పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పులుల సంరక్షణపై నాలుగో ఆసియా మంత్రుల సదస్సులో భారతదేశ ప్రకటన చదివిన శ్రీ భూపేందర్ యాదవ్


మానవాళికి పర్యావరణ వ్యవస్థ సేవలను పుష్కలంగా కొనసాగించడానికి పులుల పరిరక్షణ కీలకం: శ్రీ భూపేందర్ యాదవ్

సహజ వనరులపై ఆధారపడే సమాజం పులుల సంరక్షణలో ఒక ముఖ్యమైన అంశం; భారతదేశ 'టైగర్ ఎజెండా'లో 'ప్రజల ఎజెండా' కీలకం

Posted On: 21 JAN 2022 3:15PM by PIB Hyderabad

ప్రకృతి వనరులఆధారిత సమాజం పులుల సంరక్షణలో ఒక ముఖ్యమైన అంశం అని, 'ప్రజల ఎజెండా' లో భారతదేశ 'పులి సంరక్షణ ఎజెండా'  ప్రముఖంగా ఉందని పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పు శాఖల  మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. పులుల

సంరక్షణ పై 4వ ఆసియా మంత్రుల

సమావేశంలో మంత్రి ప్రసంగించారు.  గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ దిశగా పురోగతిని, పులుల సంర క్షణకు నిబద్ధతలను

సమీక్షించడానికి ఈ కీలక సమావేశం జరిగింది.

 

భారతదేశ ప్రకటనను వినిపిస్తూ, పులుల సంరక్షణ పై 4వ ఆసియా మంత్రుల సమావేశాన్ని నిర్వహించినందుకు మలేషియా ప్రభుత్వానికి, గ్లోబల్ టైగర్ ఫోరమ్ (జిటిఎఫ్) కు అభినందనలు తెలిపారు. "సెంట్రల్ స్పైన్, ల్యాండ్‌స్కేప్ లెవెల్ ప్లానింగ్" రూపంలో పులుల ఆవాసాలలో లీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి ఉపశమన చర్యల కోసం రోల్ మోడల్‌ను రూపొందించడంలో మలేషియా ప్రభుత్వం చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు.

 

ఈ ఏడాది చివర్లో రష్యాలోని వ్లాదివోస్టోక్ లో జరగనున్న గ్లోబల్ టైగర్ సమ్మిట్ కోసం న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ఖరారు చేసే దిశగా టైగర్ రేంజ్ దేశాలకు భారత్ అవకాశం కల్పిస్తుందని మంత్రి తెలిపారు. 2010లో న్యూఢిల్లీలో "ప్రీ టైగర్ సమ్మిట్" సమావేశం జరిగింది, ఇందులో గ్లోబల్ టైగర్ సమ్మిట్ కోసం పులుల పరిరక్షణపై ముసాయిదా ప్రకటనను ఖరారు చేశారు.

 

2022 లక్ష్య సంవత్సరం కంటే 4 సంవత్సరాల ముందు 2018 లోనే పులుల జనాభా  ను రెట్టింపు చేసిన అత్యద్భుతమైన ఘనతను భారత దేశం సాధించిందని పేర్కొంటూ,

భారత దేశ పులుల యాజమాన్య విజయ నమూనా ఇప్పుడు లయన్, డాల్ఫిన్, చిరుత పులి, మంచు చిరుత పులి ఇతర చిన్న అడవి పిల్లుల వంటి ఇతర వన్యప్రాణులకూ  ప్రతిఫలిస్తోందని , ఇదే సమయంలో దేశం తన చారిత్రక పరిధిలో చిరుతను పరిచయం చేసే దశలో ఉన్నట్లు శ్రీ యాదవ్ తెలిపారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో పులుల సంరక్షణకు బడ్జెట్ కేటాయింపు 2014 లో రూ.185 కోట్ల నుండి 2022 లో రూ.300 కోట్లకు పెరిగిందని, భార త దేశంలో 14 టైగర్ రిజ ర్వ్ లకు ఇప్పటికే

అంతర్జాతీయ సిఎ /టి ఎస్ ను ప్రదానం చేసినట్లు మంత్రి తెలిపారు. మరిన్ని టైగర్ రిజర్వ్ లను సి ఏ/టిఎస్ అక్రిడిటేషన్ కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయనీ తెలిపారు.

 

ఫ్రంట్ లైన్ సిబ్బంది , కమ్యూనిటీ పాత్ర పై మంత్రి మాట్లాడుతూ, ఫ్రంట్ లైన్ సిబ్బంది పులుల సంరక్షణ లో కీలక పాత్ర పోషిస్తున్నారని,  అందువల్ల కార్మిక ఉపాధి

మంత్రిత్వ శాఖ  ఇటీవల ప్రవేశపెట్టిన   ఇ-షర్మ్ కింద ప్రతి ఒప్పంద/తాత్కాలిక కార్మికుడికి రూ.2 లక్షల జీవిత బీమాను వర్టింప చేశామని, అలాగే ఆయుష్మాన్ యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య భీమా కల్పించామని మంత్రి వివరించారు.

 

‘’ భారతదేశంలోని 51 టైగర్ రిజర్వ్ ల ద్వారా సుమారు 4.3 మిలియన్ పని దినల  ఉపాధిని కల్పించాం. టైగర్ రిజర్వ్ ల ప్రధాన ప్రాంతాల నుంచి స్వచ్ఛంద గ్రామ పునరావాసాన్ని ప్రోత్సహించడం కోసం కాంపెన్సేటరీ ఆఫ్ ఫారెస్టింగ్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) నుంచి నిధులను ఉపయోగిస్తున్నారు." అని శ్రీ యాదవ్ తెలియజేశారు.

 

"పర్యావరణ వ్యవస్థలో అగ్రశ్రేణి వేటాడే పులులు పర్యావరణ ప్రక్రియలను నియంత్రించడంలో , శాశ్వతం చేయడంలో కీలకం. ఈ అగ్ర మాంసాహార పులుల పరిరక్షణను నిర్ధారించడం అటవీ పర్యావరణ వ్యవస్థల శ్రేయస్సుకు, అవి ప్రాతినిధ్యం వహించే జీవవైవిధ్యంతో పాటు నీరు ,వాతావరణ భద్రతకు హామీ ఇస్తుంది." అని భారత పర్యావరణ మంత్రి పేర్కొన్నారు.

 

పులుల శరీర భాగాలు , ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ కారణంగా వ్యవస్థీకృత వేటాడటం పెరగడం, పులుల ఆహారం క్షీణించడం , ఆవాసాల నష్టం పులుల సంరక్షణకు కీలకమైన సవాళ్లని అంటూ శ్రీ యాదవ్, అడవి పులుల స్థితి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో కొనసాగుతోందని అన్నారు. - పులుల మనుగడను  కూడా ప్రభావితం చేసే దేశ-నిర్దిష్ట, ప్రాంత-నిర్దిష్ట సమస్యలు ఉన్నాయని, ఈ పరిస్థితి, చురుకైన అంతర్జాతీయ సహకారాన్ని , అదేవిధంగా సహ అనుకూల ,చురుకైన నిర్వహణ అవసరాన్ని సూచిస్తోందని  శ్రీ యాదవ్ అన్నారు.

 

భారతదేశంలో పులులకు  ఎత్తైన పర్వతాలు, మడ అడవుల చిత్తడి నేలలు, ఎత్తైన గడ్డిభూములు, పొడి ,తేమ ఆకురాల్చే అడవులు, అలాగే సతతహరిత అటవీ వ్యవస్థల వరకు వివిధ రకాల ఆవాసాలుగా ఉన్నాయి. దీని ద్వారా, పులి ఒక పరిరక్షణ చిహ్నం మాత్రమే గాక, ఇది భారత ఉపఖండంలోని పర్యావరణ వ్యవస్థలో ఎక్కువ భాగం గొడుగు జాతిగా కూడా ఉంది.

 

టైగర్ రేంజ్ కంట్రీస్ - గ్లోబల్ టైగర్ ఫోరమ్ అంతర్ ప్రభుత్వ వేదిక వ్యవస్థాపక సభ్యులలో భారతదేశం ఒకటి, సంవత్సరాలుగా, జిటిఎఫ్ అనేక థీమాటిక్ ప్రాంతాలపై తన కార్యక్రమాన్ని విస్తరించింది, అదే సమయంలో భారత ప్రభుత్వం, భారతదేశంలోని పులుల రాష్ట్రాలు పులుల శ్రేణి దేశాలతో కూడా సన్నిహితంగా పని చేస్తోంది. 

 

***



(Release ID: 1791685) Visitor Counter : 260