రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎన్‌జి, ఎల్‌పిజి కిట్ రెట్రో ఫిట్‌మెంట్ (ఆధునిక అంశాలను జోడించడం), 3.5 టన్నుల కన్నా తక్కువ ఉన్న భారత్ స్టేజ్ (బిఎస్-VI) వాహనాల డీజిల్ ఇంజిన్ల స్థానంలో సిఎన్‌జి/ ఎల్‌పిజి ఇంజిన్లను ఏర్పాటు చేయడం ద్వారా రూపాంతరీకరించడాన్ని అనుమతిస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ
Posted On:
29 JAN 2022 4:22PM by PIB Hyderabad
సిఎన్‌జి, ఎల్‌పిజి కిట్ రెట్రో ఫిట్‌మెంట్ (ఆధునిక అంశాలను జోడించడం), 3.5 టన్నుల కన్నా తక్కువ ఉన్న భారత్ స్టేజ్ (బిఎస్-VI) వాహనాల డీజిల్ ఇంజిన్ల స్థానంలో సిఎన్‌జి/ ఎల్‌పిజి ఇంజిన్లను ఏర్పాటు చేయడం ద్వారా రూపాంతరీకరించడాన్ని అనుమతిస్తూ రోడ్డు రవాణా& హైవేల మంత్రిత్వ శాఖ 27 జనవరి 2022న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతానికి సిఎన్‌జి, ఎల్‌పిజి కిట్ రెట్రోఫిట్‌మెంట్ కేవలం బిఎస్- IV ఉద్గార ప్రమాణాల కింద మోటార్ వాహనాలకు మాత్రమే అనుమతించారు.
ఈ నోటిఫికేషన్ రెట్రో ఫిట్‌మెంట్‌కు ప్రతి ఆమోద అవసరాలను నోటిఫికేషన్ నిర్దారిస్తుంది. సిఎన్‌జి పర్యావరణ అనుకూల ఇంధనం, పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోకార్బన్, పరమాణు పదార్ధాలు, పొగ వంటి పదార్ధాలను తక్కువ వెలువరుస్తుంది.
భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం దీనిని సూత్రీకరించారు. సంబంధింత భాగస్వాముల నుంచి ముప్పై రోజుల లోపు వ్యాఖ్యలను, సూచనలను ఆహ్వానించడం జరిగింది.
Click here to see Retrofitmennt in BS VI
(Release ID: 1793575)
Visitor Counter : 147