యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ యుద్ధ స్మారక స్థలాన్ని దర్శించిన మీరాబాయి
శౌర్యం, త్యాగానికి సమాహారమైన ఈ ప్రదేశాన్ని ప్రతి భారతీయుడూ దర్శించాలన్న మీరా
Posted On:
17 JAN 2022 2:07PM by PIB Hyderabad
భారతీయ భద్రతా దళాల సాహసం, పరాక్రమం, త్యాగానికి గౌరవసూచకంగా న్యూఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక స్థలాన్ని భారత సిల్వర్ గర్ల్ సాయిఖోం మీరాబాయ్ చాను సోమవారం సందర్శించారు.
నలభై ఎకరాల బహిరంగ ప్రదేశంలో నిర్మించిన స్మారక చిహ్నాన్ని పర్యటించడం గురించి మాట్లాడుతూ, ఢిల్లీలో నేను సాధారణంగా టోర్నమెంట్‌ల కోసం బస చేసే దాన్ని, అయితే, కేవలం సాయుధ దళాలకు మాత్రమే కాక ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా ఉండే ఈ ప్రదేశాన్ని సందర్శించాలని నా పర్యటన ప్రణాళికలో పొందుపరచుకున్నాను, అని ఒలింపిక్ మెడలిస్ట్ పేర్కొంది.
1947 నుంచి భారత ఘన యుద్ధ చరిత్రను వర్ణిస్తూ, వెలుగులోకి రాని వీరుల కథలు, ప్రయాణం, పోరాటాలకు ప్రాదేశిక వ్యక్తికరణలుగా వ్యక్తీకరిస్తూ, వారి పునర్జన్మనిస్తున్న భావనతో ఈ స్మారకాన్ని నిర్మించారు.
భారతీయ చరిత్రలో సైన్యం, నావికాదళం, వైమానిక దళాలు పోరాడిన ప్రముఖ చారిత్రిక యుద్దాలలో పోరాడిన వారి వీర గాథలను తెలుసుకుంటూ, పాక్షిక బహిరంగ కారిడార్, గ్యాలరీలో నడుస్తూ, ఈ స్మారక చిహ్నాన్ని నిర్మాంచాలన్న భావన చారిత్రికమైన చక్రవ్యూహ నిర్మాణం స్ఫూర్తితో ఈ స్మారకాన్ని నిర్మించాలన్న భావన నన్ను ముగ్ధురాలిని చేసింది. అంతేకాదు, భూమి పుత్రులు పోరాడిన యుద్ధ ఘటనలను వర్ణించే కాంస్య కుడ్యచిత్రాలతో గోడలను అలంకరించడం ఎంతో ఆకర్షించింది, అని మీరా అన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత, ప్రతి భారతీయుడూ తమ జీవితంలో ఞక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించాలని నేను తీవ్రంగా భావిస్తున్నాను అని మీరు అభిప్రాయపడ్డారు.
తన పర్యటనలో భాగంగా భారతీయ వెయిట్ లిఫ్టర్ తమ స్వంత రాష్ట్రమైన మణిపూర్‌కు చెందిన అత్యున్నత పీస్ టైమ్ శౌర్య అవార్డు అయిన అశోక్ చక్రను పొందిన అమరవీరుడు మేజర్ లైష్‌రాం జ్యోతిన్ సింగ్‌కు నివాళులు అర్పించారు.
***
(Release ID: 1790583)
Visitor Counter : 194