ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆధునీకరించిన సిజిహెచ్ఎస్ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ “MyCGHS”ని ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ఉపయోగించేవారికి అనువుగా ఉండే వెబ్‌సైట్ దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య సేవలను మరింత సులువుగా అందుబాటులోకి తెస్తుంది
దేశంలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశలో ఇది ఒక పెద్ద ముందడుగు : డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
24 JAN 2022 3:08PM by PIB Hyderabad
ఆధునీకరించిన సిజిహెచ్ఎస్ ( కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం) వెబ్‌సైట్ మరియు కొత్తగా అభివ్రుది చేసిన మొబైల్ యాప్ “MyCGHS”ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు డిజిటల్ విధానంలో ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు.
దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతున్న సమయంలో వెబ్‌సైట్ తో అనుసాదించిన మొబైల్ యాప్ ను విడుదల చేశామని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. డిజిటల్ వినియోగం పెరుగుతున్న సమయంలో వెబ్‌సైట్ తో అనుసాదించిన మొబైల్ యాప్ అందుబాటులోకి రావడం ముఖ్యమైన సంఘటన అని మంత్రి అన్నారు. వెబ్‌సైట్ లో కొత్తగా పొందుపరిచిన అంశాల వల్ల దాదాపు 40 లక్షల మంది ( పని చేస్తున్న, పదవీ విరామం చేసిన) లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. తమ ఇళ్ల నుంచి ఉద్యోగులు తాజా వివరాలు తెలుసుకోవచ్చునని డాక్టర్ మాండవీయ అన్నారు. ఇల్లు దాటి బయటకు రాకుండా తమకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవల వివరాలను ఈ సౌకర్యాన్ని ఉపయోగించి ఉద్యోగులు పొందవచ్చునని డాక్టర్ మాండవీయ వివరించారు. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దేశంలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అని మంత్రి అన్నారు.
ఆధునీకరించిన వెబ్‌సైట్ లో మరికొన్ని సేవలను చేర్చామని డాక్టర్ మాండవీయ తెలిపారు. కొత్తగా టెలి కన్సల్టేషన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన టెలి కన్సల్టేషన్ సౌకర్యంతో సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు నిపుణుల సలహాలను నేరుగా పొందుతారని మెరుగుపరిచిన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించేందుకు సిజిహెచ్ఎస్ కు అవకాశం కలుగుతుందని డాక్టర్ మాండవీయ తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి సురక్షితంగా, సులువుగా సిజిహెచ్ఎస్ సేవలను సులువుగా పొందేందుకు వీలుగా సులభంగా ఉపయోగించగల సిజిహెచ్ఎస్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ కు రూపకల్పన చేయడం జరిగింది.
ఆధునీకరించిన సిజిహెచ్ఎస్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చే సౌకర్యాలు :
1. భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా సిజిహెచ్ఎస్ వెబ్‌సైట్ అభివృద్ధి చేయబడింది. ఈ ప్రమాణాలు మరియు మార్గదర్శకాలు వెబ్‌సైట్‌ను 3U గా ( ఉపయోగించదగిన, వినియోగదారు-కేంద్రీకృతమైన మరియు విశ్వవ్యాప్తంగా మరియు విశ్వవ్యాప్తంగా అందుబాటు) చేస్తాయి.
2. భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా సిజిహెచ్ఎస్ వెబ్‌సైట్ రెండు భాషల్లో ( ఇంగ్లీష్, హిందీ) రూపొందించబడింది. ఇతర భాషల్లో కూడా దీనిని అభివృద్ధి చేసేందుకు వీలు కల్పించారు.
3. వెబ్‌సైట్ లో పూర్తి వివరాలను సమగ్రంగా పొందుపరచడం జరిగింది. తమకు అవసరమైన సమాచారాన్ని సిబ్బంది సులువుగా పొందే విధంగా దీనిని రూపొందించారు.
విస్తృతమైన శోధన సౌకర్యం అందించబడింది.
4. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం ఆడియో ప్లే మరియు అక్షరాల పరిమాణాన్ని పెంచడం వంటి సౌకర్యాలను కల్పించారు.
5. సిజిహెచ్ఎస్ వెబ్‌సైట్ ద్వారా ఈసంజీవని టెలికన్సల్టేషన్ సదుపాయానికి నేరుగా లింక్ కల్పించారు.
6. సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం అభివృద్ధి చేసిన వెబ్‌సైట్ ద్వారా లబ్ధిదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ లో గ్రీవెన్స్ పోర్టల్‌కు పంపేందుకు లింక్‌ను అందుబాటులోకి తేవడం జరిగింది. సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించడం కోసం ఎస్ఎంఎస్ మరియు ఇమెయిల్ అలర్ట్ రెండింటినీ నేరుగా సంబంధిత అధికారికి పంపే విధంగా వెబ్‌సైట్ ను అభివృద్ధి చేయడం జరిగింది.
7. మెడికల్ క్లెయిమ్‌ల స్థితి , ఫిర్యాదులు, సిజిహెచ్ఎస్ కార్డ్ స్థితి, సిజిహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడ్, ఔషధాల చరిత్ర, ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ వ్యవస్థ మరియు అనేక ఇతర సౌకర్యాల వివరాలను ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారులు తెలుసుకునే విధంగా వెబ్‌సైట్ లింక్ కూడా ఉంది.
సిజిహెచ్ఎస్ సాధించిన విజయం పట్ల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో డిజిటల్ వ్యవస్థ ప్రాధాన్యత ను గుర్తించడం వల్ల ఇది సాధ్యమైందని ఆమె అన్నారు. డిజిటల్ హెల్త్ మిషన్‌కు అనుగుణంగా ఈ కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. లబ్ధిదారులు వారి సౌలభ్యం మేరకు ప్రయోజనాలు పొందవచ్చునని డాక్టర్ పవార్ అన్నారు. భవిష్యత్తులో 40 లక్షల మంది లబ్ధిదారుల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఈ పథకం కింద నమోదు చేసుకున్న ఇతర లబ్ధిదారులకు మరియు వారిపై ఆధారపడిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ( సిజిహెచ్ఎస్ ) ఆరోగ్య సేవలను అందిస్తోంది. శాసనసభ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక మరియు పత్రికా రంగాలకు చెందిన అర్హతగల లబ్ధిదారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను సిజిహెచ్ఎస్ తీరుస్తుంది. అల్లోపతి, స్వదేశీ వైద్య విధానాల ద్వారా ఆరోగ్య సంరక్షణ ను అందజేస్తున్న సిజిహెచ్ఎస్ దేశవ్యాప్తంగా సభ్యులను కలిగి ఉంది. భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ వినియోగంలో భాగంగా సిజిహెచ్ఎస్ వివిధ ఆన్‌లైన్ కార్యక్రమాల ద్వారా సేవలను అందించే అంశానికి ప్రాధాన్యత ఇస్తోంది.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, సిజిహెచ్ఎస్ డీజీ శ్రీ అలోక్ సక్సేనా, సిజిహెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ నిఖిలేష్ చంద్ర, నిక్ డీజీ డాక్టర్ నీతా వర్మ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1792254)
Visitor Counter : 274