ఆయుష్

ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కారాలు ఆచరించిన కోటి మందికి పైగా ప్రజలు


ఆరోగ్య అంశంపై ప్రపంచానికి సందేశం అందించిన భారతదేశం

Posted On: 15 JAN 2022 11:05AM by PIB Hyderabad

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌' వేడుకల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ' శక్తి కోసం సూర్య నమస్కారం' కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంతో సహా వివిధ దేశాలకు చెందిన 75 లక్షలకు పైగా ప్రజలు కార్యక్రమంలో పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండి  కోవిడ్ మహమ్మారి నుంచి తమనుతాము రక్షించుకునేలా ప్రజలను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ముంజ పర మహేంద్రభాయ్ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్ఆచార్య బాలకృష్ణశ్రీశ్రీ రవిశంకర్సద్గురు జగ్గీ వాసుదేవ్ తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన  పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన శ్రీ  సర్బానంద సోనోవాల్ శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సూర్య నమస్కారం ద్వారా సూర్య ఆరాధన  జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మానవాళి శ్రేయస్సు కోసం యోగ, సూర్య నమస్కారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ఆదరణ లభించేలా చూసేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. 

డాక్టర్ ముంజ పర మాట్లాడుతూ సూర్య నమస్కారాలు  రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయనిశరీరాన్ని దృఢంగా ఉంచుతాయని అన్నారు.  సూర్య నమస్కారం పై సాగిన  వివిధ పరిశోధనలు ఈ అంశాన్ని నిరూపించాయని పేర్కొన్నారు. 

ఆయుష్ కార్యదర్శి  వైద్య రాజేష్ కొటెచా మాట్లాడుతూ సూర్య నమస్కారం దారా శక్తి వస్తుందని అన్నారు. సౌరశక్తి లో ఉన్న రోగ నిరోధక శక్తికి ప్రాచుర్యం కల్పించి,   ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసిందని  అన్నారు.

వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన యోగా గురువులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య నమస్కారాలను ఆచరించే విధానాన్ని ప్రదర్శించి, ఈ అంశంపై ప్రసంగించారు. 

యోగా గురు బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ సూర్య నమస్కార ఉద్యమం ద్వారా జీవించేందుకు అత్యంత అవసరమైన సూర్యరశ్మి పై ప్రజలకు అవగాహన కల్పించడం కృషి జరుగుతున్నదని అన్నారు. యోగా అంటే ప్రజలను ఏకం చేయడం అని వివరించిన రాందేవ్ బాబా ఈ కార్యక్రమం ద్వారా  75 లక్షల మందికి పైగా సూర్య నమస్కారం చేసి ఏకం అయ్యారని అన్నారు. 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ సూర్యుని శక్తి రోగనిరోధక శక్తిని అందిస్తుందని అన్నారు. రోగ నిరోధక శక్తి మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరిని రక్షిస్తుందని అన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి అంశం  సూర్యుని శక్తితో ప్రభావితం అవుతుందని అన్నారు.   ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన వివరించారు. 

జపాన్ కి చెందిన మిస్ వరల్డ్ 2021 తమకి హోషి వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ కార్యక్రమం కోవిడ్ మహమ్మారి సమయంలో మానవాళికి అండగా ఉంటుందని అన్నారు. జపాన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు సూర్య నమస్కారాలను ఆచరిస్తున్నారని తెలిపారు. యోగ జపాన్ ప్రజల నిత్య జీవితంలో భాగంగా మారిందని అన్నారు. 

సూర్య నమస్కారాలను ఆచరించి ఆరోగ్యంగా జీవించాలని ఇటలీ యోగా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ డాక్టర్ ఆంటోనియెట్ రోస్సీ ప్రజలకు సూచించారు.  అమెరికన్ యోగా అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ఇంద్రనీల్ బసు రాయ్సింగపూర్ యోగా ఇన్‌స్టిట్యూట్ సభ్యులతో సహా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని  కోవిడ్ నిబంధనలను పాటిస్తూ  సూర్య నమస్కారం చేశారు.

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ యోగా డైరెక్టర్ ఈశ్వర్ బసవరెడ్డి మాట్లాడుతూ   శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో సూర్య నమస్కారం కీలక  పాత్ర పోషిస్తుందని వివరించారు.  యోగా ప్రక్రియ ద్వారా  అనేక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చని అన్నారు. కార్యక్రమం డిడి  నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. వర్చువల్ విధానంలో కార్యక్రమంలో ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల ఆసక్తి కనబరిచారు. 

ప్రముఖ యోగా మాస్టర్లుయోగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి. హంసాజీ జయదేవ్, SVYASA విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హెచ్.ఆర్.  నాగేంద్రఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవమోక్షాయతన్ యోగాశ్రమ్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ భరత్ భూషణ్,   శ్రీరామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు దాడ్జి కమలేష్ డి పటేల్, బ్రహ్మకుమారీస్ డైరెక్టర్  రాజ్ యోగిని బికె  ఆశాడివైన్ శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు భగవతి  కృష్ణమాచార్య యోగామందిరంచెన్నై  శ్రీ శ్రీధరన్ఇటలీ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్  ఆంటోనియెట్టా రోజీ,  అమెరికన్ అకాడమీ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ ఛైర్మన్ డాక్టర్  ఇంద్రనీల్ బసు రే ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా చేరారు.

 కార్యక్రమ నిర్వహణకు  యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖవిద్యా మంత్రిత్వ శాఖరక్షణ మంత్రిత్వ శాఖఎన్‌సిసిఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మరియు ఆర్మీ సిబ్బందితో సహా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారం అందించాయి.  

***



(Release ID: 1790075) Visitor Counter : 155