లల ఆహార నియమాలు ,  ఆయుష్ ద్వారా MAM/SAM  చికిత్స, సంక్షేమం అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పోషణ్ 2.0 అమలు జరుగుతుంది. కలయికపరిపాలనసామర్ధ్య మెరుగుదల అంశాల ఆధారంగా అమలు జరుగుతుంది.  ఇది కన్వర్జెన్స్గవర్నెన్స్ మరియు కెపాసిటీ-బిల్డింగ్ స్తంభాలపై ఉంటుంది. పోషణ్ అభియాన్ అమలుకు పోషణ్ 2.0 పునాది గా ఉంటుంది.  పోషకాహార సాహకారం, ఐసీటీ వినియోగం ,  మీడియా సహకారం, పరిశోధనప్రజలకు చేరువలోకి వెళ్ళడంప్రజల సహకారంతో కార్యక్రమాలను అమలు చేయడం లాంటి అంశాలకు పోషణ్ 2.0లో    ప్రాధాన్యత ఇస్తారు.

 దిద్దుబాటుపోషకాహార అవగాహన కమ్యూనికేషన్  మరియు ఆకుపచ్చ పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి అంశాలకు సంబందించిన వ్యూహాలను ఏకీకృతం చేసి  మిషన్ పోషణ్ 2.0 కార్యక్రమం అమలు జరుగుతుంది. మిషన్ పోషణ్ 2.0   లక్ష్యాల సాధనలో  కీలకమైన మంత్రిత్వ శాఖలు/శాఖలు / సంస్థలను భాగస్వాములను చేయడం జరుగుతుంది. 

పథకం అమలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ   "పోషన్ ట్రాకర్" పేరిట  2021  మార్చి 1న నేషనల్   -గవర్నెన్స్ డివిజన్ సహకారంతో  రూపొందించిందింది.  ఇది పోషకాహార సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కార్యక్రమాల అమలులో  పారదర్శకతను తీసుకువస్తుంది.    (i) పిల్లలలో కుంగుబాటువృధాతక్కువ బరువు అంశాలను తక్షణం గుర్తించేందుకు  (ii) అర్హులైన వారందరికీ పోషకాహారం అందేలా చూసే విధంగా "పోషన్ ట్రాకర్ను అభివృద్ధి చేశారు. 

 మిషన్ శక్తి

మహిళా సంక్షేమంసాధికారత లక్ష్య సాధన కోసం మిషన్ శక్తి కి రూపకల్పన జరిగింది. సంరక్షణరక్షణభద్రతపునరావాసం,సాధికారత ప్రధాన లక్ష్యాలుగా మిషన్ శక్తి రూపొందింది. మహిళలు తమ జీవితంలో వివిధ దశల ద్వారా పురోగమిస్తున్న సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి సంరక్షణభద్రతరక్షణపునరావాసం మరియు సాధికారత కూడిన ఏకీకృత పౌర-కేంద్రీకృత జీవితం సాగించేందుకు సహకారం అందించాలని  మిషన్ శక్తి భావిస్తోంది.  'సంబల్'  మరియు  ' సామర్త్యఅనే రెండు ఉప పథకాలతో మిషన్ శక్తి అమలు జరుగుతుంది. "సంబల్" ఉప పథకం మహిళల భద్రత మరియు భద్రత కోసం  "సామర్త్య" ఉప పథకం మహిళల సాధికారత కోసం రూపొందాయి.  సంబల్ ఉప పథకంలో వన్ స్టాప్ సెంటర్లు ఉమెన్ హెల్ప్‌లైన్‌లు (181) మరియు  బేటీ బచావో బేటీ పఢావో   ఉన్నాయి. కార్యక్రమానికి  నారీ అదాలత్‌ కార్యక్రమాన్ని కొత్తగా చేర్చడం జరిగింది.   సమాజంలో మరియు కుటుంబంలో  ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం మరియు సమానత్వాన్ని  ప్రోత్సహించడానికి మరియు సులభతరం చేయడానికి  నారీ అదాలత్‌ కార్యక్రమాన్ని రూపొందించారు. ఉజ్వలస్వధర్‌గ్రే   వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ లాంటి  ప్రస్తుత పథకాలతో  సామర్త్య” ఉప పథకం మహిళల సాధికారత కోసం  రూపొందింది. ఇంతవరకు ఐసిడిఎస్ పరిధిలో  పని చేసిన  ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ను  'సామర్త్య'లో చేర్చడం జరిగింది. 

మిషన్ వాత్సల్య  

 అత్యున్నత జాతీయ ఆస్తులలో పిల్లలు ఒకరని విధాన రూపకర్తలు గుర్తించారు. భారతదేశంలో 18 సంవత్సరాల వయస్సు వరకు 472 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. వీరు  దేశ జనాభాలో 39 శాతం వరకు  ఉన్నారు. భారతదేశంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బాల్యాన్ని అందించి, పిల్లల అభివృద్ధికి సున్నితమైనసహాయక మరియు సమకాలీకరించబడిన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సక్రమంగా అమలు చేసి ఆశించిన ఫలితాలు సాధించేందుకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సహకారం అందించడం ప్రధాన  లక్ష్యాలుగా  మిషన్ వాత్సల్యకు రూపకల్పన జరిగింది. 

మిషన్ వాత్సల్య కింద  చట్టబద్ధమైన సంస్థలు సభ్యత్వం కలిగి ఉంటాయి. సేవా కార్యక్రమాలుసంస్థాగత సంరక్షణ/సేవలు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కమ్యూనిటీ ఆధారిత సంరక్షణ,  అత్యవసర  సేవలు, శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల కార్యక్రమాలను దీనిలో అమలు చేస్తారు. 

 15   ఆర్థిక సంఘం సంఘం సూచనల మేరకు   మొత్తం మిషన్లు   2021-22 నుంచి 2025-26 వరకు అమలు జరుగుతాయి. 

పోషణాభియాన్‌తో సహా  మిషన్ పోషణ్ 2.0  1,81,703 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు జరుగుతుంది.  ఇందులో కేంద్రం తన   వాటాగా  1,02,031 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు  79,672 కోట్ల రూపాయలను అందిస్తాయి. 

పథకానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు  10,108.76 కోట్ల రూపాయల (10.99%) వరకు పెరిగాయి. మిషన్ పోషణ్ 2.0 కింద మొత్తం ఖర్చు కేంద్ర మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య వ్యయ భాగస్వామ్య నిష్పత్తి ఆధారంగా లెక్కించబడుతుంది. ఈ నిష్పత్తి  ప్రభుత్వం ఆమోదించిన  రాష్ట్రాలు మరియు  శాసనసభ కలిగిన కేంద్రపాలిత మధ్య 60:40, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు  హిమాలయ రాష్ట్రాల మధ్య  90:10,  కేంద్రపాలిత జమ్మూ కాశ్మీర్  మరియు శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు 100% గా ఉంటుంది. 

మిషన్ శక్తి  15761 కోట్ల రూపాయల  కేంద్ర వాటా మరియు  5228 కోట్ల రూపాయల  రాష్ట్ర వాటాతో మొత్తం 20989 కోట్ల రూపాయల వ్యయంతో అమలు జరుగుతుంది.    నిర్భయ ఫండ్/మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ  బడ్జెట్ నుండి 100% కేంద్ర నిధులతో కేంద్ర ప్రాయోజిత పథకంగా 'సంబల్ ఉప పథకం అమలు జరుగుతుంది.  పథకం అమలుకు అవసరమైన నిధులు  కలెక్టర్‌కు లేదా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన  సంబంధిత డైరెక్టరేట్/కమిషనరేట్‌కు నేరుగా  విడుదల అవుతాయి. ఈశాన్య , ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు/ శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు  మినహా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు / శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల  మధ్య 60:40 నిధుల నిష్పత్తితో 'సమర్త్య ఉప-పథకం  కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేయబడుతుంది. మిగిలిన ప్రాంతాలలో  నిధుల నిష్పత్తి 90:10 గాఉంటుంది.  శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు అందిస్తుంది. మిషన్ శక్తి కింద మొత్తం కేంద్ర వాటా నిధులు 24% వరకు పెరిగాయి.  నిధుల కేటాయింపు  12742 కోతల రూపాయల నుంచి 15761 కోట్ల రూపాయలకు పెరిగింది.

మిషన్ వాత్సల్య  10916 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు జరుగుతుంది. దీనిలో కేంద్ర వాటా   6928 కోట్ల రూపాయలు మరియు రాష్ట్ర వాటా 3988 కోట్ల రూపాయలు ఉంటాయి.  గత సంవత్సరాలుగా చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకం కింద మొత్తం కేటాయింపులు  3852 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.  ఇది పెరుగుదలను చూపుతుంది. చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకం కేటాయింపులతో   పోలిస్తే మిషన్ వాత్సల్య కింద నిధుల కేటాయింపు  దాదాపు 63.68% పెరిగింది. 

***


(Release ID: 1794913) Visitor Counter : 2043