వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్న ప్రభుత్వం


'వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్' కింద ఆర్థిక సహాయం

డ్రోన్ల కొనుగోలు కోసం వ్యవసాయ సంస్థలకు 10 లక్షల రూపాయల వరకు గ్రాంటుగా సమకూర్చనున్న వ్యవసాయ మంత్రిత్వ శాఖ

డ్రోన్లను అద్దెకు ఇచ్చే రైతులు, ఎఫ్‌పిఓలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తల సహకార సంఘాలకు డ్రోన్ల కొనుగోలుకు అందనున్న ఆర్థిక సహాయం

సబ్సిడీ కొనుగోలు వల్ల సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్న డ్రోన్లు దేశీయ డ్రోన్ ఉత్పత్తికి ప్రోత్సాహం

Posted On: 22 JAN 2022 4:51PM by PIB Hyderabad

దేశంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.  ప్రభుత్వ నిర్ణయం వల్ల డ్రోన్ సాంకేతిక  పరిజ్ఞానం    వ్యవసాయ రంగానికి అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ కింద జారీ చేసిన  మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ సవరించింది. సవరించిన మార్గదర్శకాల వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున  డ్రోన్ సాంకేతిక  పరిజ్ఞానాన్ని ప్రదర్శనలను నిర్వహించేందుకు వ్యవసాయ యంత్రాల శిక్షణ & పరీక్షా సంస్థలుఐసిఏఆర్  సంస్థలుకృషి విజ్ఞాన కేంద్రాలు మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కొనుగోలు చేసే డ్రోన్ ఖరీదులో 100% లేదా పది లక్షల రూపాయల వరకు ( ఏది తక్కువ అయితే అది) గ్రాంటుగా లభిస్తుంది. 

రైతు ఉత్పత్తిదారుల సంస్థలు  రైతుల పొలాల్లో  ప్రదర్శనల కోసం కొనుగోలు చేసే  వ్యవసాయ డ్రోన్ ఖర్చులో 75% వరకు గ్రాంట్ పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. 

అయితే, డ్రోన్లను కొనుగోలు చేయకుండా డ్రోన్లను అద్దెకు తీసుకుని ప్రదర్శనలు నిర్వహించే సంస్థలకు హెక్టర్ కి 6000 రూపాయలను  వ్యయ ఖర్చుగా చెల్లించడం జరుగుతుంది. ఈ సంస్థలు హైటెక్ హబ్‌లుడ్రోన్ తయారీదారులు మరియు స్టార్ట్-అప్‌ల నుంచి  ప్రదర్శనల కోసం డ్రోన్‌లను అద్దెకు తీసుకోవలసి ఉంటుంది. స్వయంగా డ్రోన్లను కొనుగోలు చేసి ప్రదర్శనలు నిర్వహించే సంస్థలకు వ్యయ ఖర్చుగా హెక్టర్ కి 3000 రూపాయలు చెల్లిస్తారు. 2023 మార్చి 31 వరకు ఆర్థిక సహకారం, గ్రాంటుల చెల్లింపు అమలులో ఉంటాయి.

అద్దె కు అందించేందుకు డ్రోన్లను కొనుగోలు చేసే    రైతుల సహకార సంఘాలు ఎఫ్ పి ఓ, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు డ్రోన్ ఖరీదు, దాని అనుబంధ పరికరాల ఖరీదులో 40% లేదా నాలుగు లక్షల రూపాయలను ( ఏది తక్కువ అయితే అది)  ఆర్థిక సహకారం గా అందించడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్, ఆర్కే వి వై లేదా ఇతర పథకాల కింద నూతనంగా హై- టెక్ హబ్బులను నెలకొల్పే  రైతుల సహకార సంఘాలు , ఎఫ్ పి ఓగ్రామీణ పారిశ్రామికవేత్తలు ఇతర వ్యవసాయ పనిముట్లతో పాటు  డ్రోన్లను కూడా ఒక యంత్రంగా చూపించి కొనుగోలు చేయవచ్చు.  

కస్టమ్ హైరింగ్ కేంద్రాలను స్థాపించే వ్యవసాయ గ్రాడ్యుయేట్‌లు డ్రోన్ మరియు దాని అటాచ్‌మెంట్‌ల ప్రాథమిక ధరలో 50% లేదా డ్రోన్ కొనుగోళ్లకు రూ.5 లక్షల వరకు గ్రాంట్ సహాయంగా  పొందేందుకు అర్హులుగా ఉంటారు.   గ్రామీణ పారిశ్రామికవేత్తలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండి డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు పొందిన సంస్థ లేదా గుర్తింపు పొందిన  రిమోట్ పైలట్ శిక్షణా సంస్థ నుంచి రిమోట్ పైలట్ లైసెన్స్ కలిగి ఉండవలసి ఉంటుంది. 

వ్యవసాయ కార్యక్రమాల కోసం సబ్సిడీపై సిహెచ్ సి లు/హైటెక్ హబ్‌  డ్రోన్‌లను కొనుగోలు చేయడం వల్ల డ్రోన్ల సాంకేతిక  పరిజ్ఞానం సులువుగా అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల సాంకేతిక  పరిజ్ఞానం వినియోగం పెరుగుతుంది.   ఇది భారతదేశంలోని సామాన్యులకు డ్రోన్‌లను మరింత అందుబాటులోకి తెచ్చి  దేశీయ డ్రోన్ ఉత్పత్తిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.

షరతులతో కూడిన మినహాయింపు మార్గం ద్వారా డ్రోన్ కార్యకలాపాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు మంజూరు చేస్తున్నాయి. భారతదేశంలో డ్రోన్‌ల వినియోగం మరియు కార్యకలాపాలను  నియంత్రించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 25 ఆగస్టు 2021 నాటి GSR నం. 589(E) ప్రకారం డ్రోన్ రూల్స్ 2021’ని ప్రచురించింది.  వ్యవసాయంమొక్కల పెంపకం  పంటలు వేయని ప్రాంతాలు మొదలైన వాటిలో పంటల రక్షణ కోసం పురుగు మందులు, నేల మరియు పంట పోషకాల  పిచికారీ చేసేందుకు   డ్రోన్లను   ఉపయోగించడం కోసం వ్యవసాయంరైతు సంక్షేమ శాఖ  ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను  తీసుకువచ్చింది. ప్రదర్శన  సంస్థలు, డ్రోన్ల ద్వారా  ద్వారా వ్యవసాయ సేవలు అందించే అందరూ ఈ నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.  

మార్గదర్శకాల కోసం 

Click Here for SOP for Use of Drone Application

 

***



(Release ID: 1791818) Visitor Counter : 422