సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్మూలో భారతదేశపు మొట్టమొదటి “జిల్లా సుపరిపాలన సూచిక”ను ఈ రోజు దృశ్యమాధ్యమం ద్వారా విడుదల చేసిన - కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
జిల్లా స్థాయిలో విస్తృతమైన భాగస్వాముల సంప్రదింపుల అనంతరం రూపొందించిన అత్యుత్తమ పాలనలో తదుపరి తరం పరిపాలనా సంస్కరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న - డి.జి.జి.ఐ.
జిల్లా స్థాయిలో వివిధ పాలన జోక్యాల ప్రభావాన్ని గుర్తించడంలో సహాయపడనున్న - జిల్లా సుపరిపాలన సూచి
లక్ష్య జోక్యాలతో జిల్లా స్థాయి పాలనను మెరుగుపరచడం కోసం భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది
Posted On:
22 JAN 2022 11:52AM by PIB Hyderabad
జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వ సహకారంతో డి.ఏ.ఆర్.పి.జి. రూపొందించిన భారతదేశపు మొదటి “జిల్లా సుపరిపాలన సూచీ" ని, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మరియు జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ల సమక్షంలో, కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా దృశ్య మాధ్యమం ద్వారా జమ్మూ లోని ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఈ రోజు విడుదల చేశారు.
జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ కుమార్ మెహతా నుండి లభించిన సహకారంతో, జమ్మూ-కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో పాలనా నమూనా యొక్క వైవిధ్యాన్ని కొలిచే సూచి, భావన మరియు సూత్రీకరణలను ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జిల్లా స్థాయిలో అత్యుత్తమ పరిపాలన యొక్క సారూప్యాన్ని తెలుసుకోడానికి ఇది ఆదర్శవంతమైన ఒక ఉత్తమ మార్గంగా నిలుస్తుంది.
కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా 2021 డిసెంబర్, 25వ తేదీన జాతీయ సుపరిపాలన సూచీని విడుదల చేశారు. 2019 నుండి 2021 మధ్య కాలంలో జమ్మూ-కశ్మీర్ సుపరిపాలన సూచీలో 3.7 శాతం పెరుగుదల నమోదైనట్లు సుపరిపాలన సూచీ-2021 సూచించింది. వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రజా మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, న్యాయవ్యవస్థ, ప్రజల భద్రత వంటి రంగాలు అద్భుతమైన పురోగతి సాధించాయి. వ్యాపార సౌలభ్యం; పన్నుల వసూళ్ళు; నైపుణ్య శిక్షణ; గ్రామీణ నివాస ప్రాంతాలకు అనుసంధానం; మహిళల ఆర్థిక సాధికారత; ఆరోగ్య బీమా అమలు; అందరికీ గృహనిర్మాణం వంటి అంశాల్లో గణనీయమైన అభివృద్ధి నమోదయ్యింది. నేరారోపణల సంఖ్య; పరిష్కారమైన కోర్టు కేసుల సంఖ్య తో పాటు, మహిళా పోలీసు సిబ్బంది నిష్పత్తి లో కూడా పెరుగుదల నమోదయ్యింది. పౌరులు కేంద్రంగా పరిపాలన రంగం బలమైన పనితీరును కనబరిచింది.
జాతీయ స్థాయిలో బలమైన పాలనా పనితీరు ఉన్న ఈ నేపథ్యంలో, జిల్లా స్థాయిలో అత్యుత్తమ పాలన కోసం జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన చొరవ గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. జిల్లా స్థాయిలో వివిధ పాలనా జోక్యాల ప్రభావాన్ని గుర్తించడంతో పాటు, లక్ష్య జోక్యాలతో జిల్లా స్థాయి పాలనను మెరుగుపరచడానికి భవిష్యత్ ప్రణాళికను అందించడానికి, జిల్లా సుపరిపాలన సూచీ సహాయపడింది. జమ్మూ-కశ్మీర్ ప్రధాన కార్యదర్శి; జిల్లా కలెక్టర్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తో సమావేశాలతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, ఆయా రంగాలకు చెందిన నిపుణులతో సంప్రదింపులు సహా భారత ప్రభుత్వ స్థాయిలో 10 దఫాలుగా సంబంధిత భాగస్వాములతో కూడా చర్చలు జరిగాయి. ఇవన్నీ ఐ.ఎం.పి.ఏ.ఆర్.డి. డైరెక్టర్ జనరల్ సమన్వయంతో జరిగాయి.
డి.జి.జి.ఐ. అందించిన ఫలితాలలో కొన్ని ముఖ్యాంశాలు:
ఏ). వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో – కిసాన్ క్రెడిట్ కార్డు పథకం; భూసార కార్డు పధకం; పశువులకు టీకాలు వేసే కార్యక్రమం సర్వత్రా అమలు అవుతున్నాయి. జమ్మూ-కశ్మీర్ లోని చాలా జిల్లాలు ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉద్యానవన ఉత్పత్తులు, పాలు, మాంసం ఉత్పత్తి, పౌల్ట్రీ ఉత్పత్తి, వ్యవసాయ రుణాలలో వృద్ధిని సాధించాయి.
బి). వాణిజ్యం మరియు పరిశ్రమల రంగం - జి.ఎస్.టి. నమోదు విషయంలో, ఆన్-లైన్ లో నమోదు చేసుకున్న ఎం.ఎస్.ఎం.ఈ. యూనిట్లు, హస్తకళలకు రుణ సౌకర్యంతో పాటు, స్వయం ఉపాధి కోసం రుణాలు అందించడంలో పెరుగుదల కనిపించింది. 2019-2021 కాలంలో హస్తకళలకు రుణ సౌకర్యం కల్పించడం లో 109 శాతం పెరుగుదల నమోదయ్యింది.
సి). మానవ వనరుల అభివృద్ధి రంగం - తాగునీరు, ప్రత్యేక మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం ఉన్న పాఠశాలల శాతం పెరిగింది. అదేవిధంగా, కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పాఠశాలల శాతంతో పాటు మధ్యాహ్న భోజనం అందుకుంటున్న పిల్లల సంఖ్య కూడా పెరిగింది. 10 జిల్లాల్లో నమోదైన విద్యార్థులకు 100 శాతం నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది.
డి). ప్రజారోగ్య రంగం - పూర్తి రోగనిరోధకత ఒక ముఖ్యమైన విజయగాథను సూచిస్తుంది; ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు గా మార్చబడిన పి.హెచ్.సి. / ఉప-కేంద్రాల శాతం తో పాటు, సొంత భవనాలు ఉన్న అంగన్ వాడీ ల నిష్పత్తి మెరుగుపడింది.
ఇ). ప్రజా మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు - అందరికీ గృహ సదుపాయం పథకం కింద - 12 జిల్లాల్లో మంజూరైన గృహాల్లో, 50 శాతానికి పైగా గృహాల నిర్మాణం పూర్తయింది; గందర్బాల్, శ్రీనగర్ ప్రాంతాలు 100 శాతం సురక్షిత త్రాగు నీటిని పొందుతున్నాయి; 18 జిల్లాలు 100 శాతం పారిశుద్ధ్య సౌకర్యాలను సాధించాయి; గృహాల్లో మెరుగైన విద్యుద్దీకరణ; అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రహదారుల నిర్మాణం జరిగింది.
ఎఫ్). సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి రంగం - రేషన్ కార్డులలో 80 శాతం ఆధార్ తో అనుసంధానం కావడం ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది.
జి). ఆర్థిక చేరిక రంగం – జన్-ధన్-యోజన కింద ఆర్థిక చేరిక సార్వత్రిక కవరేజీని సాధించింది, స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక మద్దతు కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.
హెచ్). న్యాయ మరియు ప్రజా భద్రతా రంగం - కోర్టు కేసుల పరిష్కారం గణనీయంగా పెరిగింది.
ఐ). పౌరులు కేంద్రంగా పరిపాలన రంగం - ఇ-ఆఫీస్ గా మార్చబడిన ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతమయ్యాయి. ఫిర్యాదుల పరిష్కారంలో దాదాపు 100 శాతం పురోగతితో పాటు, ఆన్-లైన్ లో అందించే ప్రభుత్వ సేవలలో గణనీయమైన పెరుగుదల.
6
“అమృత్ స్వాతంత్య్ర కాలంలో, సర్వతోముఖంగా, అందరినీ కలుపుకొని పోయే విధంగా అభివృద్ధిని సాధించడానికి, పారదర్శక వ్యవస్థ, సమర్థవంతమైన ప్రక్రియ, సున్నితమైన పాలనను రూపొందించడానికి మనం వేగంగా ముందుకు సాగుతున్నాము. ప్రజానుకూల, క్రియాశీల సుపరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 'పౌరులే-ప్రధానం' విధానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన, మన సేవల పంపిణీ యంత్రాంగం విస్తరణ కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, వాటిని మరింత ప్రభావవంతంగా చేయడానికి మా ప్రయత్నాలలో మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము." అని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
గత 2 సంవత్సరాలుగా, జిల్లా పోర్టల్స్ తో ఈ-ఆఫీస్, జె&కె.ఏ.ఎస్., మరియు జె.కె-ఐ.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. కోసం సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాలను అనుసంధానం చేసే ప్రక్రియను అమలు చేయడంతో పాటు, సుపరిపాలన పద్దతులపై మూడు ప్రాంతీయ సదస్సులను, డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వంలో డి.ఏ.ఆర్.పి.జి. జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంతో కలిసి విజయవంతంగా నిర్వహించింది. అమృత్ కాల్ సమయంలో తదుపరి తరం పరిపాలనా సంస్కరణల కోసం ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో, జమ్మూ-కశ్మీర్ జిల్లా సుపరిపాలన సూచి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
డి.ఏ.ఆర్.పి.జి. ఈ పత్రాన్ని రూపొందించడానికి కృషి చేసి, "గరిష్ట పాలన - కనిష్ట ప్రభుత్వం" అనే జాతీయ పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న అధికారులందరికీ, ఈ సందర్భంగా ధన్యవాదములు.
<><><>
(Release ID: 1791998)
Visitor Counter : 207