ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి

Posted On: 27 JAN 2022 3:56PM by PIB Hyderabad

ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఈ రోజు పూర్త‌యింది. వ్యూహాత్మ‌క భాగ‌స్వామి (మెస్స‌ర్స్‌ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్స‌ర్స్‌ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్  పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) నుండి రూ. 2,700 కోట్ల నిధుల‌ను ప్రభుత్వం స్వీకరించడం, రూ.15,300 కోట్ల రుణాన్ని నిలుపుకోవడంతో ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీ ఈ రోజు పూర్తయిన‌ట్ట‌యింది. ఎయిరిండియా, ఏఐఎక్సెల్ సంస్థ‌ల‌కు (100% ఎయిర్ ఇండియా షేర్లు మరియు దాని అనుబంధ సంస్థ  ఏఐఎక్స్ఎల్‌ మరియు ఏఐఎస్ఏటీఎస్  యొక్క 50% షేర్లు) యొక్క వాటా బదిలీ చేయడం జరిగింది.
వివరణ: చిత్రం
ఎయిర్ ఇండియా యొక్క వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం మెస్స‌ర్స్‌ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్అత్యధిక ధర బిడ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, 11 అక్టోబర్ 2021న విజేత బిడ్డర్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయబడింది. షేర్ కొనుగోలు ఒప్పందం (ఎస్‌పీఏ) 25 అక్టోబర్, 2021న సంతకం చేయడ‌మైంది. ఆ తర్వాత, స్ట్రాటజిక్ పార్టనర్ (మెస్స‌ర్స్‌ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్), ఎయిర్ ఇండియా మరియు ప్రభుత్వం ఎస్‌పీఏలో నిర్వచించబడిన షరతులను సంతృప్తి పరచడానికి పని చేశాయి, ఇందులో యాంటీ ట్రస్ట్ బాడీలు, రెగ్యులేటర్లు, రుణదాతలు, థర్డ్ పార్టీలు మొదలైన వాటికి కూడా ఆమోదాలు ల‌భించాయి. దీంతో ఇరుప‌క్షాల వారిని ఇది సంతృప్తి ప‌రిచేలా ముందుకు సాగింది.
                                                                                 

****



(Release ID: 1793096) Visitor Counter : 275